Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Govt Fraud to Womens in AP With Thalliki Vandanam1
ఇంటింటా నిజం.. తల్లికి మోసం

ఈమె పేరు కొండేటి మరియమ్మ. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు. ఈమె కుమారుడు అవినాష్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం రూ.8,850 మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమ అవుతుందని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని ఆమె చెబుతోంది. అందరితోపాటు తనకూ సమానంగా డబ్బులు పడ్డాయంటోంది. ఇప్పుడు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇలా చేశారేమిటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి : ‘అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ను అమలు చేసి పేదరికాన్ని పారదోలుతాం.. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం..’ అని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు కూటమి సర్కారు ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రధానంగా తల్లికి వందనం పథకం గురించి చంద్రబాబు, లోకేశ్‌ సహా టీడీపీ శ్రేణులు ఊరూరా, ఇంటింటా ఊదరగొట్టాయి. అధికారం చేపట్టాక తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా మోసం చేయడం ఒక ఎత్తు అయితే.. రెండో ఏడాది అరకొరగా అమలు చేస్తూ.. చాలా గొప్పగా అమలు చేశామని డప్పు కొట్టు కోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి.. అమలు దశకు వచ్చే సరికి రూ.13 వేలే అన్నారు. వివిధ సాకులు చూపి ఏకంగా 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. తీరా మిగిలిన లబ్ధిదారుల్లో కొంత మందికి కేవలం రూ.8–9 వేలు మాత్రమే ఖాతాల్లో వేసి.. అంతా ఇచ్చేశామంటున్నారు. ఇదొక్కటే కాదు.. సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసేశామని, ఇక వీటి గురించి ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయిస్తూ మాట్లాడారు. ‘తల్లికి వందనం’ అమలుతో చంద్రబాబు చేస్తున్న దగాపై ఊరూరా మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. కొన్ని ఊళ్లలో అయితే ఏకంగా స్కూలు మొత్తం మీద ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుపేదలకు సైతం ఎగనామం పెట్టేశారు. చెప్పిందేమిటి.. చేసిందేమిటి.. అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెడ్‌మాస్టర్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకెందుకు డబ్బులు పడలేదంటూ నిలదీస్తున్నారు. ‘మేమేం చేయలేం. అలా ఎందుకు జరిగిందో మాకు తెలీదు’ అంటూ వారు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఇస్తామన్న రూ.13 వేలు కూడా ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతుంటే సమాధానం చెప్పేవారే లేరు. నష్టపోయిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. నగదు జమ కాకుండానే మెసేజ్‌లు రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు యూడైజ్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మంది ఉంటే తొలి ఏడాది అందరికీ తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది లబ్ధిదారుల్లో 30 లక్షల మందిని తప్పించింది. మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పినా.. ఆ తర్వాత రూ.13 వేలే అంది. తర్వాత సాకు దొరికిన చోటల్లా నిధుల్లో కోతపెట్టింది. కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.8,800 చొప్పున ఇచ్చి, మిగిలిన డబ్బును ఎగవేసింది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల్లో కొందరికి నగదు జమ కాగా, ఇంకొందరికి నగదు జమ కాకుండానే నిధులు జమ చేశామని వారి ఫోన్లకు సంక్షిప్త (ఎస్‌ఎంఎస్‌) సందేశాలను పంపిస్తోంది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పథకం ఎగవేతకు అనేక సాకులుగతంలోనూ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ఎగ్గొట్టిన టీడీపీ ప్రభత్వం.. ఇప్పుడు కూటమి సర్కారులోనూ అదే పంథాను అనుసరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌–6 హామీలు అమలు చేయకుండానే అన్నీ చేసేసినట్టు ప్రచారం చేసుకుంటోంది. తల్లికి వందనం పథకం అమలులో ప్రతి దశలోనూ ప్రజలను దగా చేస్తోంది. అర్హుల ఎంపికలోనూ, నిధుల మంజూరులోనూ కోతలు పెట్టింది. దీనికి వీలైనన్ని కారణాలను వెతుకుతూ విద్యార్థుల సంఖ్యను నానాటికీ తగ్గించేస్తోంది. ఇంకా తల్లికి వందనం పడని విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది దీన్ని మరింత కుదించేందుకు ఇప్పటి నుంచే పథకం రూపొందించారు. ముగ్గురికీ డబ్బులు పడలేదు మా పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవిలు ముగ్గురూ తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్‌లైన్‌లో వచ్చింది. అందరికీ పడినట్లే మాకు ముగ్గురు పిల్లలకూ కలిపి రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే ‘పేమెంట్‌ హోల్డ్‌ బై డిపార్టుమెంట్‌ ఆర్‌టీఈ’ అని చూపిస్తోంది. ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. – నూజివీడు దేవి, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం అర్హులను తగ్గించేందుకు తంటాలు ఈ ఏడాది రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే పిల్లలు యూడైజ్‌లో 87.42 లక్షల మంది నమోదై ఉంటే 67,27,164 మందికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. ఆ తర్వాత 54,94,703 మందికే పథకం ఇస్తున్నట్టు జీఓ విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో భారీగా కోత పెట్టింది. ఏటా విద్యుత్‌ బిల్లు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని సగటున నెలకు 300 యూనిట్లు లోపు వినియోగించే వారికి మాత్రమే పథకం ఇస్తామని మెలిక పెట్టింది. కానీ ఆరు నెలల కాలాన్ని సగటున పరిగణనలోకి తీసుకోకుండా చాలా మందికి అన్యాయం చేసింది. తొలుత మున్సిపల్‌ కారి్మకులకూ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన సర్కారు.. తర్వాత కేవలం శానిటేషన్‌ వర్కర్లకు మాత్రమే పరిమితం చేసింది. వారిలోనూ సగం మందికి డేటా సరిగా లేదని ఎగనామం పెట్టింది. పచ్చి మోసం.. దగా.. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. ఎలిజిబుల్‌ జాబితాల్లో మాత్రం పెయిడ్‌ అని చూపిస్తోందని, అకౌంట్‌లో మాత్రం డబ్బులు జమ కాలేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంగళవారం విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. డబ్బులు రాకపోయినా వచ్చాయంటూ మెసేజ్‌లు పంపించడంపై ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై ఇటు అధికారులు, అటు బ్యాంకర్లు, హెడ్‌మాస్టర్లు అక్కచెల్లెమ్మలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం సూపర్‌ సిక్స్‌ సహా అన్ని హామీలూ నెరవేర్చామని కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి నాలుకే మందం అంటూ హూంకరిస్తున్నారు. కూటమి సర్కారు తీరు చూస్తుంటే.. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్నట్లుందని మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. ఇంత పచ్చిగా మోసం చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hari Hara Veera Mallu X Review In Telugu2
‘హరి హర వీరమల్లు’ ట్విటర్‌ రివ్యూ

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్‌ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్‌ రావు నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌’ నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్థరాత్రే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రీమియర్స్‌ పడ్డాయి. అలాగే ఓవర్సీల్‌లోనూ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. హరిహర వీరమల్లు కథేంటి? పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Horse Scenes Ee laptop Lone edit Chesaru Anukunta 🤣🤣Jyothi Krisna Em Direct Chesinav..Worst vfx in second half #hariharaveeramallu pic.twitter.com/SyOypIQTPh— News Telugu (@neduru_thiru) July 23, 2025 హరిహర వీరమల్లు చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ దారుణంగా ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు. పవన్‌ గుర్రపు స్వారీ సన్నివేశాలపై పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. అభిమానుల సైతం ఆట్టుకునేలా సినిమా లేదని కొంతమంది ట్వీట్‌ చేస్తున్నారు. ఉన్నంత ఫస్టాఫ్‌ బాగుందని చెబుతున్నారు. సెకండాఫ్‌ మొత్తం చెడగొట్టారని, క్రిష్‌ ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందని పలువురు నెటిజన్స్‌ సెటైరికల్‌ ట్వీట్స్‌ పెడుతున్నారు.#HariHaraVeeraMallu is a lackluster period action drama, weighed down by an outdated and incoherent screenplay, further hampered by subpar technical quality! The first half is somewhat tolerable and includes a few well-executed sequences, such as the introductory block and the…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 హరిహర వీరమల్లు ఒక పేలవమైన పిరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా. రొటీన్‌ స్క్రీన్‌ప్లే, టెక్నికల్‌గా చాలా పూర్‌గా ఉందంటూ ఓ నెటిజన్‌ కేవలం 2 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.Nenu fan ne but aa graphics kosam aa ra 5y teesukunnaru hatsoff to krish🙏🙏Andhariki ante best ichindhi ante kreemdifferences endhuku vachayo ardham ayindhi.Story complete ga change chesi Padesaru 2nd half...1st half ayyaka movie hit ayipoyindhi anukunna #HariHaraVeeraMallu— loki (@loki88255310283) July 23, 2025 నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానినే.కానీ ఆ గ్రాఫిక్స్‌ కోసం 5 ఏళ్లు తీసుకున్నారంటేనే బాధగా ఉంది. క్రిష్‌కి హ్యాట్సాఫ్‌. అందరి కంటే ఆయనే బెస్ట్‌ ఇచ్చాడు. ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థం అయింది. సెకండాఫ్‌ కథ మొత్తం మార్చిపడేశారు. ఫస్టాఫ్‌ అయ్యాక మూవీ హిట్‌ అనుకున్నా.. అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడుVery good first half Second half first 40 mins avrg Last 40 mins are good !! Keeravani’s score is the heart of the film 🔥🔥🔥🔥 Kusthi fight & pre climax fights stand out ,Songs are good Vfx is below par !! Overall a good film with bad vfx #HariHaraVeeraMallureview pic.twitter.com/OirpOZznM7— HHVM Vinny 🦅🔥 (@Vinny_tweetz) July 23, 2025 ఫస్టాఫ్‌ బాగుంది.సెకండాఫ్‌ మొదటి 40 నిమిషాలు యావరేజ్‌. చివరి 40 నిమిషాలు బాగుంది. కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. కుస్తీ ఫైట్, ప్రీక్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ బాగుంది. పాటలు బాగున్నాయి. వీఎఫ్‌ఎక్స్ పని తీరు దారుణంగా ఉంది. ఓవరాల్‌గా ఇది పేలవమైన వీఎఫ్‌ఎక్స్‌ ఉన్న మంచి సినిమా అంటూ మరో నెటిజన్‌ కాస్త వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.#HariHaraVeeraMallu Strictly Mediocre 1st Half! Apart from PKs presence, a few blocks came out well mainly the intro block from the title cards to PKs introduction sequence. Keervanis bgm is the lifeline so far. However, the screenplay has an outdated feel to it in many places.…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 ఫస్టాఫ్‌ మాములుగానే ఉంది. పవన్‌ పాత్రతో పాటు, కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి, ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ నుండి పీకే పరిచయ సన్నివేశం వరకు బాగుంది. కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. అయితే, స్క్రీన్‌ప్లే చాలా చోట్ల పాత అనుభూతిని కలిగిస్తుంది. వీఎఫ్‌ఎక్స్‌ దారుణంగా ఉంది. చాలా పాత్రలకు సరైన లిప్ సింక్ లేదు. పవన్‌ పాత్ర డబ్బింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.VFX and CG are worst to the core 😤🤮🤣Ela ra asala ila, mari intha darunam ah 🫢🫣#HariHaraVeeraMalluPremiers #HHVM #hariharaveeramallu— Chay Reviews (@chay_reviews) July 23, 2025

