నేటి 'వి' చిత్రాలు | Best Photos Of The Day On September 1st 2024 In AP And Telangana, Images Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

Best Photos Of The Day: నేటి 'వి' చిత్రాలు

Published Sun, Sep 1 2024 10:11 AM | Last Updated on

Best Photos Of The Day Photo Gallery1
1/7

నెల్లూరు మూలపేటలో శనివారం వర్షం పడుతున్న సమయంలో కుటుంబసభ్యులకు గొడుగు ఏర్పాటు చేసి సిపాయి బండిపై వెళ్తున్న కార్మిమకుడు.

Best Photos Of The Day Photo Gallery2
2/7

విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసులు శనివారం భారీ బైక్‌ ర్యాలీ చేపట్టి హెల్మెట్‌ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Best Photos Of The Day Photo Gallery3
3/7

శనివారం విజయవాడలో కురిసిన భారీ వర్షానికి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిలిచిన వర్షపు నీరు.

Best Photos Of The Day Photo Gallery4
4/7

ట్యునీషియాకు చెందిన రౌవా తిలీ షాట్‌పుట్‌ ఎఫ్‌41 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వరుసగా ఐదో పారాలింపిక్స్‌లో ఆమె పసిడి పతకం గెలవడం విశేషం. ఓవరాల్‌గా ఆమెకు ఇది ఏడో ఒలింపిక్‌ స్వర్ణం. దీంతో పాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్‌ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా, 2012లో షాట్‌పుట్‌లో బంగారు పతకాన్ని అందుకుంది.

Best Photos Of The Day Photo Gallery5
5/7

ఆ తర్వాత 2016, 2020లలో అటు షాట్‌పుట్‌లో, ఇటు డిస్కస్‌లో రెండేసి స్వర్ణాల చొప్పున నెగ్గింది. ఇప్పుడు 34 ఏళ్ల వయసులో మళ్లీ పసిడితో మెరిసింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్లెర్‌ జాంగ్‌ 17 ఏళ్ల వయసులో బ్యాక్టీరియల్‌ బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. దాంతో కుడి మోకాలినుంచి కింది భాగం మొత్తం కోల్పోయింది. దీంతో పాటు ఎనిమిది చేతివేళ్ల పైభాగం కూడా కోల్పోవాల్సి వచ్చింది.

Best Photos Of The Day Photo Gallery6
6/7

ఆ తర్వాత మిగిలిన ఒక కాలును సమర్థంగా వాడలేకపోతున్నానంటూ డాక్టర్లకు చెప్పి తన ఎడమ మోకాలి కింది భాగాన్ని కూడా తొలగించుకుంది. పారాలింపిక్స్‌లో మహిళల లాంగ్‌జంప్‌ టి64 ఈవెంట్‌లో పోటీ పడిన ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఫ్లెర్‌ జాంగ్‌ ఇదే విభాగంలో పసిడి నెగ్గింది.

Best Photos Of The Day Photo Gallery7
7/7

గోర్రా: దుకాణంలో దొంగతనం చేశాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని చితకబాదడం తోపాటు కారు బోయ్ నెట్పై కట్టేసి తిప్పారు. గుజరాత్ రాష్ట్రం పంచమహల్ జిల్లా గోద్రా తాలూకా కంకు థంబ్లా గ్రామంలో ఆగస్ట్ 29న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితు దీని కారు బోయ్స్ నెట్పై తాడుతో కట్టేసి, మార్కెట్ ఏరియాలో తిప్పుతున్నట్లుగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల య్యింది. ఈ మేరకు బాధితుడు సుర్జన్ భాద్రి (30) పై పోలీసులు దొంగతనం యత్నం కింద కేసు నమోదు చేశారు. అతడిని కారుపై కట్టేసి తిప్పినందుకు గాను గణపతి సిన్హ్ పర్మార్, మనూభాయ్ చరణ్ లపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రూ.30 విలువైన విత్తనాల ప్యాకెట్లు మూడింటిని కొనుగోలు చేసి దుకాణ దారుకు రూ.500 నోటు ఇవ్వగా తనకు తిరిగి రూ.470 ఇచ్చాడని, అయినప్పటికీ దొం గతనం నేరం మోపీ కొట్టారని భాద్రి అం టున్నాడు. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement