Mother kills
-
అప్పుడే పుట్టిన కవలల్ని చంపేసి...
టీనగర్: వివాహేతర సంబంధంతో అప్పుడే పుట్టిన ఇద్దరు మగపిల్లలను ఓ తల్లి చంపిన ఘటన తిరుపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత తల్లికి కూడా ఫిట్స్ రావడంతో ఆమె కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్లితే కొళత్తుపాళయం సమీపంలోని కృష్ణాపురానికి చెందిన శివకామి(37)కి 19 ఏళ్ల క్రితం రామసామితో వివాహమైంది. వీరికి దివ్య(16) అనే కూతురు ఉంది. అయితే కొన్నాళ్లకు రామసామి మృతి చెందడంతో కుమార్తె దివ్యను పుట్టింట్లోనే వదిలిపెట్టి వెల్లావిపుదూరుకు చెందిన షణ్ముగాన్ని శివకామి రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక మగబిడ్డ జన్మించడంతో అతనికి శంకర్ అనే పేరు పెట్టారు. అతనికి ప్రస్తుతం ఆరేళ్లు. కొన్నాళ్లకు షణ్ముగం కూడా మృతిచెందాడు. దీంతో ఆమె శంకర్‌ను షణ్ముగం తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి కరయూరు సమీపంలో గల ఒక తోటలో పనికి కుదిరింది. ఈ క్రమంలోనే శివగామి మళ్లీ గర్భవతి అయింది. నిండు చూలాలైన ఆమెకు తరచూ ఫిట్స్ వచ్చేవి. పురిటినొప్పులు రావడంతో అటవీప్రాంతం సమీపంలోని పొదల్లో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. ఈ పిల్లలకు తండ్రి ఎవరని అడుగుతారనే భయంతో ఆమె బిడ్డలను హతమార్చినట్లు సమాచారం. అదే సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కూతుర్ని చంపి....తానూ చనిపోయింది
-
కన్న కొడుకునే..కడతేర్చిన కన్న తల్లి
-
కన్న కొడుకును కడతేర్చిన తల్లి
-
ముగ్గురు కూతుళ్లతోపాటు తల్లి ఆత్మహత్య
-
ప్రియుడితో కలిసి ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్ జిల్లాలో 22 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి తన ఇద్దరు కన్నబిడ్డలను హతమార్చింది. మంజు అలియాస్ తస్లీమాఖాన్ అనే ఈ మహిళ తన నాలుగేళ్ల కొడుకు ఈద్ మహ్మద్‌ను, ఏడాది వయసున్న కుమార్గె సబీనాను గొంతుపిసికి చంపేసింది. కోయో అలియాస్ అమృత్ అనే తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పిల్లలిద్దరినీ తానే చంపేసినట్లు ఆమె అంగీకరించింది. అనంతరం నేరం జరిగిన తీరును పోలీసులకు వివరించింది. ఓ కేసులో ఆమె భర్త రబూల్ అన్సారీ జైలుకు వెళ్లడంతో కొన్ని నెలల క్రితం ఆమె కోయోతో ప్రేమలో పడింది. తమ ప్రేమ వ్యవహారాలకు పిల్లలు అడ్డుగా ఉన్నారని, వాళ్లను చంపేయాలని కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు. జూన్ 27వ తేదీన ఇద్దరూ కలిసి పిల్లలను జోష్పూర్ శివార్లలోని స్మృతి వనానికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ పిల్లలిద్దరినీ చంపేసి బావిలో పారేశారు. అనంతరం ఇద్దరూ ఢిల్లీకి పారిపోయారు. అక్కడ ఓ వారం ఉన్న తర్వాత మళ్లీ సొంతూరికి వచ్చారు. అయితే.. ఇటీవల వారం క్రితం తన ప్రియుడు తనపై అత్యాచారం చేశాడంటూ తస్లీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపు పిల్లలు కనిపించడంలేదని ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో తస్లీమాను విచారించగా.. విషయం బయటపడింది. -
ఐదు రోజుల పసికందును చంపిన తల్లి
సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఎయిడ్స్ సోకిందనే అనుమానంతో ఐదు రోజుల పసికందును కన్న తల్లి గొంతు నులిమి చంపింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆ పసి పాపను ఆసుప్రతికి తరలించారు. అయితే ఆ పాప అప్పటికే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసి కందు కన్న తల్లిని అదుపులోకి తీసుకున్నారు.