Air lines
-
దివాళా తీసిన మరో ఎయిర్ లైన్స్ లాభాల్లో టాటా స్టిల్స్
-
ఉభయగోదావరి జిల్లావాసులకు గుడ్‌న్యూస్..
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే 3,165 మాటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం ఉండటం సానుకూలత కలిగిన అంశం. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో విమానాశ్రయం సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్యా చర్యలు చేపడుతోంది. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. - విమాన ప్రయాణికుల రాకపోకల సందర్భంలో స్టే చేయడానికి ఉన్న టెర్మినల్ భవనం సామర్థ్యం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు ఉండేందుకు సరిపోతుంది. - భవిష్యత్ అవసరాల రీత్యా భవనాన్ని మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందకు కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు వెచి్చంచనున్నారు. - ఒకేసారి 1,400 మంది ప్రయాణికులుండే సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఐదు - విమానాలు ఒకేసారి చేరినా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - విమానాల్లో రాక, పోకలు సాగించే ప్రయాణికుల లగేజీ తనిఖీ వ్యవస్థను వివిధ రకాల్లో ఆధునీకరించనున్నారు. - ఇన్లైన్ బ్యాగేజీ సిస్టం తీసుకురానున్నారు. - ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తారు. కియోస్క్ ద్వారా ఆధునీకరణ పద్ధతుల్లో ప్రయాణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 3 ఎయిరో బ్రిడ్జిలు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ఎయిరోబ్రిడ్జిలు నిర్మిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జిల ద్వారా విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసులోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఆలస్యం జరగదు. టెర్మినల్ భవనం నుంచి విమాన సర్వీసు వరకూ వెళ్లేందుకు సమయం వృథాకాదు. ప్రస్తుతం జరుగుతున్న విధానంతో ఆలస్యాన్ని నివారించే వీలుంది.ప్రస్తుతం ఉన్న 6 ఇండిగో విమానాల జాబితాలో మరో ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం చేరనుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు నడవనుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాయంత్రం 4.50 గంటల చేరుతుంది. తిరిగి హైదరాబాద్‌కు 5.20కు బయలు దేరుతుంది. ఉడాన్.. ఒక లైన్ కేంద్ర ప్రభుత్వం విమాన సేవల విస్తృతిలో భాగంగా ప్రవేశపెట్టిన ఉడాన్ రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, తిరిగి విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి మాత్రమే నడుస్తోంది. తక్కువ ధరకే టికెట్టు లభిస్తుండటంతో మంచి డిమాండ్ నెలకొంది. మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 6 విమానాలు 12 సరీ్వసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు కృషి విమానాశ్రయం ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే వారం హైదరాబాద్‌కు ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన మరో విమానం ప్రారంభం కానుంది. బోయింగ్ విమాన రాకపోకలకు అనువైన రన్‌వే, పార్కింగ్ ఉండటం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు సానుకూలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు çకృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే టెరి్మనల్ విస్తరణ చేపడుతున్నాం. అత్యంత భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం అందిచాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాం. కార్గో విమానాలు లేకవడంతో బెల్లీ కార్గో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక విమాన సరీ్వసుకు 500 కేజీల లగేజీ అనుమతిస్తున్నాం. కార్గో విమానాలకు ప్రతిపాదనలున్నాయి. - ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఎయిర్‌లైన్స్‌లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్‌తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్‌కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్‌దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్‌లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్‌లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
జనవరి 12 నుంచి విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి : విజయవాడ–ముంబై మధ్య విమాన సర్వీసులను వచ్చే నెల 12 నుంచి ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. గతంలో విజయవాడ నుంచి ముంబైకి వివిధ సంస్థలు నడుపుతున్న విమాన సర్వీసులు కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి. అప్పటి నుంచి ముంబై వెళ్లాలనుకునే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభించాలని విమానయాన సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ జనవరి 12 నుంచి విజయవాడ–ముంబై మధ్య విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదనరావు ‘సాక్షి’కి చెప్పారు. వారంలో మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముంబైలో ఉదయం 10.50కి బయలుదేరి మధ్యాహ్నం 12.45కి గన్నవరం చేరుకుంటుంది. గన్నవరంలో మధ్యాహ్నం 1.30కి బయలుదేరి 3.20కి ముంబైకి చేరుకుంటుంది. (యూకే స్ట్రెయిన్: ఇక ఐసోలేషన్.. డబుల్! ) -
