గేదెలకు బీమా.. యజమానులకు ధీమా | insurance buffalo .. owners have confidence | Sakshi
Sakshi News home page

గేదెలకు బీమా.. యజమానులకు ధీమా

Published Mon, Aug 25 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

insurance buffalo .. owners have confidence

లక్సెట్టిపేట : పశువులకు బీమా చేయించడం ద్వారా పాడి పశువులపై ఆధారపడి జీవనోపా ధి పొందుతున్న వారికి లాభదాయకంగా ఉం టుంది. వ్యాధులు, విద్యుదాఘాతం, ప్రమాదాల్లో పశువులు మృత్యువాతపడుతున్నాయి. దీంతో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించి ప శువులకూ బీమా సౌకర్యం కల్పించిందని జి ల్లా పశు వైద్యాధికారి నర్సయ్య వివరించారు. గత సంవత్సరం 16 కేసులు నమోదు కాగా వాటికి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయించాం.

 గేదెలకు..
 పాడిపరిశ్రమపై శ్రద్ధ ఉన్నవారికి ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతూ వారికి అనుకూలంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. టీఎస్‌ఎల్‌ఎస్‌డీఏ(తెలంగాణ స్టేట్ లైఫ్ స్టాక్ డెవలప్‌మెంటు ఏజెన్సీ)  పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో డీఎల్‌ఎస్‌డీఏ(డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్‌మెంటు ఏజెన్సీ) న్యూఇండియా ఇన్స్యూరెన్స్ పేరుతో జిల్లాలోని పశువులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మండల పశువైద్య కేంద్ర సిబ్బంది వద్ద దరఖాస్తులు లభిస్తాయి. రైతులు వాటిని పూర్తి చేసి పంపిస్తే మిగితా వివరాలు వైద్యాధికారులు తెలియజేస్తారు.

 ప్రీమియం చెల్లించే విధానం..
 పశువుల్లో గేదెలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. రూ.1,550 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సబ్సిడీపై డీఎల్‌ఎస్‌డీఏ 50శాతం భరిస్తుంది. అంటే యజమాని రూ.775 చెల్లిస్తే మూడేళ్ల వరకు బీమా పొందే అవకాశం లభిస్తుంది. పాలు ఇచ్చే గేదెలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత ఇన్స్యూరెన్స్ సిబ్బంది పశువును పరిశీలించి వాటి చెవులకు ఒక ట్యాగ్ వేస్తారు. అప్పటి నుంచి బీమా వర్తిస్తుంది.  

 పొందే విధానం..
 గేదెలకు బీమా చేయించడం ద్వారా అవి మరణించినప్పుడు వాటి విలువను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా కంపె నీ వారు నిర్ణయించి చెల్లిస్తారు. దీంతోపాటు యజమాని మరణిస్తే రూ.50వేలు బీమా మొత్తాన్ని కుటుంబానికి అందజేస్తారు. ఒక యజమాని ఇంటి నుంచి కేవలం రెండు పశువులకు మాత్రమే బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంటుంది. బీమా సిబ్బంది వచ్చి పశువు ట్యాగ్, యజమానితో కూడిన ఫొటోను పరిశీలించి బీమా మంజూరు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement