ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాలో 22 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి తన ఇద్దరు కన్నబిడ్డలను హతమార్చింది. మంజు అలియాస్ తస్లీమాఖాన్ అనే ఈ మహిళ తన నాలుగేళ్ల కొడుకు ఈద్ మహ్మద్ను, ఏడాది వయసున్న కుమార్గె సబీనాను గొంతుపిసికి చంపేసింది. కోయో అలియాస్ అమృత్ అనే తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పిల్లలిద్దరినీ తానే చంపేసినట్లు ఆమె అంగీకరించింది. అనంతరం నేరం జరిగిన తీరును పోలీసులకు వివరించింది.
ఓ కేసులో ఆమె భర్త రబూల్ అన్సారీ జైలుకు వెళ్లడంతో కొన్ని నెలల క్రితం ఆమె కోయోతో ప్రేమలో పడింది. తమ ప్రేమ వ్యవహారాలకు పిల్లలు అడ్డుగా ఉన్నారని, వాళ్లను చంపేయాలని కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు. జూన్ 27వ తేదీన ఇద్దరూ కలిసి పిల్లలను జోష్పూర్ శివార్లలోని స్మృతి వనానికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ పిల్లలిద్దరినీ చంపేసి బావిలో పారేశారు. అనంతరం ఇద్దరూ ఢిల్లీకి పారిపోయారు. అక్కడ ఓ వారం ఉన్న తర్వాత మళ్లీ సొంతూరికి వచ్చారు. అయితే.. ఇటీవల వారం క్రితం తన ప్రియుడు తనపై అత్యాచారం చేశాడంటూ తస్లీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపు పిల్లలు కనిపించడంలేదని ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో తస్లీమాను విచారించగా.. విషయం బయటపడింది.
ప్రియుడితో కలిసి ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
Published Fri, Aug 1 2014 8:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement