
బాలీవుడ్ భామ నుస్రత్ బరుచా మొదట సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

1985 మే నెలలో ముంబయిలో జన్మించిన ముద్దుగుమ్మ.. కిట్టీ పార్టీ అనే టీవీ సిరీయల్ ద్వారా అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత జై సంతోషీ మా అనే సినిమాతో మరో అడుగు ముందుకేసింది.

2010లో తెలుగులో శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను ఆకట్టుకుంది.

గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఛత్రపతి మూవీలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాను 2005లో రాజమౌళి తెరకెక్కించిన ప్రభాస్ ఛత్రపతి ఆధారంగా హిందీలో రీమేక్‌గా తీసుకొచ్చారు.










