నేచురల్ కుకింగ్
ఎండగా ఉంటే కర్డ్‌రైస్, వాన పడుతుంటే పకోడీస్... వాతావరణానికి తగ్గట్టు ఇళ్లలో వంటకాలు కూడా మారుతుంటాయ్. అతిథుల అభి‘రుచులే’ తమకి అత్యుత్తమ ప్రాధాన్యతగా చెప్పే రెస్టారెంట్లు కూడా అదే బాట పట్టక తప్పదు కదా. అందుకే అలా తొలకరి జల్లు కురవగానే ఇలా మన రుచుల చిరునామాలు కొత్త టేస్ట్‌లను సంతరించుకుంటున్నాయి. ఒకవైపు మాన్‌సూన్, మరో వైపు రంజాన్... ఈ రెండూ ప్రస్తుతం రెస్టారెంట్ల మెనూల తీరుతెన్నులను నిర్దేశిస్తున్నాయి.
- సిటీప్లస్
మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్న ‘ఆలివ్ బిస్ట్రో’ రెస్టారెంట్ మాన్‌సూన్ స్పెషల్ మెనూ రూపొందించింది. వెజ్, నాన్‌వెజ్ స్టార్టర్స్, స్నాక్స్, మెయిన్‌కోర్సు వంటకాలతో పాటు విభిన్న ఫ్లేవర్స్‌తో మాక్‌టైల్స్, జ్యూస్, సలాడ్స్‌ను బిస్ట్రో అందుబాటులోకి తెచ్చింది. దీని విశేషాలేమిటంటే...
సీ ఫుడ్ ఎన్ ఆర్డర్
రాడిసన్ హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ద ఓరియంటల్ బ్లోసమ్ రెస్టారెంట్‌లో ‘సీ ఫుడ్ మార్కెట్’ పేరుతో వెరైటీ ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. దీని విశేషాలేమిటంటే... విభిన్న రకాల సముద్రజీవులను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. అతిథులు వాటిని చూసి తమ అభి‘రుచి’ని తెలియజేస్తే అప్పటికప్పుడు వండి వడ్డిస్తారు. ఇక సలాడ్స్‌లో గ్రిల్డ్ చికెన్ సలాడ్, ఫిష్ స్టూవ్ సలాడ్, ఎగ్ సలాడ్, క్రీమీ చికెన్ సాసేజ్ ఇక్కడ స్పెషల్‌గా చెప్పవచ్చు.
ఎసిడిటీ రాకుండా...
‘చిల్లీ ఫెక్స్, మాస్టర్ సాస్, సాల్ట్, పెప్పర్, తగినన్ని కూరగాయలు, కొంచెం టమాటా సాస్‌తో మెక్సికన్ ఫిష్ సలాడ్ వండుతాం. గ్రిల్డ్ చికెన్ సలాడ్‌లో చికెన్ సాసేజ్, క్రీమ్ ఫ్రెష్, మైజ్, పెప్పర్, సాల్ట్, కొంచెం మాస్టర్ సాస్ ఉపయోగిస్తాం. చేపల కర్రీలలో వెల్లుల్లి ఎక్కువగా వాడతాం. దీనివల్ల ఎసిడిటీ నివారించవచ్చు’ అని చెఫ్ రశ్మికాంత్ చెప్పారు.
స్పెషల్ ‘పార్క్’
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ రోడ్‌నం 2లో ఉన్న పార్క్‌హయత్ హోటల్ స్పెషల్ మెనూని అందిస్తోంది. హోటల్‌లోని ది డైనింగ్‌రూమ్‌లో అందిస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. దీని కోసం చెఫ్ మీరజ్ ఉల్ హక్‌ను నగరానికి రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో విభిన్నంగా తీర్చిదిద్దిన మెనూలో ప్రపంచవ్యాప్తంగా రంజాన్ స్పెషల్‌గా లభించే రుచులను, ముఖ్యంగా హైదరాబాదీ వంటకాలను వడ్డిస్తారు. ఒకరికి రూ.1,500 చార్‌జ చేస్తారు.
నేచురాలిటీకి దగ్గరగా ఉండేలా చెక్క ట్రేలలో వడ్డించడం, కలపతో వండటం
- ఫ్లాట్‌బ్రెడ్స్ అండ్ కాల్జోన్స్, స్మోక్డ్ చికెన్, క్వినోవా సలాడ్, గ్రీన్ ఆపిల్ ఫెటా అండ్ ఫైన్ నట్ -సలాడ్, ఇటాలియన్ రెసిపీ ఫార్మ్ హౌస్ మైన్‌స్ట్రోన్, లాంబ్ మీట్‌బాల్స్, గ్లేజ్డ్ పోర్క్ రిబ్స్, పుల్డ్ బిబిక్యూ పోర్క్ బాప్, స్మోక్డ్ సాల్మన్ బాజెల్ మెనూకే హైలైట్‌గా నిలుస్తున్నాయి.
- గ్రిల్డ్ వెజిటెబుల్ ప్లాటర్, కాన్‌ఫిట్ చికెన్ లెగ్స్, వుడ్ ఫైర్ పిజ్జాలు, రెడ్‌వైన్ బ్రైస్డ్ లాంబ్ షాంక్, హోం మేడ్ ఐస్‌క్రీంలు కూడా నోరూరిస్తాయి.
- లండన్ నేషనల్ చెఫ్ ఆఫ్ ద ఇయర్ కాంపిటీషన్‌కు వరుసగా నామినేట్ అయిన చెఫ్ సుజన్ ఎస్ బిస్ట్రో ఈ మెనూను రూపొందించారు.
రాజస్థానీ రుచులు
రొటీన్‌కు భిన్నంగా విభిన్న వంటకాలతో ‘గుజరాతీ, రాజస్థానీ థాలీ ఫుడ్ ఫెస్టివల్’ అందిస్తోంది అబిడ్‌స హోటల్ ఫిడాల్గో. కాస్తంత కొత్తగా రుచులు కోరుకొనేవారు ఇక్కడ వసందైన వెరైటీలను లాగించేయువచ్చు. ఒకరికి రూ.249. ఈ నెల 27 వరకు ఈ ఫెస్ట్ అందుబాటులో ఉంటుంది.