కరోనా : విదేశాల్లో చిక్కుకున్న వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. అమెరికా, యూరోపియన్ దేశాల్లోని భారతీయులను వందే భారత్ మిషన్ తరహాలో అంతర్జాతీయ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా భారతీయులను దేశానికి తీసుకురావడంతోపాటు, ఇక్కడ ఉండిపోయిన విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించే అవకాశం లభించనుంది. వందే భారత్ మిషన్ తరహాలో చార్టర్డ్ విమాన సేవలకు తమ కంపెనీలనూ అనుమతించాలంటూ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల విమానయాన సంస్థల నుంచి అభ్యర్ధనలు వచ్చాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి పరిశీలనలో ఉన్నాయని చర్చలకనుగుణంగా త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై జూన్ 15న యుఎస్ రవాణా శాఖ, యుఎస్ ఎంబసీ ప్రతినిధులతో ఒక రౌండ్ చర్చలు జరిపామని చెప్పింది. అలాగే గల్ఫ్ దేశాల నుండి షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించాలన్న అభ్యర్థన కూడా పెండింగ్‌లో ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్నభారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇపుడు మన దేశంలోని ఇతర దేశాల పౌరులను వారి వారి దేశాలకు తరలించనున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నలుమూలల చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. అయితే భారత ప్రభుత్వం వివక్షా పూరితంగా వ్యవహరించి ఇరు దేశాల విమానయాన ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించిన ఆమెరికా ఇటీవల వందే భారత్ మిషన్‌కు అభ్యంతరం తెలిపింది. తమ విమానయాన సంస్థలకు చెందిన చార్టర్డ్ విమానాల రాకపోకలను భారత్ అడ్డుకుంటున్నందు వల్లే ఎయిరిండియా చార్టర్డ్ విమానాల రాకపోకలపై జూలై 22 నుంచి నిషేధం అమలవుతుందని అమెరికా రవాణా విభాగం(డీఓటీ) ప్రకటించింది. అంతేకాదు చిక్కుకుపోయిన పౌరుల తరలింపు సమయంలో ఎయిరిండియా అక్రమంగా టికెట్లను అమ్ముకుంటోందని డీఓటీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
విమాన ప్రయాణికులకు ఊరట
సాక్షి, ఢిల్లీ : విమాన ప్రయాణికులకు కేంద్రం ప్రకటన ఊరటనిచ్చింది. లాక్డౌన్ నేపధ్యలో రద్దు చేసుకున్న విమాన టికెట్ల పూర్తి ఛార్జీలు వాపస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించింది. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని డీజీసీఏకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య విమాన టికెట్లను బుక్ చేసుకున్నవారికి మూడు వారాల్లోగా రీఫండ్ డబ్బులు అందించాల్సిందిగా అన్ని ఎయిర్‌లైన్స్‌ని డీజీసీఏ ఆదేశించింది. ఈ మేరకు గురువారం డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. బుకింగ్స్ రద్దుకు క్యాన్సలేషన్ ఛార్జీలు విధించడబడవని పేర్కొంది. అంతేకాకుండా ఏప్రిల్ 14 నుంచి మే3 మధ్యకాలంలో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి సైతం ఇదే పద్ధతి వర్తిస్తుందని తెలిపింది. 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14న ముగియనుండగా, కరోనా కట్టడి దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేవంలో 414 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. పరిస్థితి మెరుగుపడే వరకూ అన్ని దేశీయ, విదేశీ విమాన సేవలను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే3 తో లాక్డౌన్ ముగియనుండటంతో విమానయాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. -
విమాన సేవలు పునరుద్ధరించాలి
భువనేశ్వర్ ఒరిస్సా : స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానయాన సేవల్ని ఇటీవల రద్దు చేశారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, బ్యాంకాక్ ప్రత్యక్ష విమానయాన సేవలు రద్దయ్యాయి. ఈ సేవల్ని తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు శుక్రవారం లేఖ రాశారు. 2010వ సంవత్సరం అక్టోబరు 30వ తేదీన స్థానిక విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2017వ సంవత్సరం డిసెంబరు 10వ తేదీ నుంచి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు ప్రత్యక్ష అంతర్జాతీయ విమానయాన సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇలా అంచెలంచెలుగా అంతర్జాతీయ విమానయాన సదుపాయాలు విస్తరిస్తారని ఊహిస్తుండగా కొనసాగుతున్న విమానయాన సేవల్ని రద్దు చేయడం అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి ప్రపంచ దేశాలకు విమానయాన సదుపాయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆశించిన వర్గాలకు కొనసాగుతున్న విమాన సేవల్ని రద్దు చేయడం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. బెంగళూరుకు స్వదేశీ విమాన సేవల్ని రద్దు చేయడంతో రాష్ట్రం నుంచి సాంకేతిక సమాచార వ్యవహారాల నేపథ్యంలో రాకపోకలు చేసే వర్గాలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. భువనేశ్వర్ నుంచి బ్యాంకాక్, బెంగళూరు ప్రాంతాలకు ఇటీవల రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సేవల్ని తక్షణమే పునరుద్ధరించడంలో ప్రత్యక్షంగా చొరవ కల్పించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభ్యర్థించారు. -
రైళ్లలో విమాన తరహా భోజనం..!!
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ: రైళ్లలో వడ్డించే ఆహారం నాణ్యతను మెరుగుపర్చేందుకు మెనూలో మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందుకోసం విమానయాన సంస్థల మెనూను కాపీ కొట్టాలని చూస్తోంది. మెనూపై ఏర్పాటు చేసిన రైల్వే కమిటీ ఇటీవలే తన నివేదికను బోర్డుకు సమర్పించింది. దానిని విశ్లేషించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. రైళ్లలో రెడీమేడ్ ఆహార పదార్థాల్ని కూడా ప్రయాణికులకు అందించాలని కమిటీ సిఫార్సు చేసింది. వెజిటబుల్ బిర్యానీ, రాజ్మా చావల్, హక్కా నూడిల్స్, పులావ్, లడ్డూ వంటివి వడ్డించాలని సూచించింది. -
సురక్షితమైన ఎయిర్‌లైన్స్ సంస్థలివే..