Sakshi Guest Column On Bihar Assembly Elections3
బిహార్‌ ఎన్నికల దిక్సూచి ఎటువైపు?

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పట్నా రాజధానిగా గల బిహార్‌... సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో దేశ వ్యాప్తంగా బిహార్‌పై ఆసక్తి నెలకొంది. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రంబిహార్‌ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. రూ. 28,485 తలసరి ఆదాయంతో దేశంలోనే పేద రాష్ట్రంగా నిలిచిన బిహార్‌ అస్థిరమైన ప్రభుత్వాలతో మరింత వెనుకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ (యూ) కొద్ది కాలం తర్వాత మహాఘట్‌ బంధన్‌తో చేతులు కలిపింది. అనంతరం తిరిగి ఎన్డీఏతో జత కట్టింది. తొమ్మిది సార్లు బిహార్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్‌ కుమార్‌ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్నా, కూటమిలోని బీజేపీ ఎత్తుగడలను అంచనా వేయలేము. మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తున్న మహాఘట్‌ బంధన్‌ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ, జేడీ (యూ) సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉండటంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 43 స్థానాల్లో గెలవగా, 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే, 2024 పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను చూపుతూ, సమ స్థానాల్లో పోటీ చేయాలని జేడీ(యూ) వాదిస్తోంది. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో, జేడీ (యూ) 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. సీఎం నితీశ్‌ బిహార్‌ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధం, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ధి చేకూర్చనున్నాయి. నితీశ్‌ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారు. పార్టీల బలాబలాలుబలం సంగతి అలా ఉంటే, నిజానికి పాలక ఎన్డీఏ కూటమికి బిహార్‌లో ఆశించినంత సానుకూలత లేదు. చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారముంది. మరో పార్టీ హిందుస్థాని అవామ్‌ మోర్చ (హెచ్‌ఏఎమ్‌) ఎక్కువ స్థానాలు కోరుతుండటంతో గందరగోళం నెలకొంది. అలాగే 20 ఏళ్లుగా జేడీ (యూ) అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత గుదిబండగా మారనుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ ఆశించిన మేర జరగకపోవడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని మహాఘట్‌ బంధన్‌ సానుకూలంగా మలచుకుంటే ఎన్డీఏకు తిప్పలు తప్పవు. ప్రతిపక్ష మహాఘట్‌ బంధన్‌ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. నిరుద్యోగం, ఉపాధి కోసం బిహారీ యువత వలసలు, ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను యువనేత తేజస్వీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలం. మైనారిటీ, ఓబీసీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఈ కూటమి భవితవ్యం ముస్లిం, యాదవ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలతో పాటు వికాశ్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)ల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య పైనే మహాఘట్‌ బంధన్‌ విజయావకాశాలు ఆధారపడ్డాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ గెలుపు 19 చోట్లకు పరిమితం అవడం వల్లే అధికారానికి దూరమయ్యామనే భావన ఉంది. ఆ ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి జాగ్రత్త పడుతోంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ప్రజాదరణ ఉన్నా, ఆయన తండ్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో ‘జంగల్‌ రాజ్‌’గా ముద్రపడటం ఆర్జేడీకి నష్టం చేకూర్చే అంశం. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌లో రాజకీయ అదృష్టంపై దేశ వ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన్‌ సురాజ్‌ పార్టీ స్థాపించిన ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆదరణ ఉన్నా రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తు జిత్తుల మధ్య ఆయన వ్యూహాలు ఫలించడం అంత తేలిక కాదు. సోషల్‌ మీడియా వేదికలపై జన్‌ సురాజ్‌ బలంగా కనిపిస్తున్నా, సంస్థాగతంగా బలహీనంగా ఉంది. జన్‌ సురాజ్‌ గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్‌ బంధన్‌ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయం.‘సర్‌’ వివాదంఅసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బిహార్‌ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల కమిషన్‌ గణాంకాల ప్రకారం... బిహార్‌లో 40 లక్షలకుపైగా ఓటర్లపై అనుమానాలున్నాయి. వీటిలో 14 లక్షలకుపైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయంటున్నారు. 19 లక్షలకు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 7 లక్షల మంది ఇతర చోట్ల కూడా ఓటర్లుగా నమోదయ్యారు. 11 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. ఓటర్లలో బంగ్లాదేశ్, మయాన్మార్, నేపాల్‌ దేశస్థులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఏడాది కిందటి లోక్‌సభ ఎన్నికలప్పుడు రాని ఈ అంశాలన్నీ ఇప్పుడే రావడం వివాదాస్పదమవుతోంది. ((నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపథ్యంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.)) ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడావస్తే మాత్రం నితీశ్‌ వైఖరిలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి. ఎన్డీఏకు మెజారిటీ వచ్చినా నితీశ్‌ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఈ సమీకరణాల దృష్ట్యా బిహార్‌ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటు వైపు మళ్లేనో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.దిలీప్‌ రెడ్డి వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, పొలిటికల్‌ ఎనలిస్ట్‌

Parliament Monsoon Session: Both Lok Sabha and Rajya Sabha were adjourned till Thursday4
పట్టువీడని  ప్రతిపక్షాలు 

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు. ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్‌ గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే తీరు రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. నల్ల దుస్తులతో నిరసన తమ డిమాండ్లపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్‌ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్‌), జేఎంఎం, ఆర్‌జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై 28న ప్రత్యేక చర్చ ప్రతిపక్షాల డిమాండ్‌ మేరకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో తొలుత లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు.

Womens outrage over Aadabidda nidhi scheme5
నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారా?

సాక్షి, అమరావతి: ఎన్నికలప్పుడు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌.. తదితర కూటమి పార్టీల నేతలు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి నిలువునా మోసపోయామని మహిళలు మండిపడుతున్నారు. ‘అప్పుడు.. టీడీపీ నేతలు ఇంటింటికీ వచ్చి, మనిషి మనిíÙని చూపిస్తూ ఆడబిడ్డ నిధి పథకంలో ఏడాదికి నీకు రూ.18,000.. నీకు రూ.18,000 అని చెబితే నిజమేనేమోనని నమ్మాం. అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీల నేతల నిజ స్వరూపం బయట పడుతోంది’ అని దుయ్యబడుతున్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున అందజేస్తామన్న అడబిడ్డ పథకం అమలు చేయాలంటే మన ఆంధ్ర రాష్ట్రాన్నే అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిమ్మల్ని నమ్మిన పాపానికి మహిళలందరినీ నట్టేట ముంచేస్తారా? అని నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయండని అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటారా.. అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికలప్పుడు ఇదే హామీని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటూ ప్రతి బహిరంగ సభలో చెబుతూ ఓట్లు అడిగారు కదా.. ఈ లెక్కలు అప్పుడు తెలియవా? అని తూర్పారపడుతున్నారు. ఏకంగా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇలా మోసం చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తుతున్నారు. వీళ్ల మాయ మాటలు నమ్మి, గత ప్రభుత్వంలో వచ్చిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. వంటి పలు పథకాల డబ్బులను పొగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కరోనా ఉన్నప్పటికీ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు అమలు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఆ పథకాలేవీ ఆపమని చెబుతూ.. ఇంకా ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి ఇలా మోసం చేయడం తగదని, మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే 13 నెలలు పూర్తయినందున రూ.19,500 బకాయిని వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినప్పుడు ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? అంటే ఎలాంటి లెక్కలేసుకోకుండానే మేనిఫెస్టో తయారు చేశారా? ఇలా సాకులు చెప్పడం మాని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. ఈ పథకం ద్వారా ఏటా రూ.18000 అందుతాయన్న ఆశతో మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నింటినీ అడియాశలు చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందేనంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటించటం మహిళలను మోసగించటమే. ఒక మంత్రిగా ఆయన ఈ మాటలు ఎలా మాట్లాడతారు? ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? – షేక్‌ నసీరున్నీసా బేగ్, రేపల్లె, బాపట్ల జిల్లాప్రతి మహిళకు రూ.19,500 బాకీ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు చంద్రబాబు బాకీ ఉన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.