1/12
తెలంగాణ కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. ఆరుగురు కొత్త వారి చేరికతో కేసీఆర్ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 18కి చేరింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 18మంది మంత్రులు కేసీఆర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
2/12
తెలంగాణలో కొత్తగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం రాజ్భవన్లో వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), అల్లోల. ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్ ), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్ నగర్), అజ్మీరా చందూలాల్ (వరంగల్ ), జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) మంత్రులుగా ప్రమాణం చేశారు.
3/12
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ అభివాదం చేశారు.
4/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సి.లక్ష్మారెడ్డి (మహబూబ్ నగర్) విద్యుత్ శాఖ.
5/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) రోడ్లు, భవనాల శాఖ.
6/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్) పర్యాటక శాఖ.
7/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) పరిశ్రమల శాఖ.
8/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అల్లోల. ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్) గృహనిర్మాణ శాఖ.
9/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజ్మీరా చందూలాల్ (వరంగల్ ) సంక్షేమ శాఖ.
10/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్) విజయానందం.
11/12
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) కార్యకర్తలకు అభివాదం.
12/12
మంగళవారం ఉదయం రాజ్భవన్ వద్దకు చేరుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు.