Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP CID Sketch to down fall Chandrababu corruption cases1
చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!

సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్‌బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్‌పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్‌ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణం, స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్‌ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూముల బదలాయింపు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్‌ ఎండీగా వ్యవహరించిన అజయ్‌ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్‌ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్‌’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్‌పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్‌ కేసులు నమోదు చేసింది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్‌ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్‌ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్‌ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్‌ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్‌ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్‌ రవి శంకర్‌ అయ్యన్నార్‌ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్‌ జైన్‌లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్‌ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్‌ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్‌ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్‌సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్‌సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్‌సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్‌ మధ్యప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్‌పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్‌ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్‌ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్‌పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

Allu Arjun Attend At Chikkadpally Police Station2
చిక్కడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో చిక్కడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు అల్లు అర్జున్‌ (Allu Arjun) వెళ్లారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, పలు షరతులు బన్నీకి న్యాయస్థానం విధించింది. అందులో భాగంగానే నేడు ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అ‍ల్లు అర్జున్‌ వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల (Chikkadpally Police Station) ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది. ఈమేరకే ఆయన అక్కడికి వెళ్లి సంతకం చేశారు.

Indias decade of BGT dominance crumbles in Sydney as Australia win series 3-13
సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భార‌త్‌ ఔట్‌

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీని 3-1 తేడాతో భార‌త్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఓట‌మితో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ నుంచి భార‌త్ నిష్క్ర‌మించింది. జూన్‌ 11 నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి.ఇక మ్యాచ్‌లో భార‌త్ విధించిన 162 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యాన్ని 27 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజ‌యం సాధించింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖావాజా(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్‌ హెడ్‌(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్‌కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.నిప్పులు చెరిగిన బోలాండ్‌.. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్‌ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగిం‍చిం భారత్‌ బ్యాటర్లలో రిషబ్‌ పంత్‌(61) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. దీంతో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా బోలాండ్‌ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు దక్కింది.

 HYDRA Ready For Demolish Illegal Constructions At Madhapur4
HYD: మాదాపూర్‌లో కూల్చివేతలకు హైడ్రా సిద్దం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా హైడ్రా.. నగరంలోని మాదాపూర్‌లో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మాదాపూర్‌లో పర్యటించి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు.మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(HYDRA) ఫోకస్‌ పెట్టింది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేయనుంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే, అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్‌ మాత్రం పట్టించుకోలేదు.మరోవైపు.. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగనాథ్‌ మాదాపూర్‌(Madhapur)లో పర్యటించారు. ఈ క్రమంలో​ అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు లేవని తేలడంతో రంగనాథ్‌ కూల్చివేతకు ఆదేశించారు. దీంతో, నేడు సదరు భవనాన్ని హైడ్రా కూల్చివేయనుంది.

BRS KTR Satirical Comments On Revanth and Congress5
మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ క్రమంలోనే రైతుల వ్యతిరేకి కాంగ్రెస్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇదే సమయంలో రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్‌ మాట్లాడిన వీడియోను కేటీఆర్‌ షేర్‌ చేశారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వంమోసానికి మారు పేరు కాంగ్రెస్ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వంఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దంరాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకంప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలుసిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు.. మోసగాళ్ల బెదిరింపుల మేళాఅబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్.. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అంటూ కామెంట్స్‌ చేశారు.అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి మారు పేరు కాంగ్రెస్ ధోకాలకు కేరాఫ్… pic.twitter.com/oE7ziV5UlI— KTR (@KTRBRS) January 5, 2025

Hamas Releases Israel Hostage Soldier Video6
హమాస్‌ వ్యూహాలు..మరో బందీ వీడియో విడుదల

టెల్‌అవీవ్‌:తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్‌ యువ మహిళా జవాను లిరి అల్బాగ్‌(19) వీడియోను హమాస్‌ తాజాగా విడుదల చేసింది. మూడున్నర నిమిషాల వ్యవధి గల వీడియోలో అల్బాగ్‌ తన గోడు వెళ్లబోసుకుంది.‘450 రోజుల నుంచి నేను బందీగా ఉన్నాను. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నన్ను మర్చిపోయింది. నాకు ఇప్పుడు 19 ఏళ్లు. నా జీవితమంతా ముందే ఉంది. అయితే నా జీవితానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ వీడియోపై అల్బాగ్‌ కుటుంబం స్పందించింది. వీడియోలో తమ కూతురు పూర్తి మానసిక క్షోభతో కనిపిస్తోందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. "Liri, if you're hearing us, tell the others that all the families are moving heaven and earth. We will fight until all hostages are returned"Eli and Shira Albag , Liri Albag's Parents, called the Prime Minister and Defense Minister, after watching her video from captivity,… pic.twitter.com/Y9xAh47W7O— Bring Them Home Now (@bringhomenow) January 4, 2025అల్బాగ్‌ విడుదల కోసం పీఎం నెతన్యాహు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి దాడులు చేసిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ వారు తమ వెంట వందలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులతో పాటు ఆరుగురు సైనికులను కూడా తీసుకువెళ్లారు. ఆరుగురిలో అల్బాగ్‌ ఒకరు. బందీల వీడియోలు విడుదల చేసి కాల్పుల విరమణ కోసం హమాస్‌ తమపై ఒత్తిడి పెంచే వ్యూహాలు పన్నుతోందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం భావిస్తోంది. బందీగా ఉన్న ఓ యువకుడి వీడియోను హమాస్‌ ఇటీవల విడుదల చేసినప్పుడు పీఎం నెతన్యాహు స్పందించారు. హమాస్‌ వ్యూహాలకు తాము లొం‍గబోమని, ఉగ్రవాదులను అంతం చేసే దాకా వదలమని స్పష్టం చేశారు. కాగా మరోవైపు హమాస్‌, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు

Will The Momentum Sustain For Bitcoin in 20257
2024లో 120 శాతం: 2025లో బిట్‌కాయిన్ వృద్ధి ఎలా ఉంటుందంటే?

ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్‌లో బిట్‌కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్‌కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.2025లో బిట్‌కాయిన్డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్‌కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్‌ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.2024లో కంటే ఈ ఏడాది బిట్‌కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హార్డ్‌ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాటక్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్‌కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్‌కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు.

Union Health Ministry ays India well-prepared To Handle Respiratory Infections8
చైనాలో వైరస్‌ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన

ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. నాటి మరణాలు, పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతోనే చైనాలో మరో వైరస్‌ వ్యాప్తి ఆందోళన రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది.ఈ క్రమంలోనే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) అధ్యక్షతన శనివారం జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ (JMG) సమావేశం నిర్వహించారు. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కలకలం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్‌ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.ఇదే సమయంలో చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు స్పష్టం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది.ఇక, చైనాలో వైరస్‌ కారణంగా భారత్‌లో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధుల అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, మన దేశంలో ఈ వైరస్‌ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు.. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్‌ ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపింది. కాగా, చైనాలో వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Chinese hospitals experiencing a surge in Human Metapneumovirus (HMPV) infections. Reports and online posts indicate widespread transmission, with some claiming hospitals and crematories are overwhelmed pic.twitter.com/1FDyQuGr2X— News Rated (@NewsRated) January 4, 2025

Beauty Tips: Skincare For Dry Skin For Useful Tips9
చర్మం పొడిబారుతోందా..?

చలికాలం చర్మం పొడిబారే సమస్య అధికంగా ఉంటుంది. పొడిచర్మం గలవారికి ఇది మరింత సమస్య. నూనె శాతం ఎక్కువ ఉండే క్రీములు, లోషన్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అందుకు... ఇంట్లో చేసుకోదగిన సౌందర్యసాధనాలు..ఆలివ్‌ ఆయిల్‌తో... కోకోబటర్‌లో చర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్‌ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టేబుల్‌ స్పూన్‌ కోకోబటర్‌– ఆలివ్‌ ఆయిల్‌ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి, మెడకు రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పాల మీగడమీగడలో ఉండే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తే చర్మకాంతి పెరుగుతుంది.బొప్పాయివిటమిన్‌–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.బాదం నూనెకోకో బటర్, బాదం నరి సమపాళ్లలో తీసుకొని కలిపి, మిశ్రమం తయారు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. చర్మం పొడిబారే సమస్య దరిచేరదు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది)

Cowpea seeds sent to space germinated under microgravity conditions says Isro10
అంతరిక్షంలో జీవం  ‘పురుడు’ పోసుకుంది! 

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ–సి60 ఆర్బిటాల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ మాడ్యూల్‌ (పోయెమ్‌–4) ద్వారా డిసెంబర్‌ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్‌ రీసెర్చ్‌ మాడ్యూల్‌ ఫర్‌ ఆర్బిటాల్‌ ప్లాంట్‌ స్టడీస్‌ (సీఆర్‌ఓపీఎస్‌) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్‌ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్‌ పేలోడ్‌ను విక్రం సారాబాయ్‌ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.స్పేడెక్స్‌ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్‌ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్‌ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్‌ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్‌ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్‌ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్‌ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్‌ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్‌ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్‌ పరిజ్ఞానం కీలకం కానుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది.

title
కనిపించని ఏసీ కోచ్‌.. కంగుతిన్న ‘రిజర్వేషన్‌’ ప్రయాణికులు.. తరువాత?

శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం సర్వసాధారణం.

title
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..నలుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

title
Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్‌కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్‌’

నేటి కాలంలో యువత ఉద్యోగం చేసేకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది.

title
కారాగారానికి కీచక డీఎస్పీ

తుమకూరు: ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళకు

NRI View all
title
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్

title
అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’

‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం

title
న్యూ ఇయర్‌ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్,  రాస్ అల్ ఖైమాలో  జరిగిన చిన్న ప్రైవేట్  విమాన ప్రమ

title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

Advertisement

వీడియోలు

Advertisement