న్యూఢిల్లీ : న్యూఢిల్లీ: రైళ్లలో వడ్డించే ఆహారం నాణ్యతను మెరుగుపర్చేందుకు మెనూలో మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందుకోసం విమానయాన సంస్థల మెనూను కాపీ కొట్టాలని చూస్తోంది. మెనూపై ఏర్పాటు చేసిన రైల్వే కమిటీ ఇటీవలే తన నివేదికను బోర్డుకు సమర్పించింది. దానిని విశ్లేషించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. రైళ్లలో రెడీమేడ్ ఆహార పదార్థాల్ని కూడా ప్రయాణికులకు అందించాలని కమిటీ సిఫార్సు చేసింది. వెజిటబుల్ బిర్యానీ, రాజ్మా చావల్, హక్కా నూడిల్స్, పులావ్, లడ్డూ వంటివి వడ్డించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment