

బాలీవుడ్‌లో నెపోటిజం అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

అందుకు తగ్గట్లే స్టార్ హీరోల కొడుకు-కూతుళ్ల ట్రోలింగ్‌కి బలైపోతుంటారు.

అలా నెపోటిజం విషయంలో ప్రతిసారి విమర్శలు ఎదుర్కొనే హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు.

తండ్రి చుంకీ పాండే వారసురాలిగా 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది.

మొదటి మూవీనే ఘెరమైన డిజాస్టర్ అయింది. 2019 నుంచి ఇప్పటివరకు మూవీస్ చేస్తూనే ఉంది.

ఈమె చేసిన వాటిలో ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఈమె యాక్టింగ్‌పై మాత్రం ట్రోల్స్ వచ్చాయి.

ప్రతిసారి ట్రోలర్స్‌కి అనన్య పాండే టార్గెట్ అవుతూనే ఉంది. ఆ విషయం ఈమెకు కూడా తెలుసు.

విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'లైగర్'లోనూ ఈమెనే హీరోయిన్. కానీ ఆ సినిమా కూడా ఫట్.

అలా దాదాపు ఐదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ప్రశంసల కంటే విమర్శలే ఈమెపై ఎక్కువొచ్చాయి.

ఈరోజు (అక్టోబర్ 30) అనన్య పాండే పుట్టినరోజు. ఇకనైనా తన సినిమాలతో విమర్శకుల నోళ్లు మూయిస్తుందేమో చూడాలి?




