
ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ 2016 సంవత్సరానికిగానూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న టాప్ 20 జాబితాలో తొలి స్థానాన్ని ఆస్ట్రేలియా ప్రీమియర్ ఎయిర్‌వేస్ క్వాంటాస్‌కు సెవన్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. దీంతో గత మూడేళ్లుగా తన స్థానాన్ని క్వాంటాస్ నిలుపుకున్నట్టయింది.

ప్రంచంలోనే రెండో అతిపెద్ద ఎయిర్లైన్స్ అయిన అమెరికన్ ఎయిర్ లైన్స్కి ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ ఈ ఏడాదికిగానూ రెండో స్థానం ఇచ్చింది.

1919లో ప్రారంభించిన డచ్ క్యారియర్ కేఎల్ఎమ్కు ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ జాబితాలో చోటు దక్కింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న ఎయిర్లైన్స్లో యూరోప్లోనే తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థకు చెందిన ఒక్క అమ్స్స్టర్ డ్యాంకు చెందిన నెట్వర్క్ ఏటా 20 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది.4

నాణ్యమైన సేవల్లో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించిన సింగపూర్ ఎయిర్ లైన్స్ సేఫెస్ట్ ఎయిర్ లైన్స్ గా సెవన్స్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న కంపెనీల్లో చోటు సంపాదించింది.

ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్గా పేరు పొందిన ఎయిర్ న్యూజిలాండ్ కూడా ఎయిర్లైన్ రేటింగ్ జాబితాలో చోటు సాంపాదించింది.

తైవాన్ కంపెనీ ఎవా ఎయిర్ కూడా సెవన్ స్టార్ రేటింగ్స్ ని దక్కించుకుని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసే ఎయిర్ లైన్స్ గా ఫేమస్ అయ్యింది.

1999లో బడ్జెట్(చౌక ధరల) ఎయిర్ లైన్గా ప్రారంభమైన వర్జిన్ ఎయిర్ లైన్స్ ఈ ఏడాది ఏకంగా ఎయిర్లైన్ రేటింగ్ జాబితాలో చోటు సాంపాదించింది.

ఎప్పుడూ టాప్ 20లో నిలిస్తున్న యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ ఏడాది కూడా తన రికార్డును నిలుపుకుంది.

సురక్షిత ఎయిర్ లైన్గా ముద్ర పడ్డ ఎమిరేట్స్ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఏ 380లో ఆన్ బోర్డ్ షవర్ ప్రారంభించి ఈ సౌకర్యం ఆఫర్ చేసిన తొలి ఎయిర్ లైన్గా నిలిచింది.

జర్మనీకి చెందిన లుఫ్తాంజా టాప్ 20లో తన రికార్డును పదిలంగా ఉంచుకుంది. యూరోప్లోనే రెండో అతిపెద్ద లుఫ్తాంజా ఎయిర్లైన్స్గా పేరుంది.

జపాన్లో రెండో అతి పెద్ద ఎయిర్లైన్స్ అయిన జపాన్ ఎయిర్ లైన్స్ సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చే టాప్ జాబితాలో చోటు సంపాదించింది.

జపాన్లోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ అయిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్(ఏఎన్ఏ) ఈ జాబితాలోచోటు దక్కింది.

యూఎస్ నుంచి హవాయి వెళ్లే ఎకానమీ ప్రయాణికులు బెస్ట్ ఇన్ ఫ్లైట్ ఆఫరింగ్గా చెప్పుకునే హవాయియన్ ఎయిర్లైన్స్ ఈ జాబితాలో చోటు దక్కింది.

30000 అడుగుల ఎత్తులో కూడా తమ ప్రయాణికులకు డైమండ్స్, ఆర్ట్ వర్స్ లాంటి ఖరీదైన షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించిన యూఏఈ కి చెందిన ఎటిహాడ్ ఎయిర్వేస్ టాప్ జాబితాలో చోటు దక్కించుకుంది

బ్రిటిష్ క్యారియర్ వర్జిన్ అట్లాంటిక్ భద్రత ప్రామాణాలు పాటిస్తూ ఈ ఏడాది టాప్ 20 లో నిలిచింది.

భద్రత కోసం ధరలు మాత్రమే కాదు ప్రయాణికులకు సౌకర్యాలు కూడా అందిస్తున్న అలస్కా ఎయిర్ లైన్స్ టాప్ జాబితాలో చోటు సంపాదించింది.

ఆసియాకు చెందిన ఎయిర్లైన్స్ కెథే పసిఫిక్ ఎయిర్లైన్ రేటింగ్ జాబితాలో చోటు సంపాదించింది.

ఫిన్ఎయిర్ భద్రతలోనే కాకుండా ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటున్న ఫిన్ఎయిర్ సేఫెస్ట్ జాబితాలో చోటు సంపాదించింది.

సరైన సమయాన్ని పాటించే ఎయిర్లైన్స్గా పేరున్నస్కాండినేవియన్ ఎయిర్ లైన్ సిస్టమ్(ఎస్ఏఎస్) సేఫెస్ట్ జాబితాలో చోటు సంపాదించింది.

క్రాస్ ఎయిర్ నుంచి 2002లో రీబ్రాండ్గా ప్రారంభమైనప్పటి నుంచి స్విస్లో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దీంతో ఎయిర్లైన్ రేటింగ్ టాప్ 20 జాబితాలో సాంపాదించింది.