
అందాన్ని బంధిద్దాం.. సెల్ఫీ తీసుకుంటున్న కళాకారులు ఫొటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్

పనికెళ్తేనే పైసలు లేకపోతే పస్తులే: మేడే రోజున ట్రాక్టర్‌లో ఇసుక పోస్తున్న కూలీలు ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

బైకు'బలి': కాళ్లపై బైక్‌తో బలాన్ని ప్రదర్శిస్తున్న ప్రభాస్ ఫ్యాన్ ఫొటో: బాషా, అనంతపురం

చిక్‌బుక్ బిందె ఎంతదూరమండి: నీటికోసం అనంతపురంలో బిందెల క్యూలైన్లు ఫొటో: వీరేశ్, అనంతపురం

పడిపోయింది:ఇటీవల వీచిన గాలులకు పడిపోయిన వరి పంట ఫొటో: సంపత్, బాపట్ల

శ్రమజీవుల కష్టాలు తీరేనా: మేడే సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ఉప్పుతో గీసిన చిత్రాలు ఫొటో: చిత్తూరు, మురళి

చేపలా ఈదుతాం: వేసవి సందర్భంగా ఈత నేర్చుకుంటున్న చిన్నారులు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

మన సంప్రాదాయం: గుంటూరు వైద్య కళాశాల వార్షికోత్సవానికి పంచెకట్టు, చీరెలతో విద్యార్ధులు ఫొటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు

తుపాకీ జీపు: వీ లవ్ అమెరికా సినిమా ప్రమోషన్లలో భాగంగా జీపులో ఏర్పాటు చేసిన తుపాకీ బొమ్మ ఫొటో: కె రమేష్, హైదరాబాద్

జైలుకెళ్లారు గోల్డ్ మెడల్ పట్టారు: అంబేత్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన ఖైదీలు ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

మాకు మాత్రం ఎండ కాదా: ఎండలకు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఫీడర్లకు ఏర్పాటు చేసిన ఫ్యాన్లు: ఫొటో నాగరాజు, హైదరాబాద్

మనిషి కాదు బొమ్మ: ఎండలకు శిల్పారామంలోని బొమ్మకు నీళ్లు పడుతున్న కార్మికురాలు ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

చెవులతో లాగేస్తా: చెవులతో కారును లాగుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి: ఫొటో రాకేష్, హైదరాబాద్

ఎండా కాలమైన మా పని ఇంతే... పబ్లిక్ నాలాకు జలమండలి తాళం ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

హెల్మెట్ కాపాడింది: రెండు బైకులు ఢీకొనడంతో రోడ్డుమీద పడిపోయన చోదకుడు ఫొటో: సురేష్‌కుమార్, హైదరాబాద్

ఎండ మండే: ఎండ తాకిడికి అమీర్‌పేటలో ముసుగులు వేసుకొని వెళ్తున్న యువతులు ఫొటో: వీరాంజనేయులు, హైదరాబాద్

కలసికట్టుగా: ధాన్యం కుప్ప నూర్చడానికి కష్టపడుతున్న కుటుంబం ఫొటో: వేణుగోపాల్, జనగాం

పంట పండలేదు: మిర్చి పంట పండకపోవడంతో గొర్రెలకు మేతగా వదిలేసిన పొలం ఫొటో: రమేష్, కడప

ఏకవీర: సైకిల్‌ను ఒంటి చక్రంపై లేపి విన్యాసం చేస్తున్న బాలుడు ఫొటో: రవికుమార్, కడప

సీటు చిరిగింది: కొత్తగూడెంలో బాహుబలి సినిమా సందర్భంగా ఓ థియేటర్‌లో చెదిరిపోయిన సీట్లు ఫొటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

వామ్మో ఈ వర్షం నన్నుపరిగెత్తిస్తోంది ఫొటో: సతీష్‌కుమార్, కాకినాడ

కోవెల కాదు..పెళ్లి మండపం: పెళ్లి కోసం వేసిన ఆలయం సెట్ ఫొటో:రాజు, ఖమ్మం

హైవేపై ప్రకృతి అందం.. మనసుకు ఆహ్లాదం: ఫొటో అరుణ్‌గౌడ్, కామారెడ్డి

పునర్జన్మ: అరుదైన గుండె శస్త్రచికిత్స చేయించుకుని విజయ సంకేతాన్ని చూపుతున్న వ్యక్తి ఫొటో: హుస్సేన్, కర్నూలు

పరిమళించిన మానవత్వం: మండుటెండలోదివ్యాంగుడి దాహం తీరుస్తున్న వ్యక్తి దశ్యం ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

ఎండ నుంచి ఉపశమనం: తలపై అట్టపెట్టెతో ఎండ నుంచి ఉపశమనం పొందుతున్న బాటసారి ఫొటో: స్వామి, కర్నూలు

మారింది మహిళా లోకం: ఓవైన్‌షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్న మహిళలు ఫొటో: మురళిమోహన్, మహబూబాబాద్

రేపటి ఫోటో గ్రాఫర్: సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న బాబు ఫోటోను తీస్తున్న తనయుడు దుల్‌కర్ ఫొటో: అజీజ్, మచిలీపట్నం

ప్రకృతి అందాల నడుమ కీసర మల్లన్న గోపురం ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

అలసి ఇంటికి: ఉపాధి హామీ పనినుంచి ఇంటికి వెళ్తున్న కూలీలు ఫొటో: నరసయ్య, మంచిర్యాల

వర్షం ముంచింది: వర్షంలో తడిచిన ధాన్యాన్ని కుప్పనూర్చుతున్న శ్రామికుడు ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నూలు

చల్లచల్లగా: నల్లగొండలోని ఓ ఇంట్లో కుక్కకు కూలర్ ఏర్పాటు చేసిన దశ్యం ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

నెల్లూరు కస్తూరిదేవి కళాక్షేత్రంలో సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థులు ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

నీరు కరువాయె: ఆసుపత్రిలోనీళ్లు దొరక్క బయట బోరు దగ్గర పట్టుకుంటున్న బాలుడు ఫొటో: కైలాష్ కుమార్, నిర్మల్

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సప్లై పైపు వద్ద కారుతున్న నీరు పట్టుకుంటున్న ప్రజలు ఫొటో:రాజ్‌కుమార్, నిజామాబాద్

నీటికోసం కోటి తిప్పలు: ఆలకూరపాడులో ఎండిన చెరువులో ఉన్న గుంతలో నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు ఫోటో: ప్రసాద్, ఒంగోలు

ఎంతబాగుందో:అక్షయ తతీయ రోజున పెద్దపల్లిలోనెక్లెస్ ధరించి మురిసిపోతున్న మహిళ ఫొటో:సతీష్‌కుమార్, పెద్దపల్లి

వర్షంలో వ్యాపారం: వర్షంలో పండ్లు అమ్ముతున్న వ్యాపారి ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

ఆకాశమే హద్దుగా: గంతులేస్తున్న యువతులు ఫోటో: సతీస్, సిద్దిపేట

ఖాలీ సీసాలే..కాపలా: ఖాళీ సీసాకు రాళ్ళతో కట్టి పంటను కాపాడేందుకు రైతులు వినూత్న ఆలోచన ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి

మిర్చి పంటకు ధర లేకపోవడంతో చెలకలోనే మిర్చిని వదిలేసి దీనంగా కూర్చున్న రైతు ఫొటో: యాకయ్య, సూర్యాపేట

ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్న బాతుపిల్లలపై నీటినిచల్లుతున్న యజమాని ఫొటో: మాధవరెడ్డి,తిరుపతి

మండే అగ్నిగోళం: భగభగలాడుతున్న భానుడి చుట్టూ వలయం ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

హనుమా నన్ను బ్రోవుమా..: ఆంజనేయుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తున్న కోతి ఫొటో: భగవాన్, విజయవాడ