Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YS Jagan Press Meet On Pulivendula ZPTC Bypolls Updates1
మరికాసేపట్లో వైఎస్‌ జగన్‌ కీలక ప్రెస్‌మీట్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ టీడీపీ అప్రజాస్వామ్యికంగా వ్యవహరించడంపైనా ఆయన ప్రధానంగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.

YSRCP MP Avinash Reddy Key Statement On Pulivendula Repolling2
ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్‌ బహిష్కరిస్తున్నాం: అవినాష్‌ రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను వైఎ‍స్సార్‌సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్‌ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్‌లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్‌లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్‌లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్‌లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్‌ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

KBC Slammed For Operation Sindoor Independence Day Special Episode3
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్‌ ఉల్లంఘనేనా?

కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో 17వ సీజన్‌ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్‌ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా రిలీజ్‌ కాగా.. సోషల్‌ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ ఎపిసోడ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్‌ హీరోస్‌ పేరిట ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్‌ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్‌ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్‌ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్‌ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్‌ నటుడు తన లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్‌ ఆఫీసర్‌ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్‌ ఓటీటీలో ఈ ఫుల్‌ ఎపిసోడ్‌ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్‌షిప్‌ తొలి కమాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.

Former Indian Cricketer Suresh Raina Summoned By ED In Betting Apps Case4
చిక్కుల్లో సురేశ్‌ రైనా.. ఈడీ నోటీసులు

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా చిక్కుల్లో చిక్కుకున్నాడు. అక్రమ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అతనికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు పంపింది. ఆగస్ట్‌ 13న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.1xBet అనే అక్రమ బెట్టింగ్‌ యాప్‌కు ప్రమోషన్ చేశాడని రైనాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌ గాంబ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద రైనాపై విచారణ జరుగనుంది. అక్రమ యాప్ ప్రకటనల్లో రైనా కనిపించినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే గూగుల్‌, మెటా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది. 1xBet తరహాలోనే గ్యాంబ్లింగ్‌కు పాల్పడే పలు యాప్స్‌పై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా 27,000 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా. ఇలాంటి కేసుల్లోనే సినీ సెలబ్రిటీలు విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, రానా దగ్గుబాటి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉంటే, సురేశ్‌ రైనా టీమిండియా, ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. త్వరలో అతను సీఎస్‌కేకు బ్యాటింగ్‌ కోచ్‌గా వెళ్లనున్నాడని సమాచారం. రైనాకు టీమిండియా తరఫున ఆడిన దానికంటే ఐపీఎల్‌ ద్వారా విశేషమైన గుర్తింపు దక్కింది. ఐపీఎల్‌లో విశేషంగా రాణించడం ద్వారా అతన్ని మిస్టర్‌ ఐపీఎల్‌గా కీర్తిస్తారు. ఐపీఎల్‌లో రైనా 2008 నుంచి 2021 వరకు సీఎస్‌కే తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీఎస్‌కే సాధించిన 4 ఐపీఎల్‌ టైటిళ్లలో రైనా కీలకపాత్ర పోషించాడు.

KSR Comments On Chandrababu politics5
అమలు చేశారా బాబూ!.. షరతుల సంగతేంటి?

సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్‌లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్‌ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్‌లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.చివరికి వైఎ‍స్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్‌సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

gold and silver rates on 13th August 2025 in Telugu states6
తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

PM Modi may Visit US for UNGA Session Next Month7
ఐరాస సమావేశానికి ప్రధాని మోదీ .. ట్రంప్‌తో ముఖాముఖీ?

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్‌జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్‌ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్‌ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.

Sridevi Birth Anniversary Special About Her Movies8
ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ శ్రీదేవిదే

టాలీవుడ్‌లో ఇప్పటివరకు వందలాది మంది హీరోయిన్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ శ్రీదేవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం వేరే లెవల్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ అతిలోక సుందరి అలా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమైన ఈమె.. ప్రమాదవశాత్తు తనువు చాలించడం మాత్రం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేని చేదు జ్ఞాపకం. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె సృష్టించిన క్రేజీ రికార్డ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)1963 ఆగస్టు 13న తమిళనాడులో పుట్టింది శ్రీదేవి. అయితే ఈమె అసలు పేరు ఇది కాదు. శ్రీ అమ్మ అయ్యంగర్. నాలుగేళ్ల వయసులోనే ఓ తమిళ సినిమాలో నటించింది. అప్పుడు తన స్క్రీన్ నేమ్ శ్రీదేవిగా మార్చుకుంది. 1970 నుంచి అయితే వరసగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ మూవీస్ చేస్తూనే ఉంది. అలా దాదాపు 200కి పైగా చిత్రాలు చేసి తిరుగులేని హీరోయిన్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది.దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'మా బంగారక్క'.. తెలుగులో హీరోయిన్‌గా శ్రీదేవికి తొలి సినిమా. కానీ రాఘవేంద్రరావు తీసిన 'పదహారేళ్ల వయసు' మూవీ ఈమెని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. అక్కడి నుంచి మొదలుపెడితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ శ్రీదేవి వరసపెట్టి సినిమాలు చేసింది. అద్భుతమైన హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.(ఇదీ చదవండి: 'తెలుగులో అల్లు అర్జున్‌'.. జాన్వీ కపూర్‌ పరమ్ సుందరి ట్రైలర్‌)అయితే శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది కదా.. అప్పట్లో పలువురు స్టార్ హీరోలకు మనవరాలు, కూతురిగా చేసిన ఈమె.. పెరిగి పెద్దయిన తర్వాత ఒకరిద్దరు అదే హీరోల పక్కన హీరోయిన్‌గానూ చేయడం విశేషం. ఈ రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ ఏ హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేరేమో? అంటే ఈ ఘనత మాత్రం ఎప్పటికీ శ్రీదేవి సొంతం.శ్రీదేవికి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు. కానీ వీళ్లిద్దరూ నటించడం చూడకుండానే శ్రీదేవి మరణించింది. బహుశా ఇదొక్కటే ఈమెకు తీరనిలోటు అని చెప్పొచ్చు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి.. ప్రమాదవశాత్తు మరణిస్తే అదే ఏడాది జూలై ఈమె పెద్ద కూతురు జాన్వీ తొలి సినిమా రిలీజైంది. ఇప్పుడు జాన్వీ.. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్)

Pakistan PM Shehbaz Sharif Threatens India Over Indus Waters Treaty9
‘భారత్‌కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్‌ తాటాకు చప్పుళ్లు

న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్‌కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా సహించేది లేదన్నారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్‌ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్‌.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. Shehbaz Sharif warns India of “serious consequences” if the Indus Water Treaty is touched… because in Pakistan’s worldview, water is off-limits but exporting militants is fair game.Four threats in 48 hrs from 4 men reading the same ISI script. Islamabad’s version of water… pic.twitter.com/DwXV9hbsPn— Mariam Solaimankhil (@Mariamistan) August 12, 2025షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్‌ ఇంకా స్పందించలేదు. కాగా పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్‌.. పాకిస్తాన్‌ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్‌ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్‌ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.

Due To Heavy Rain Forecast School Holidays In Telangana10
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. INSANE RAINFALL IN MANCHERIAL, ASIFABAD, MULUGU, BHUPALAPALLY, PEDDAPALLI The first round of LPA rains turned MASSIVE as North East TG got extremely heavy rainfall in few places. Bheemini, Kannepalli in Mancherial recorded highest rainfall of 207mm. Other parts too got VERY…— Telangana Weatherman (@balaji25_t) August 13, 2025భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై, ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.5:00 AM Update 🌧️🌧️Scattered Rains across - Adilabad, Asifabad, Nirmal, Mancherial, Nizamabad, Jagtial, Kamareddy, Sircilla, Karimnagar, Peddapalli, Siddipet, Sangareddy, Medak, Hanumakonda, Nalgonda, Suryapet, Nagarkurnool, Mahabubnagar, Wanaparthy, Gadwal districts next 3hrs— Weatherman Karthikk (@telangana_rains) August 12, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement