కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాని కార్చిచ్చు కమ్మేస్తోంది. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు అని అధికారులు తెలిపారు. గత శుక్రవారం నుంచి సుమారు 2,83,800 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు రాంచ్ ఫైర్, రివర్ ఫైర్‌గా రెండు చోట్ల నుంచి వ్యాపిస్తూ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 75 ఇళ్లు కాలిబూడిదయ్యాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. కాలిఫోర్నియా మొత్తం 16 చోట్ల కార్చిచ్చు రగులుతోంది. ఆ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా నిరంతరం పనిచేస్తోంది. కాలిఫోర్నియా పర్యావరణ చట్టాల లోపం వల్లే కార్చిచ్చు ఆ రాష్ర్టాన్ని దావానలంలా మింగేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లను స్థానికులు ఖండించారు.
California wildfires are being magnified & made so much worse by the bad environmental laws which aren’t allowing massive amounts of readily available water to be properly utilized. It is being diverted into the Pacific Ocean. Must also tree clear to stop fire from spreading!
— Donald J. Trump (@realDonaldTrump) August 6, 2018
Comments
Please login to add a commentAdd a comment