
పంట పండలేదు: వేసిన పంట పండక వదిలేసిన పొలం ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

చెట్టుకు నీడ: వెలగపూడి సచివాలయంలో చెట్లకు గ్రీన్ మ్యాట్ కట్టిన దృష్యం ఫొటో: విజయ కృష్ణ, అవరావతి

గుత్తులు గుత్తులు: ఎస్కేయూలోని విరగకాసిన బంక కాయలు ఫొటో: బాషా, అనంతపురం

బ్రతకుపోరాటం: సమస్యలను పరిస్కరించాలని ఉరివేసుకుని వినూత్న నిరసన తెలుపుతున్న కార్మికులు ఫొటో: వీరేష్, అనంతపురం

మము బ్రోవుమమ్మా: భక్తి పారవశ్యంలో మునిగిపోయిన ఓంశక్తి భక్తులు ఫొటో: మురళి, చిత్తూరు

గొంతెండుతోంది: ఎండ వేడిమి తట్టుకోలేక నీరు తాగుతున్న యువకుడు ఫొటో: రియాజుద్థీన్, ఏలూరు

ఏసీ బస్: ఎండల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు బస్సుకు చలవపట్టలు ఏర్పాటు చేసిన దృశ్యం ఫొటో: రామ్‌గోపాల్, గుంటూరు

బోర్డు మాత్రమే పచ్చగా: అరణ్యభవన్ వద్ద ఎండిపోయిన చెట్టు, దాని వెనుకే హరితహారం బోర్డు ఫొటో: అనిల్, హైదరాబాద్

సూర్యుడా మజాకానా: నగరంలో ఎండలకు ఖాళీగా ఉన్న రోడ్లు ఫొటో: రమేష్‌బాబు, హైదరాబాద్

బస్సు తుస్సు: బాబు బస్సు ఆగింది, కాస్తా తోయండి స్టార్ట్ అవుతుంది ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

ఎగిరిపోతాం: మండు వేసవిలో కూడా చార్మినార్ వద్ద కనువిందు చేస్తున్న పావురాలు ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

నాంపల్లి, టీడిపీ మహానాడులో తాగేందుకు నీళ్లు లేక కిందపడ్డ ఐస్ గడ్డలను నోట్ల వేసుకోని దాహం తీర్చుకుంటున్న దృశ్యం ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

ఒకటే బండి- ఆరుగురండి: ఒకే బైక్‌పై ఆరుగురు వెళ్తున్న దృశ్యం ఫొటో: రవికుమార్, హైదరాబాద్

చల్ చల్ గుర్రం: గుర్రం ఎక్కి సరదా పడుతున్న బాలుడు ఫొటో: సాయిదత్తు, హైదరాబాద్.

డైనోసారా అయితే ఎంటీ: డైనోసార్ బొమ్మతో ఫొటోకు ఫోజు ఇస్తున్న నటి దక్ష ఫొటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్

హలీంకు సలాం! : రంజాన్ నెల ప్రారంభం కావడంతో హలీం వంటశాలను సిద్దం చేస్తున్న దృశ్యం

నరికేస్తున్నారు: నిలవడానికి నీడనిచ్చే చెట్టును నరికేస్తున్న దృశ్యం ఫొటో: సురేష్‌కుమార్, హైదరాబాద్

ఎక్కడైనా డ్యూటీనే: రైలు పట్టాల వెంట తనిఖీలు నిర్వహిస్తున్న సైనికులు ఫొటో: వేణుగోపాల్, జనగాం

చిక్‌బుక్ బండి: వేసవి సెలవులు కావడంతో రైలు ఆటలాడుతున్న చిన్నారులు ఫొటో: వేణుగోపాల్, జనగాం

విజయీభవ: వైఎస్ జగన్‌కు హారతినిస్తున్న అభిమాని ఫొటో:రవికుమార్, కడప

ప్రాణాలు అటో..ఇటో..ఎటో..! టేకులపల్లిలో..ఆటోలో ప్రమాదపు ప్రయాణం.. ఫొటో: దశరధ్, కొత్తగూడెం

హాయి హాయిగా: మహానాడు సమావేశంలో కునికిపాట్లు తీస్తున్న తెలుగుదేశం నాయకులు ఫొటో: సతీష్‌కుమార్, కాకినాడ

తడవకుండా ఉండాలంటే తడపాల్సిందే: సబ్‌స్టేషన్‌లో ఎర్త్‌పై నీటితో పిచికారీ ఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

జన నివాళి: చెరుకులపాడు నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరైన పోటెత్తిన జనం ఫొటో: హుస్సేన్, కర్నూలు

గురితప్పదు: అటవీ అధికారులు తయారు చేసిన సీడ్ బాంబ్‌ను ఎక్కుపెట్టిన ఉప ముఖ్యమంత్రి ఫొటో:మురళీమోహన్, మహబూబాబాద్

మండే ఎండలో పచ్చని పొదరిల్లు ఫొటో:మురళీమోహన్, మహబూబాబాద్

ఆదిమానవుని ఆనవాళ్లు: గడ్డిగూడెంలో రాళ్లతో ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్న గృహం ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్

బరువెక్కువైంది.. బాసూ.. : బరువు ఎక్కువ కావడంతో పైకిలేచిన ఆటో ఫొటో: అజీజ్, మచిలీపట్నం.

ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఏర్పటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

ఆరోగ్యకరమైన కూరగాయలకు అందమైన పుష్పాలు ఫొటో: దేవేందర్, మెదక్

వర్షం పడుతోంది: వర్షం నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్న పిల్లలు, పెద్దలు ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నూలు

అమిత్‌షాతో భోజనం: తేరటుపల్లి గ్రామంలో దళితవాడలో సహపంక్తి భోజనం చేస్తున్న అమిత్‌షా ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

మెరుపులు...సప్తవర్ణ శోభితం: నల్లగొండలో ఒకేరోజు ఆకాశంలో కనిపించిన మార్పులు ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

చిన్నారి కష్టం: ఎండలో గొడుగు పట్టుకెళ్తున్న చిన్నారి ఫొటో: సతీష్‌కుమార్, పెద్దపల్లి

కేరింత: స్విమ్మింగ్ పూల్‌లో కేరంతలు కొడుతున్న చిన్నారులు

బొండం తాగాల్సిందే: ఎండల వేడికి ఉపశమనం కోసం కొబ్బరి బోండాలు తాగుతున్న ప్రజలు ఫొటో: సతీష్ కె, సిద్దిపేట

మీ అభిమానం చల్లగుండ: జగనన్నకు ఆప్యాయంగా స్వీట్ తినిపిస్తున్న మహిళలు ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

మంజీరా వన్యప్రాణి అభయారణ్యంలో జింకకు ఎండ దెబ్బ తగలకుండా నీటితో తడుపుతున్న అటవీశాఖ అధికారులు ఫొటో: శివ ప్రసాద్, సంగారెడ్డి

అసలే ఎండ ఆపై నెత్తిన గ్యాస్‌బండ: జిన్నారం మండలం బొల్లారంలో మిట్ట మద్యాహ్నం నెత్తిన గ్యాస్ సిలిండర్‌తో వెళ్తున్న మహిళ ఫొటో: శివ ప్రసాద్, సంగారెడ్డి

నీటి కోసం కోటి కష్టాలు: తాగునీటి కేంద్రం వద్ద బారులు తీరిన ప్రజలు ఫొటో: శ్రీకాంత్, రాజన్న సిరిసిల్ల

నాట్య విన్యాసం: శ్రీవారి ఆలయంలో నాట్య ప్రదర్శన చేస్తున్న కళాకారులు ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

సాయంత్రం కావడంతో గూటికి చేరుతున్న పిచ్చుకలు ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

ఆకాశంలో అలజడి: వర్షం కారణంగా విజయవాడలో ఆకాశంలో ఏర్పడిన మెరుపులు ఫొటో: భగవాన్, విజయవాడ

చేపలా ఈదుతాం: సమ్మర్ క్యాంప్‌లో విద్యార్ధుల స్విమింగ్ పోటీలు ఫొటో: చక్రపాణి, విజయవాడ

విజయవాడలో ఎండ వేడికి ఆటోపై కొబ్బరి ఆకులు వేసుకున్న దృశ్యం ఫొటో: చక్రపాణి, విజయవాడ

విజయవాడలో ఎండవేడికి ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని వెళ్తున్న ప్రయాణికులు ఫొటో: కిషోర్, విజయవాడ

ఎండతీవ్రత కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో నిలిచిపోయిన నాటు పడవలు ఫొటో: నవాజ్, వైజాగ్

ఆకలేస్తోంది: అక్కయ్యపాలెంలో ఓ ఇంట్లో ఉడత క్యారెట్ తింటున్న దృశ్యం ఫొటో: నవాజ్, వైజాగ్

ఎండల్లో చల్లగా: సందర్శకుల కోసం విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసిన హట్స్ ఫొటో: మోహన రావు, వైజాగ్

ఇల్లు లేకుంటే ఎలా: చెట్టుకు గూడు అల్లుకుంటున్న జంట పిచ్చుకలు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నీకు నేను నాకు నువ్వు: ఒకరికి ఒకరు అన్నట్టుగా పంజరంలోని అందమైన పిచ్చుకల జంట ఫొటో: శివశంకర్, యాదాద్రి