స్టార్ టేస్ట్ ఇంటి కిచెన్.. చెఫ్ వచ్చెన్.. | today world chef day... | Sakshi
Sakshi News home page

స్టార్ టేస్ట్ ఇంటి కిచెన్.. చెఫ్ వచ్చెన్..

Published Sun, Oct 19 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

స్టార్ టేస్ట్ ఇంటి కిచెన్.. చెఫ్ వచ్చెన్..

స్టార్ టేస్ట్ ఇంటి కిచెన్.. చెఫ్ వచ్చెన్..

నేడు వరల్డ్ చెఫ్ డే
మీరు సిటీలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఫుడ్ బాగా నచ్చింది. ఆ ఫుడ్ మీకు పదే పదే కావాలనిపిస్తే ఏం చేస్తారు?. అదే రెస్టారెంట్‌కు రౌండ్స్ కొడతారు. సిటీలోని రిచ్‌పీపుల్ అలా చేయరు. ఏకంగా ఆ రుచుల్నే ఇంటికి రప్పించుకుంటున్నారు. అంటే అక్కడి ఫుడ్‌ని ఆర్డర్ చేసి కాదండోయ్.. ఆ రెస్టారెంట్‌లో చెఫ్‌నే తమ కిచెన్‌లోకి రప్పించుకుని..!. ఇప్పుడు సిటీలో ఇంటి వంటగదిలో స్టార్ హోటల్ చెఫ్‌ను పెట్టుకోవడం స్టేటస్ సింబల్‌గా మారింది.
- ఎస్.సత్యబాబు.
 
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు గట్రా పూర్తి చేసి ఏదైనా రెస్టారెంట్‌లో చెఫ్‌గా ఉద్యోగం దక్కించుకుని హ్యాపీగా బండి లాగించేస్తున్న వాళ్లకు ఇప్పుడు సిటీలోని సంపన్నుల నుంచి అనూహ్యమైన ఆఫర్లు వచ్చి పడుతున్నాయ్. ఇంట్లోనే స్టార్ ఘుమఘుమలు కావాలనుకుంటున్న బడాబాబులు వీరికి బంపర్ ఆఫర్‌లు ఇచ్చి మరీ తమ కిచెన్‌లకు కింగ్ లై.. కమ్మని రుచుల్ని అందించమంటూ రెడ్‌కార్పెట్లు పరుస్తున్నారు. దీంతో వీరిలో పలువురు రెస్టారెంట్స్ చెఫ్‌ల నుంచి హోమ్ చెఫ్‌లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం నగరంలోని సినిమా, స్పోర్ట్స్, బిజినెస్, పొలిటికల్ రంగ ప్రముఖులు చాలా మంది ఇళ్లలోనే ‘స్టార్’ చెఫ్‌లను నియమించుకుంటున్నారు.
 
ఇంట్లో చెఫ్ ఎందుకు?
తరచుగా విదేశీ ప్రయాణాలు చేస్తున్న నగరవాసులకు విభిన్న ప్రాంతాల రుచులు పరిచయమవుతున్నాయి. ఇండియన్, కాంటినెంటల్, యూరోపియన్.. ఇలా అన్ని రకాల క్వీజిన్ టేస్ట్‌లను అందించే  చెఫ్ అందుబాటులో ఉంటే ఎప్పుడు ఏది కావాలంటే అది టేస్ట్ చేయవ చ్చునని రిచ్ సర్కిల్ భావిస్తోంది. అంతేకాక నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్‌లోని కొన్ని విశాలమైన, బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే సెంట్రల్ కిచెన్‌లలో చెఫ్‌ల అవసరం పెరుగుతోంది. ఆయా నివాసాలకు గెస్ట్‌లుగా వచ్చేవారిలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందినవారు మాత్రమే కాకుండా విదేశీ అతిథులూ ఉంటున్నారు. వీరికి అవసరమైన రుచులను వండి వడ్డించేందుకు చేయి తిరిగిన చెఫ్‌లు తప్పనిసరి అవుతున్నారు.
 
రెట్టింపుతో ‘చెక్’
వాస్తవానికి పెద్ద పెద్ద రెస్టారెంట్ గ్రూప్స్‌లో పనిచేసే చెఫ్‌లను ఇంటి  కిచెన్‌కు రప్పించడం చాలా కష్టం. ఎందుకంటే రెట్టింపు జీతం, అడ్వాన్స్‌లు ఆఫర్ చేసినా ఒక పెద్ద గ్రూప్‌ను కాదనుకుని రారు. అందుకని ఓ మోస్తరు హోటల్స్, పెద్దగా బ్రాండ్ వాల్యూ లేని వాటిలో పనిచేసేవారిని ఊహించని ఆఫర్లతో దారికి తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి వీరు ఆఫర్ చేసే జీతం మొత్తం ఒక చెఫ్‌గా వచ్చేదానికి రెండు, మూడు రెట్లు ఉంటోంది. ఫుల్‌టైమ్ హోమ్ చెఫ్స్ మాత్రమే కాదు పార్ట్‌టైమ్ పర్సనల్ చెఫ్‌లకూ డిమాండ్ పెరుగుతోంది. ఏదైనా ప్రాజెక్ట్ మీద సిటీకి వచ్చి కొన్ని రోజులు లేదా నెలల పాటు గడిపి వెళ్లిపోయేవారికి చేసే మర్యాదల్లో భాగంగా పర్సనల్ చెఫ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా టెంపరరీ, ఫుల్‌టైమ్ చెఫ్‌లను సరఫరా చేసేందుకు కొన్ని ఏజెన్సీలూ వెలుస్తున్నాయి. ఏతావాతా... సిటీలో పర్సనల్, హోమ్ చెఫ్‌ల వ్యవస్థ శరవేగంగా ఎదుగుతోంది. తద్వారా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసే యువత ఉపాధి అవకాశాలను మరింత పెంచుతోంది.
 
ఇంట్లో స్టార్ రుచులు
‘ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు వెళ్లినప్పుడు చెఫ్ చందర్ పరిచయమయ్యాడు. ప్రస్తుతం మా కిచెన్‌లో తను వర్క్ చేస్తున్నాడు’ అని చెప్పారు గచ్చిబౌలిలోని జయభేరి హైట్స్‌లో నివసించే రవీందర్. తాను ఎక్కడికైనా వెళ్లినప్పుడు కొత్త మెనూలు చూస్తే అది ఫొటో తీసి వాట్సప్‌లో పంపుతానని, అక్కడి నుంచి తను తిరిగి వచ్చేటప్పటికి తమ చెఫ్ అది రెడీ చేసి ఉంచుతాడని వివరించారాయన. అలాగే కొన్ని రెస్టారెంట్స్‌కి తననే తీసుకెళ్లి అక్కడి వంటకాలు చూపిస్తానన్నారు. ఇంటి కి తిరిగి రాగానే ఆ స్టార్ రుచులు తమ ఇంట్లో ప్రత్యక్షమవుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement