
నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

బాలీవుడ్‌లోని నెపోటిజం వల్ల సుశాంత్ ఇలా చేసుకోవాల్సి వచ్చిందని కామెంట్స్ వినిపించాయి.

మరోవైపు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై కూడా లేనిపోని విమర్శలు చేశారు.

పైన కనిపిస్తున్న అమ్మాయి రియానే. ఈమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్యాలరీ మీకోసం.

2012లో 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. 2021 వరకే సినిమాల్లో కనిపించింది.

సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఈమెపై పూర్తిగా నెగిటివిటీ పెరిగిపోయింది.

గతేడాది ఓ రియాలిటీ షోలో కనిపించింది. ఇప్పుడైతే ఈమె చేతిలో అసలు అవకాశాలే లేవు.

పరిస్థితి చూస్తుంటే ఈమె కొత్త సినిమాలు చేయడం కష్టమే అనిపిస్తుంది.
















