హృదయం ద్రవించిపోతోంది | Ys jagan mohan reddy sadness about rajamandry puskaras incident | Sakshi
Sakshi News home page

హృదయం ద్రవించిపోతోంది

Published Wed, Jul 15 2015 3:14 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Ys jagan mohan reddy sadness about rajamandry puskaras incident

పుష్కర దుర్ఘటనపై ట్విట్టర్‌లో వైఎస్ జగన్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రాజమండ్రి దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను చూసి తన హృదయం ద్రవించిపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. మానవత్వం లేని ఈ అసమర్థ ప్రభుత్వ తీరుకు పుష్కర యాత్రికులు తీవ్రంగా కలత చెంది ఉన్నారని ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ దుర్ఘటన జరక్కుండా చంద్రబాబు  ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందని, తమ ప్రాణాల భద్రతపై యాత్రికులకు ఎలాంటి సందేహాలు లేనివిధంగా ప్రభుత్వం వ్యవహరించి ఉండాల్సిందని ఆయన అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలపై గోదావరి తల్లి దివ్యమైన ఆశీస్సులు ఉండాలని, ఈ పుష్కరాలు శాంతియుతంగా, సంతోషంగా ముగియాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement