ministers Portfolios
-
పద్మారావు, రామన్నలకు అదనపు శాఖలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురికి శాఖలు కేటాయించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నకు అదనంగా బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌వర్మ ఈమేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు 1) జూపల్లి కృష్ణారావు - పరిశ్రమలు, చేనేత, చక్కెర శాఖ 2) తుమ్మల నాగేశ్వరరావు - రోడ్ల, భవనాలు, స్త్రీశిశు సంక్షేమ శాఖ 3) సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ 4) తలసాని శ్రీనివాసయాదవ్ - వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ 5) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖ 6) ఏ. చందూలాల్- గిరిజన సంక్షేమం, టూరిజం శాఖ -
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
-
కొత్త మంత్రులు ... శాఖలు !
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో కొత్త మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురికి శాఖలు కేటాయించినట్లు సమాచారం. మంత్రులు వారి శాఖలు : 1) జూపల్లి కృష్ణారావు - పరిశ్రమల శాఖ 2) తుమ్మల నాగేశ్వరరావు - రోడ్ల, భవనాల శాఖ 3) సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ 4) తలసాని శ్రీనివాసయాదవ్ - వాణిజ్య పన్నుల శాఖ 5) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణ శాఖ 6) ఏ. చందూలాల్ : గిరిజన సంక్షేమ శాఖ -
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం తన మంత్రివర్గానికి శాఖలు కేటాయించారు. మంత్రుల జాబితాను ఆయన గవర్నర్ నరసింహన్‌కు పంపారు. కేఈ కృష్ణమూర్తి- రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఎన్.చినరాజప్ప - హోం శాఖ యనమల-ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాలు అయ్యన్నపాత్రుడు-పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఉపాధిహామీ బొజ్జల-పర్యావరణ, అటవీశాఖ, సైన్స్, టెక్నాలజీ దేవినేని ఉమ-భారీ నీటిపారుదల డా.నారాయణ-పురపాలకశాఖ పరిటాల సునీత-పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖలు ప్రత్తిపాటిపుల్లారావు- వ్యవసాయశాఖ, మార్కెటింగ్ గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ కామినేని శ్రీనివాస్-వైద్య,ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ గంటా శ్రీనివాసరావు- విద్యాశాఖ పల్లెరఘునాథరెడ్డి- సమాచార, ఐటీ అండ్ కమ్యునికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ. పీతల సుజాత- స్త్రీ, శిశు సంక్షేమశాఖ, గనులు, భూగర్భ వనరుల శాఖ అచ్చెనాయుడు-కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ సిద్ధా రాఘవరావు-రవాణా, ఆర్ అండ్ బీ కిమిడి మృణాళిని- గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ పారిశుద్ధ్యశాఖలు కొల్లు రవీంద్ర- బీసీ సంక్షేమ శాఖ, చేనేత, ఎక్సైజ్ శాఖలు రావెల కిషోర్‌బాబు- సాంఘిక , గిరిజన సంక్షేమ శాఖలు మాణిక్యాలరావు-దేవాదాయశాఖ