­1,500 ఇస్తానని చెప్పి 13 నెలలు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం కలుపుకుని రూ.19,500 ప్రతి మహిళకు చంద్రబాబు బాకీ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశారు. మహిళలకు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని దుస్థితిలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఇంత దారుణంగా మోసం చేయడం ఎక్కడా ఉండదు. ఈ బాకీ వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. – తోటకూర స్వర్ణలత, పాత గుంటూరు ఇచ్చిన హామీలు విస్మరించడం దారుణం గత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్‌ సిక్స్‌తోపాటు అనేక హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ముఖ్యంగా ప్రతి నెలా రూ.1,500 ఆడబిడ్డ నిధిపై మాలాంటి పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని, రేపో మాపో ఇచ్చిన హామీ అమలు అవుతుందని భావించాం. అయితే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్రంలోని మహిళలను మోసగిస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. – సునీత, రెడ్డి కాలనీ, కడప, వైఎస్సార్‌ కడప జిల్లా వైఎస్‌ జగన్‌ మాటలు నిజమయ్యాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు, ప్రతి సభలోనూ గణాంకాలతో సహా వివరించారు. బాబు మేనిఫెస్టో బూటకమని చెప్పారు. ఇవాళ అదే నిజమైంది. బాబు మహిళల ఓట్ల కోసం అబద్ధపు హామీలు గుప్పించి అధికారం చేపట్టి మహిళలను నట్టేట ముంచారు. ఇది కూటమి కుట్రలో భాగమే. ఆడబిడ్డ నిధి అంతా బూటకమేనన్న నిజాన్ని మంత్రి తేల్చి చెప్పేశారు. మొన్నామధ్య ముఖ్యమంత్రి సైతం ఇదే అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. దీంతో కూటమి కుట్ర మహిళలకు అర్థమైంది. ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తుందని అనుకోలేదని ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. – ప్రసన్న కుమారి, పరిశోధక విద్యారి్థని, తిరుపతి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తారా? ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు నోటితో ఈ పథకాన్ని అమలు చేయలేమని చెప్పించడం దుర్మార్గం. ఎవరైనా ఆడబిడ్డలను నమ్మించి మోసం చేస్తారా? చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలోని మహిళలంతా మోసపోయామని ఇప్పుడు బాధ పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు మేలు చేసింది. – కుమారి, గృహిణి, సత్యనారాయణపురం, నెల్లూరు మీరు చేసిన వాగ్దానమే కదా.. ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1,500 ఇస్తామని మీరు చేసిన వాగ్దానమే కదా మేం అడుగుతున్నది.. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఓ వ్యూహం ప్రకారం ఆయన ఇలా మాట్లాడారని అర్థం అవుతోంది. అది ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికే అని తెలుస్తోంది. ఏమి అమ్మి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేశారో చెప్పాలి. ఆడబిడ్డ నిధి వాగ్దానాన్ని అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మహిళల చేతుల్లో తీవ్ర పరాభవం తప్పదు. – బందెల ప్రమీల, చెరుకువాడ, ఉండి మండలం, పశ్చిమగోదావరి జిల్లామరోసారి మోసపోయాం చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలకు మరోసారి మోసపోయాం. 2014లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికలలో హామీలు అమలు చేస్తామని బాండ్లు ఇచ్చారు. దీనికి తోడు పవన్‌ కళ్యాణ్, బీజేపీ కూడా ఉండటంతో హామీలు అమలు జరుగుతాయని నమ్మాం. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన విన్నాక ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామనే హామీ అమలు కాదని స్పష్టమవుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు నోరు విప్పలేదంటే ఆయనే ఈ మాటలు మాట్లాడించారని తెలుస్తోంది. – పోలగల జయ, గృహిణి, సామర్లకోట మహిళలకు కూటమి ప్రభుత్వం టోపీ 2019 ఎన్నికలప్పుడు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది. అర్హత కలిగిన మహిళలందరికీ చేయూత, ఆసరా, సున్నావడ్డీ తదితర పథకాల ద్వారా లబ్ధి కలిగింది. అయితే 2024 ఎన్నికల ముందు కూటమి నేతలు అంతకు మించి ఇస్తామని మహిళలను నమ్మించారు. పైగా ఈ పథకాలన్నీ కొనసాగుతాయని కూడా చెప్పారు. వారి మాయ మాటలకు మోసపోయి అందరూ ఓట్లేశారు. తీరా గద్దెనెక్కాక వారి ప్రతాపం చూపిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని మంత్రి మాట్లాడటం మరోమారు మహిళలకు టోపీ పెట్టడమే. – బంక లక్ష్మి, వేములవలస, విశాఖ జిల్లా

Sakshi Editorial On Bombay high court judgement6
దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!

అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్‌ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్‌లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్‌ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్‌ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్‌ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి.

CM Revanth Reddy Comments at a media conference in Delhi7
కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మెడలు వంచి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఒప్పించేలా కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి పక్షాల నేతల మద్దతును సైతం కూడగడతామని చెప్పారు. తద్వారా ఒత్తిడి పెంచుతామని, ఒత్తిళ్లకు లొంగని పక్షంలో ప్రధాని మోదీని కుర్చీ దింపి, తమ నేతను కుర్చీలో కూర్చోబెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని, ఓబీసీ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సిట్‌ విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రెండు బిల్లులు పంపించాం.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే పూర్తి చేసింది. అందులో వెల్లడైన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆ మేరకు రిజర్వేషన్ల కోసం ఒకటి, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకటి..ఇలా శాసనసభలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ విషయంలో సహకరించాలని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రం తాత్సారం చేస్తోంది.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం. అయితే కేంద్రం ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే, కాంగ్రెస్‌ అనేక పోరాటాలు చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేసింది. కులగణనను చేయబోమన్న కేంద్రాన్ని జనగణనలో కులగణనను భాగం చేసేలా ఒప్పించింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతాం. మా అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేయాలన్న ఉద్దేశంతో నేను, మా ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వచ్చాం. వారిని కలవడంతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలందరినీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన సర్వే గురించి వివరిస్తాం. అలాగే ఇండియా కూటమిలోని ఇతర సభ్యులను కలుస్తాం. సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. గురువారం కాంగ్రెస్‌ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని అంటున్నరు. అసలు అఖిల పక్షం ఎక్కడుంది? ప్రధాన ప్రతిపక్ష నేత నిద్రపోతున్నడు. ఆయన పిల్లలు కొట్లాడుకుంటున్నరు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేం అఖిలపక్షం. బీజేపీ రిజర్వేషన్లు వద్దంటోంది. ఎంఐఎం మద్దతిస్తోంది. బీజేపీది వితండ వాదం.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తే, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం వితండ వాదం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్‌కు మరొక రాజ్యాంగం లేదు. అంబేడ్కర్‌ రాజ్యాంగమే అందరికీ అమలవుతోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తే మద్దతు ఇస్తామని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అంటున్నారు. వాళ్లకు కనీస అవగాహన లేదు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లిం రిజర్వేషన్లు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన తర్వాత తెలంగాణకు అలా సూచించండి. గుజరాత్‌లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న అమిత్‌ షాను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? మొండి, తొండి వాదనను పక్కనబెట్టాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. వచ్చే ఎన్నికలు లిట్మస్‌ టెస్టువంటివి 2029 లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్‌ టెస్ట్‌ వంటివి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనంలో ఉన్నవారికే రిజర్వేషన్‌ ఇస్తున్నాం. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట మంత్రివర్గంలో చర్చించి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతాం. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు తర్వాత మొత్తం 50 శాతం రిజర్వేషన్లే అనేది ఎప్పుడో పోయింది. కొందరు వితండవాదులు చేసే వాదనలకు కోర్టులే సమాధానం చెబుతాయి. మొదట రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత సబ్‌ కేటగిరైజేషన్‌ గురించి ఎక్స్‌పర్ట్‌ కమిటీ చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. తప్పులు సరిదిద్దుకోవాలంటే దత్తాత్రేయకు చాన్స్‌ ఇవ్వాలి ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి. గతంలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రపతి చేసే అంశంపై చర్చ జరిగింది. ఆయనను ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేశారు. తెలుగు మాట్లాడే ఆయనను ఘర్‌వాపసీ చేయించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తెలంగాణ నేత, సౌమ్యుడైన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. గవర్నర్‌గా ఆయన పదవీకాలం పూర్తయింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించారు. ఇప్పుడు ఆ పదవి బ్రాహ్మణుడైన ఎన్‌.రామచందర్‌రావుకు ఇచ్చారు. బీజేపీ తెలంగాణలోని ఓబీసీ నేతల గొంతు కోసింది. ఈ తప్పులన్నింటినీ క్షమించాలంటే దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున దత్తాత్రేయకు, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నా. దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి అందరి ఆమోదం ఉంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ గౌరవించాలి. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్‌ చేశారంట.. మీడియా సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోన్‌ ట్యాపింగ్‌పై మాట్లాడారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ విచారణ జరుగుతోంది. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్‌ చేశారని తెలుస్తోంది. సొంతింటి వాళ్లవి చేసేకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. నా ఫోన్‌ ట్యాప్‌ అయిందో? లేదో నాకు తెలియదు. నా ఫోన్‌ ట్యాప్‌ అయ్యుంటే నన్ను విచారణకు పిలిచివారు కదా. ఒకవేళ సిట్‌ విచారణకు పిలిస్తే కచ్చితంగా వెళతా. మా ప్రభుత్వానికి ఫోన్‌ ట్యాపింగ్‌లు చేసే ఉద్దేశం లేదు. దానివల్ల ఒనగూరేది లేదు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది..’అని అన్నారు. నిబంధనల మేరకే సీఎం రమేశ్‌ కంపెనీకి కాంట్రాక్టు ఫ్యూచర్‌ సిటీలో రోడ్ల కాంట్రాక్టు టెండర్‌ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు ఇవ్వడంపై ప్రశ్నించగా.. ‘రూ.1,600 కోట్ల ఈ–టెండర్‌ను నిబంధనల మేరకే వారి కంపెనీ దక్కించుకుంది. ఎల్‌అండ్‌టీ సైతం ఈ–టెండర్‌లో పాల్గొంది. నా మిత్రుడని ఈ టెండర్‌ కట్టబెట్టలేదు. ఓపెన్‌ టెండర్‌లోనే వారికి దక్కింది..’అని రేవంత్‌ వివరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఎక్కడా రుణాలు తీసుకోలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వ సావరిన్‌ బాండ్లను వేరే కంపెనీలు కొనుక్కున్నాయని స్పష్టం చేశారు.

ENG VS IND 4th Test: England vs India 4th-test-day-18
ENG VS IND 4th Test: తొలి రోజు మెరుగైన స్థితిలో ముగిసిన ఆట

తొలి సెషన్‌లో ఒక్క వికెట్‌ కోల్పోకుండా ఓపెనర్ల పట్టుదల... ఆపై తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు... కీలక సమయంలో రిషభ్‌ పంత్‌కు గాయం... చివరకు సంతృప్తిగా ముగింపు! మాంచెస్టర్‌ టెస్టులో భారత జట్టు పరిస్థితి ఇది. టాస్‌ ఓడినా సానుకూల ఆటతో భారత బ్యాటింగ్‌ కొనసాగింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌ అర్ధ సెంచరీలతో ఆకట్టుకోగా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ బంతితో రాణించాడు. ఇంకా లోతైన బ్యాటింగ్‌ ఉండటంతో రెండో రోజు టీమిండియా ఎంత భారీ స్కోరు నమోదు చేస్తుందనేది చూడాలి. మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును భారత్‌ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (151 బంతుల్లో 61; 7 ఫోర్లు), యశస్వి జైస్వాల్‌ (107 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు చేశారు. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 37 రిటైర్డ్‌హర్ట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) గాయంతో మైదానం వీడాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (19 బ్యాటింగ్‌), శార్దుల్‌ ఠాకూర్‌ (19 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం చరిత్రలో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న జట్టు ఒక్కసారి కూడా మ్యాచ్‌ గెలవలేదు. అయినా సరే, స్టోక్స్‌ మరోసారి టాస్‌ గెలిచి అలాంటి సాహసం చేశాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ నాలుగు టాస్‌లూ గెలవగా... అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ వరుసగా 14 టాస్‌లు ఓడిపోయింది! ఓపెనర్ల శుభారంభం... భారత్‌కు మరోసారి ఓపెనర్లు జైస్వాల్, కేఎల్‌ రాహుల్‌ (98 బంతుల్లో 46; 4 ఫోర్లు) మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. లంచ్‌ సమయానికి జట్టు వికెట్‌ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. అయితే రెండో సెషన్‌లో పరిస్థితి మారింది. తక్కువ వ్యవధిలో పదునైన బంతితో రాహుల్‌ను అవుట్‌ చేసి వోక్స్‌ జట్టుకు తొలి వికెట్‌ అందించాడు. 96 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్న తర్వాత డాసన్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ వెనుదిరగ్గా... గత టెస్టు వైఫల్యాన్ని శుబ్‌మన్‌ గిల్‌ (12) ఇక్కడా కొనసాగించాడు. స్టోక్స్‌ బంతిని ఆడకుండా వదిలేసిన గిల్‌ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అంతకుముందు భారత్‌ కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొంది. స్టోక్స్‌ బౌలింగ్‌లో 20 పరుగుల వద్ద సుదర్శన్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్‌ స్మిత్‌ వదిలేయడం కాస్త కలిసొచ్చింది. కీలక భాగస్వామ్యం... టీ విరామం తర్వాత సుదర్శన్, పంత్‌ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. సుదర్శన్‌ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయగా, పంత్‌ కూడా సంయమనం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించిన తర్వాత గాయంతో పంత్‌ తప్పుకోవాల్సి వచ్చింది. 134 బంతుల్లో కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం సుదర్శన్‌ను స్టోక్స్‌ వెనక్కి పంపాడు. ఈ దశలో జడేజా, శార్దుల్‌ కలిసి జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు 55 బంతుల్లో అభేద్యంగా 29 పరుగులు జత చేసి తొలి రోజును ముగించారు. చివర్లో వెలుతురు మందగించడంతో అంపైర్ల సూచనతో ఇంగ్లండ్‌ స్పిన్‌ బౌలింగ్‌కే పరిమితమైంది. దాంతో 80 ఓవర్ల తర్వాత కూడా జట్టు కొత్త బంతి తీసుకునే ప్రయత్నం చేయలేదు. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58; రాహుల్‌ (సి) క్రాలీ (బి) వోక్స్‌ 46; సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61; గిల్‌ (ఎల్బీ) (బి) స్టోక్స్‌ 12; పంత్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 37; జడేజా (బ్యాటింగ్‌) 19; శార్దుల్‌ (బ్యాటింగ్‌) 19; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 3–212 (రిటైర్డ్‌ నాటౌట్‌), 4–235. బౌలింగ్‌: వోక్స్‌ 17–4–43–1, ఆర్చర్‌ 16–2–44–0, కార్స్‌ 16–1–60–0, స్టోక్స్‌ 14–2–47–2, డాసన్‌ 15–1–45–1, రూట్‌ 5–0–19–0.అన్షుల్‌ కంబోజ్‌ @ 318పేస్‌ బౌలర్‌ అన్షుల్‌ కంబోజ్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన 318వ ఆటగాడిగా అతను నిలిచాడు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల అన్షుల్‌ 24 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్‌ టెస్టులో ఆడిన జట్టు నుంచి మూడు మార్పులతో భారత్‌ బరిలోకి దిగింది. గాయాలతో దూరమైన నితీశ్, ఆకాశ్‌దీప్‌కు బదులుగా అన్షుల్, శార్దుల్‌లను ఎంపిక చేయగా...కరుణ్‌ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించారు. రిషభ్‌ పంత్‌కు గాయం!భారత్‌ను ఈ టెస్టులో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్న ఘటన తొలి రోజే చోటు చేసుకుంది. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ చేస్తూ గాయపడి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. వోక్స్‌ వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడబోగా బంతి నేరుగా అతని కుడి పాదంపై పడింది. ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌కు అంపైర్‌ స్పందించకపోవడంతో ఇంగ్లండ్‌ రివ్యూ కోరింది. బంతి కాలికి తగిలే ముందే బ్యాట్‌ను తాకుతూ వెళ్లడంతో అతను నాటౌట్‌గా తేలాడు. అయితే బంతి బలంగా తాకడంతో పంత్‌ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. సహచరుల అండతో ఒంటికాలిపై అడుగు వేయాల్సి వచ్చింది. చివరకు కార్ట్‌లో అతడిని మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎలాంటిదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత ఈ టెస్టులో అతని పరిస్థితి ఏమిటనేది తేలుతుంది.

