paris olympics 2024
ప్రధాన వార్తలు
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)
'బాబర్ కూల్‌గా ఉండు.. రోహిత్ 30 ఏళ్లు దాటాక 35 సెంచరీలు చేశాడు'
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ బాబర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో బాబర్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల సిరీస్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. ఈ క్రమంలో బాబర్ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడిని జట్టు నుంచి తప్పించాలని పాక్ మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరొక పాకిస్తాన్ క్రికెటర్ సోహైబ్ మక్సూద్ మాత్రం బాబర్‌కు మద్దతుగా నిలిచాడు. బాబర్ వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అని, అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడని మక్సూద్ థీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా భారత కెప్టెన్ రోహిత్ శర్మతో ఆజంను అతడు పోల్చాడు."రోహిత్ శర్మ తన వయస్సు 30 ఏళ్లు దాటిన తర్వాత 35 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బాబర్‌కు ఇంకా కేవలం 29 ఏళ్లు మాత్రమే. అతడికి ఇంకా చాలా క్రికెట్ ఆడే సత్తా ఉంది.కాబట్టి బాబర్ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇటువంటి సమయంలోనే ప్రశాంతంగా ఉండాలి. కచ్చితంగా అతడు తిరిగి తన రిథమ్‌ను పొందుతాడని" మక్సూద్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా పాకిస్తాన్ స్వదేశంలో తమ తదుపరి సవాల్‌కు సిద్దమవుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.
శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. ఇక అంతే సంగతి మరి?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో తీవ్ర నిరాశపరిచిన అయ్యర్.. ఇప్పుడు దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ టోర్నీలో ఇండియా-సి జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్.. ఇండియా-డితో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అయ్యర్.. ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండడంతో బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అతడి ఎంపికపై సందిగ్ధం నెలకొంది.
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్‌లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్‌డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది.
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్‌మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది.
Sumit Antil: ప్రపంచ రికార్డు... పసిడి పతకం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని భారత పారాథ్లెట్ సుమిత్ అంటిల్ పేర్కొన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు పారాలింపిక్స్ జరగనుండగా... ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ భారత బృందం పతాకధారిగా వ్యవహరించనున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్.. ఎఫ్64 విభాగంలో పోటీపడనున్నాడు. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల మూడుసార్లు బద్దలు కొట్టిన సుమిత్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్నాడు. పారా ప్రపంచ చాంపియన్‌సిప్‌లోనూ సుమిత్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సుమిత్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. ప్రాక్టీస్ లో నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నా. 80 మీటర్ల మార్క్ అందుకోవడం నా లక్ష్యం. డిఫెండింగ్ చాంపియన్ అనే ఒత్తిడి ఏం లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెడతా. 2019 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగంగా ఉన్నా. ప్రభుత్వ సహకారం వల్లే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఉద్దేశంతో ఇతర టోరీ్నల్లో ఎక్కువ పాల్గొనలేదు’ అని సుమిత్ అన్నాడు. పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
వినేశ్ ఫోగట్ కీలక నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడి పతకాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌కు విడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది.అయితే ఇప్పుడు వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్‌లో ఉద్వేగభరిత పోస్టు షేర్ చేసిన ఆమె.. అందులో పలు విషయాలను ప్రస్తావించింది. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, రెజ్లింగ్ కొనసాగించే సత్తా మాత్రం తనకు ఉందని ఫోగట్ తెలిపింది."నా బృందానికి, నా తోటి భారతీయులకు, నా ఫ్యామిలీకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా లక్ష్యాన్ని మేము ఇంకా చేరుకోలేదు. ఏదో మిస్ అయినట్లు అన్పిస్తోంది. అయితే పరిస్థితులు ఇకపై మునపటిలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు రెజ్లింగ్ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నేను నమ్మిన దాని కోసం నా పోరాటం ఆపనని వినేష్ పేర్కొంది.అదే విధంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ టీమ్‌పై ఫోగట్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరేన్ రస్కిన్హా, యతిన్ భట్కర్‌లతో పాటు చాలా మంది ఇతర అథ్లెట్లు నాకు మద్దతుగా నిలిచారు. వారి సపోర్ట్‌తోనే నేను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించగలిగాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు అంటూ ఫోగట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
టెస్టు కెప్టెన్‌గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ పంజాబీ బ్యాటర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్‌గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్‌కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్‌గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్‌ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్‌కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్‌గా భావిస్తున్న పంత్‌ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్‌ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్‌గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్‌గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!