
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతారో చెప్పడం కష్టం.

అలా ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చింది షామిలీ.

1989-2000 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బాలనటిగా చేసింది.

చిరంజీవి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లో రాజు రాజు అని ముద్దుగా పిలిచేది ఈమెనే.

అయితే బాలనటిగా జాతీయ అవార్డుతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర అవార్డులు అందుకుంది.

చైల్డ్ ఆర్టిస్టుగా సూపర్ సక్సెస్ అయిన షామిలీ అక్క, సోదరుడు కూడా బాలనటులుగానే వచ్చారు.

పెద్దయ్యాకు 'ఓయ్' మూవీతో హీరోయిన్ అయ్యింది. కానీ అదృష్టం కలిసిరాలేదు. సినిమా ఫ్లాప్ అయింది.

ఆ తర్వాత మరో మూడు సినిమాలు చేసింది గానీ సక్సెస్ రాకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.

ఈమె అక్క షాలినీ.. తమిళ స్టార్ హీరో అజిత్‌ని పెళ్లి చేసుకుంది.