Supreme Court CJI Justice BR Gavai comments on Kancha Gachibowli case9
రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు

రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలో జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్, జస్టిస్‌ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ తరపున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషనర్‌ తరపున ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్‌ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్‌ గవాయ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Meeting Of Presidents Of Ysrcp Affiliated Departments10
కమిటీల్లో వారికే ప్రాధాన్యత: సజ్జల

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్‌గా ముందుకెళ్లాలని.. ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాలన్నారు. కమిటీల నియామకాలు పకడ్బందీగా చేయాలని.. ఎక్కడా పొరపాట్లకు తావు ఇవ్వకూడదని ఆయన సూచించారు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.కొన్ని విభాగాలు మరింత ఫోకస్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడు మనం బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్‌ తీసుకెళ్ళగలుగుతామన్న సజ్జల.. ఫైనల్‌గా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలన్నారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని.. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.‘‘అనుబంధ విభాగాలు కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. పదవులు అలంకారప్రాయంగా కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి. పదవులు పొందిన వారంతా తగిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. నిర్ణీత కాల పరిమితిలో కమిటీలు పూర్తి చేయాలి. క్రియాశీలకంగా ఉండగలిగేవారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలి. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. మరోసారి మన నాయకుడు జగన్‌ని సీఎం చేసుకుందాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ప్రజల తరుపున నిలబడదాం: ఆలూరు సాంబశివారెడ్డివైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ‘‘అనుబంధ విభాగాలకు సంబంధించి అందరం కలిసి పనిచేద్దాం. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెడదాం. నేను అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళతాను. మన అనుబంధ విభాగాలు 30 ఉన్నాయి. ఇవి అన్నీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఫోకస్‌ చేసి ప్రజల తరుపున నిలబడదాం. మన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియాలో, సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళదాం...నెలకు ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏ విధంగా చేయాలనే దానిపై అందరం సమన్వయంతో ముందుకెళదాం. కమిటీల నియామకంపై ప్రధానంగా దృష్టిపెడదాం. వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి అవ్వాలి. ఈ నెలాఖరికి ఎట్టి పరిస్ధితుల్లో అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు నియమించుకోవాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్థాయి కమిటీలు కూడా పూర్తవ్వాలి. జగనన్నను మరోసారి సీఎం చేసుకునేందుకు మనమంతా గట్టిగా పనిచేద్దాం. ప్రజల తలరాతలు మారాలంటే, వారికి మంచి భవిష్యత్‌ అందాలంటే జగనన్న మరోసారి సీఎం అవ్వాలి’’ అని సాంబశివారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement