Top Stories
ప్రధాన వార్తలు

రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే.. మార్గదర్శి కేసులో ఆర్బీఐ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి మధ్యంతర పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణలో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి, ఆర్బీఐ వాదనలు వినిపించాయి. విచారణ సందర్భంగా రామోజీ మృతి చెందారు.. విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ సైతం దాదాపు ఇదే వాదనలు వినిపించింది.అదే సమయంలో మార్గదర్శి సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించింది. రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందేనని ఆర్బీఐ పట్టుబట్టింది. ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మార్చి7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (ఫిబ్రవరి 28) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్ మధ్యలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా ఆస్ట్రేలియా గ్రూప్-బి నుంచి సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగి రేపటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ భారీ విజయం సాధిస్తే తప్ప, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేదు. ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు పరోక్షంగా కలిసొచ్చింది. రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరీ దారుణంగా మాత్రం ఓడకూడదు. ఒకవేళ అలా జరిగి సౌతాఫ్రికా రన్‌రేట్ మైనస్‌లోకి పడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475), సౌతాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న మరో జట్టు ఇంగ్లండ్ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!క్రిక్‌బజ్ లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ సెకెండ్ బ్యాటింగ్ చేస్తే 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది (రెండు సందర్భాల్లో మొదటి ఇన్నింగ్స్ టోటల్ 300 పరుగులు అనుకుంటే).ఇలా జరగకపోతే మాత్రం రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైనా సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరుకుంటుంది.కాగా, గ్రూప్-ఏ నుంచి ఇదివరకే సెమీస్ బెర్తలు ఖారారైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి మరో మ్యాచ్ జరగాల్సి ఉన్నా భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గ్రూప్‌లో మిగిలిన మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 2వ తేదీన జరుగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (20) ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు. షార్ట్ వికెట్ ఒమర్జాయ్కు దక్కింది.

‘డీకే.. మరో ఏక్నాథ్ షిండే’
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్.. శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలపడింది.అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.. ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు.

AP Budget 2025: చంద్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా?

డాకు మహారాజ్ బ్యూటీ గొప్ప మనసు .. ఏకంగా 251 మంది అమ్మాయిలకు!
ఈ ఏడాది డాకు మహారాజ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025

నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్ డౌన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్ షట్ డౌన్‌పై మైక్రోసాప్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్ చరిత్రస్కైప్ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్,వాట్సాప్,జూమ్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్-19 సమయంలో స్కైప్ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్, గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్ఫారమ్ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్ స్కైప్‌ను షట్‌డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ తన ఫోకస్ అంతా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్టీమ్స్లో జోడించింది. ఇటీవల కోపైలెట్ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

ఇంగ్లండ్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్ బట్లర్ (Jos Buttler) రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సౌతాఫ్రికాతో రేపు (మార్చి 1) జరుగబోయే మ్యాచ్ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బట్లర్‌కు చివరిది. 2022 జూన్‌లో బట్లర్ ఇంగ్లండ్ ఫుల్ టైమ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్ మోర్గాన్ నుంచి బట్లర్ బాధ్యతలు స్వీకరించాడు. బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ వన్డేల్లో దారుణంగా విఫలమైంది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. వన్డే వరల్డ్‌కప్ తర్వాత బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ 17లో 13 వన్డేలు ఓడింది.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అనంతరం రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ పూర్తయిన వెంటనే బట్లర్ రాజీనామా విషయమై హింట్ ఇచ్చాడు. తాజాగా అధికారికంగా తన రాజీనామాను ప్రకటించాడు. భారత్ సిరీస్‌లోనూ ఘోర పరాభవంబట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత పర్యటనలోనూ దారుణంగా విఫలమైంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో (క్లీన్ స్వీప్) కోల్పోయింది. భారత్‌తో సిరీస్‌లు ముగిసిన వెంటనే బట్లర్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపించాయి.వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమవుతున్న బట్లర్పరిమిత ఓవర్లలో జట్టును విజయవంతంగా నడిపించలేకపోయిన బట్లర్.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడు. బట్లర్ బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ జాలువారి చాలాకాలం అయ్యింది. భారత్ పర్యటనలో.. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బట్లర్ తేలిపోయాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న బట్లర్ గాయాలతోనూ వేధించబడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ నాయకత్వంలో టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఇంగ్లండ్ తదుపరి వైట్ బాల్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను నియమించాలని ఆ దేశ అభిమానలు కోరుకుంటున్నారు.

ఎల్పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్‌గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వేతన పెంపులు (Salary Hikes) క్లిష్టంగా మారుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో నిబంధనను తెస్తున్నాయి. తాజాగా ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) సంస్థ కొత్త సామర్థ్య ఆధారిత మదింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్ చేసింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఈ చొరవ లక్ష్యం మేనేజర్లు తమ పాత్రలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయడమే.కాంపిటెన్సీ టెస్ట్మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లో కోడింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. బృందాలకు నాయకత్వం వహించడానికి, సంస్థ ఎదుగుదలను నడిపించడానికి అవసరమైన సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించారు. నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న టీమ్ లీడ్ లు, లీడ్ ఆర్కిటెక్ట్ లను కలిగి ఉన్న పీ3, పీ4, పీ5 బ్యాండ్ ల్లోని మేనేజర్ లు వేతన పెంపునకు అర్హత పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.చొరవ వెనుక హేతుబద్ధతశరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమలో పోటీతత్వంతో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామర్థ్య ఆధారిత అప్రైజల్ వ్యవస్థను అమలు చేయాలని ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను వేతన పెంపునకు అనుసంధానించడం ద్వారా, కంపెనీ తన మేనేజర్లకు తాజా నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉందని నిర్ధారించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం శ్రామిక శక్తి మొత్తం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నిరంతర అభ్యాసం, అభివృద్ధికి కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.పరిశ్రమ ప్రభావంఎల్టీఐమైండ్ట్రీ తీసుకున్న ఈ నిర్ణయం బహుశా భారత ఐటీ పరిశ్రమలో ఇదే మొదటిది కావచ్చు. పనితీరు మదింపులలో నైపుణ్యాల ఆధారిత మదింపుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఇతర కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణను ఏర్పరుస్తుంది. వేతన పెంపునకు సామర్థ్య పరీక్షను తీసుకురావడం మెరిటోక్రసీపై కంపెనీ దృష్టిని, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించే వైఖరిని తెలియజేస్తోంది.ఇది చదివారా? ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..ఉద్యోగుల రియాక్షన్ఎల్టీఐమైండ్ట్రీ తీసుకొచ్చిన కొత్త అప్రైజల్ వ్యవస్థపై ఉద్యోగుల నుంచి మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంక, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడాన్ని కొంత మంది ఉద్యోగులు అభినందిస్తున్నారు. అదనపు ఒత్తిడి, వేతనాల పెంపుపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా రూపొందించామని, అందుకు వారు సిద్ధం కావడానికి తగిన సహకారం, వనరులను అందిస్తామని ఎల్‌టీఐమైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.

మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ త్వరలోనే ..
‘డీకే.. మరో ఏక్నాథ్ షిండే’
మిల్కీ బ్యూటీపై స్కామ్ ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన తమన్నా
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
‘సుప్రీం ఆదేశాలను పోలీసులు తుంగలో తొక్కుతున్నారు’
ఎపిక్ వరల్డ్ నుంచి కొత్త ఇండెక్స్
ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ
Champions Trophy 2025: ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: పొన్నవోలు
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
..సంపద సృష్టిస్తున్నారు..!
అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి..
CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ త్వరలోనే ..
‘డీకే.. మరో ఏక్నాథ్ షిండే’
మిల్కీ బ్యూటీపై స్కామ్ ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన తమన్నా
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
‘సుప్రీం ఆదేశాలను పోలీసులు తుంగలో తొక్కుతున్నారు’
ఎపిక్ వరల్డ్ నుంచి కొత్త ఇండెక్స్
ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ
Champions Trophy 2025: ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: పొన్నవోలు
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
..సంపద సృష్టిస్తున్నారు..!
అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి..
CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం
సినిమా

సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూసిన దిల్ రాజు ఓ మాట అన్నారని గుర్తు చేసుకున్నారు.దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. 'దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్‌కు ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు. ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అని అన్నారు. కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. తమ్ముళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి' అని అన్నారు. కాగా.. మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించారు.

నాటకాలా? నువ్వు, నీ ఫ్రెండ్ రాజమౌళి రోడ్డుమీద కొట్టుకోండి: నిర్మాత ఫైర్
టాప్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli)పై ఆయన సన్నిహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇద్దరూ ఒకమ్మాయినే ప్రేమించగా రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశానన్నాడు. అతడి కోసం 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నానని.. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సినిమాగా తీస్తానన్నానో అప్పటి నుంచి తనను టార్చర్ పెట్టడం ప్రారంభించాడని ఆరోపించాడు. రాజమౌళి వల్ల తన ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయాడు.ఫ్రెండ్ అయితే చెవిలో చెప్పాలి!ఈ ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రాజమౌళి స్టార్ డైరెక్టర్.. ఇప్పుడొచ్చి ఇదంతా చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా ఫ్రెండ్ అనుకుంటే వెళ్లి చెవిలో చెప్పాలి. అయినా ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఎందుకంటే.. ఎప్పుడో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చేశాం. రాజమౌళి కోసం ప్రేమ త్యాగం చేసి అతడి దగ్గరే అనుచరుడిగా పని చేశానన్నాడు. సడన్‌గా ఇలా మాట్లాడుతున్నాడంటే.. డబ్బు దగ్గర సమస్య వచ్చిందా?(చదవండి: డ్రాగన్ సక్సెస్.. టాలీవుడ్ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!)పిచ్చిపిచ్చి నాటకాలా?ఆయన చేసిన అభియోగాలకు ఏదైనా సాక్ష్యం ఉందా? నేను రాజమౌళికి సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి బెదిరిస్తే పోలీసు దగ్గరకు వెళ్లొచ్చు. కానీ ఇలా బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు.. కానీ 34 ఏళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడటం తప్పు. ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు పుట్టి, మనవళ్లు కూడా ఉండొచ్చు. ముసలాడివయ్యాక ఇప్పుడు లవ్‌స్టోరీ గుర్తొచ్చి బయటపెడతావా? పిచ్చిపిచ్చి నాటకాలా? అమ్మాయితో ఆడుకుంటారా? ఏమైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి..రోడ్డుమీద పడి కొట్టుకోండి..అమ్మాయి మనోభావాలు దెబ్బతినేవిధంగా, ఆమెకు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడటం తప్పు. మీరిద్దరూ మాట్లాడుకోండి, తిట్టుకోండి, అవసరమైతే రోడ్డుపై కొట్టుకోండి.. కానీ అమ్మాయిని రోడ్డు మీదకు లాగడం కరెక్ట్ కాదు. ఆయన నిజంగా ఆమెను ప్రేమించి ఉంటే తనను ఇబ్బందిపెట్టడం శ్రేయస్కరం కాదు. ఆమెకు నానమ్మ వయసొచ్చాక ఈ విషయాలు చెప్తారా? ఏంటిది? ఇవన్నీ పిచ్చిపిచ్చి వేషాలు అని నట్టికుమార్ మండిపడ్డాడు.చదవండి: ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్..: శివరాజ్‌కుమార్

'రజినీకాంత్ మూవీ సెట్లో సందీప్ కిషన్.. అసలు కారణం ఇదే'
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్గా నటించారు. మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ ప్రశ్నకు సందీప్ సమాధానమిచ్చారు. రజినీకాంత్ కూలీ మీరు నటిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో మనం ఓ లుక్కేద్దాం.రజినీకాంత్ మూవీ కూలీలో తాను నటించడం లేదని సందీప్ కిషన్ అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన ఫ్రెండ్ కావడంతోనే కూలీ సెట్‌కు వెళ్లానని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని వెల్లడించారు. నేను దాదాపు 45 నిమిషాల పాటు కూలీ సినిమాను వీక్షించానని సందీప్ వివరించారు. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని తెలిపారు. రజినీకాంత్ సార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని మన యంగ్ హీరో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేశ్ కనగరాజ్‌తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా.. కూలీ మూవీ సెట్స్ నుంచి లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సందీప్ కిషన్ ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆయన నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!)సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 27 న మేకర్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్కరం బంగారం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరిగే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నరు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.

ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్..: శివరాజ్‌కుమార్
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (Shivarajkumar)కు సినిమాలపై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందుకనే.. ఓ పక్క క్యాన్సర్‌తో బాధపడుతున్నా సరే ఇటు షూటింగ్స్ వదల్లేదు. అటు కీమోథెరపీ చేయించుకుంటూనే ఇటు షూటింగ్లో పాల్గొన్నాడు. చికిత్సలో భాగంగా ఇటీవలే అమెరికాలో సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.ఇంకేం చేయగలను?నిజాయితీగా చెప్పాలంటే.. నాకు క్యాన్సర్ (Bladder Cancer) సోకిందన్న విషయం తెలియగానే భయపడ్డాను. కానీ దాన్ని ఎదుర్కోవడం తప్ప ఇంకేం చేయగలను? అయితే నేను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయగలనా? లేదా? అన్నదే నా ముందున్న పెద్ద ప్రశ్న! సినిమాలు చేస్తూ డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ అనే రియాలిటీ షోకు హాజరవుతూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలుతుందని తెలుసు. దీనివల్ల నా సినిమా లుక్ దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాను. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‌కు వెళ్లడం వల్ల త్వరగా అలిసిపోయిన ఫీలింగ్ వచ్చేది. అందులోనూ కీమోథెరపీ తర్వాత సెట్లో అడుగుపెట్టినప్పుడు నా ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే 45 సినిమాలో క్లైమాక్స్ షూట్ కూడా పూర్తి చేశాం. అందులో నా పర్ఫామెన్స్ చూసి మీరు కచ్చితంగా షాకవుతారు. శివన్నా ఎలా చేయగలిగాడు? అని ఆశ్చర్యపోతారు. ఇకపోతే ఆ భగవంతుడే నన్ను ఈ క్యాన్సర్ గండం నుంచి గట్టెక్కించాడు.అప్పటినుంచే తిరిగి షూటింగ్స్‌లో..మార్చి 3 నుంచి నా తర్వాతి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటాను. రామ్‌చరణ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాను. మార్చి 5న హైదరాబాద్‌లో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌కు హాజరు కానున్నాను అని చెప్పుకొచ్చాడు. శివరాజ్‌కుమార్ చివరగా భైరతి రణగల్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన 45 మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ సామ్ రియాక్షన్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Champions Trophy: ఆసీస్‌తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ బౌండరీ బాదిన షార్ట్.. మూడో ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఒమర్జాయ్ వేసిన ఈ ఓవర్లో షార్ట్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్‌లో బౌండరీ బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా 3 ఓవర్లలో 32 పరుగులు చేసింది.హెడ్ క్యాచ్ జారవిడిచిన రషీద్ ఖాన్ఫజల్ హక్ ఫారూకీ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంది. హెడ్ మిడ్ ఆన్ దిశగా అందించిన క్యాచ్‌ను రషీద్ ఖాన్ జారవిడిచాడు. ఈ క్యాచ్ ఎంత మూల్యమైందో ఆఫ్ఘనిస్తాన్ కొద్ది సేపటిలోనే తెలిసింది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఆతర్వాతి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 4 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 42కు చేరింది.సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన ఖరోటేఅనంతరం ఐదో ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఖరోటే సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సారి మాథ్యూ షార్ట్‌కు లైఫ్ లభించింది. ఒమర్జాయ్ బౌలింగ్ షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను ఖరేటో వదిలేశాడు. దీంతో 7 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడిచినట్లైంది.ఆఫ్ఘనిస్తాన్ ఊపిరిపీల్చుకుందిఖరోటే క్యాచ్ వదిలేశాక రెండు బంతులకే షార్ట్ ఔటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్‌లో గుల్బదిన్ క్యాచ్ పట్టడంతో షార్ట్ మెరుపు ఇన్నింగ్స్‌కు (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్) తెరపడింది. దీంతో ఆఫ్ఘన్లు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌కు ఔట్ చేసిన ఆనందం ఆఫ్ఘన్లకు ఎంతో సేపు మిగల్లేదు. స్టీవ్ స్మిత్ వచ్చీ రాగానే రెండు వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆసీస్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.మూల్యం చెల్లించుకుంటున్న ఆఫ్లన్లుహెడ్ క్యాచ్‌ను జారవిడిచినందుకు ఆఫ్ఘన్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. లైఫ్ లభించాక హెడ్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 3 బౌండరీలు.. తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి ఆఫ్ఘన్లను పశ్చాత్తాపపడేలా చేశాడు. అనంతరం హెడ్ నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో రెండు పరుగులు తీసి కెరీర్లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లలోనే ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి 100 పరుగుల మార్కును తాకింది.ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది.

Champions Trophy 2025: ఆసీస్‌తో కీలక సమరం.. విధ్వంసం సృష్టించిన ఒమర్జాయ్
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అంచనాలకు మించి రాణిస్తుంది. ఆఫ్ఘన్లకు ఇది అరంగేట్రం ఎడిషనే (ఛాంపియన్స్ ట్రోఫీలో) అయినా.. ఎంతో అనుభవజ్ఞుల్లా ఆడుతున్నారు. దాయాది పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తున్నారు. ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో (సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి) తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (Sediqulla Atal) (95 బంతుల్లో 85), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatulla Omarzai) (63 బంతుల్లో 67) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్‌ను గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జద్రాన్ (22), వన్‌డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అనంతరం జద్రాన్‌ను అద్భుతమైన బంతితో ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. తర్వాత బరిలోకి దిగిన రహ్మత్ షా (12) కొద్దిసేపు నిలకడగా ఆడాడు. బౌండరీ కొట్టి జోష్ మీదున్న షాను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. అనంతరం అటల్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో (20) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే సెదిఖుల్లా దురదృష్టవశాత్తు సెంచరీకి ముందు ఔటై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు నీరుగార్చాడు. సెదీఖుల్లా క్రీజ్‌లో ఉన్నంత సేపు ఆస్ట్రేలియన్లకు చెమటలు పట్టించాడు.సెదిఖుల్లా ఔటైన కొద్ది సేపటికే హష్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4) కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితం అయ్యేలా చేసింది. ఈ దశలో గత మ్యాచ్ హీరో అజ్మతుల్లా ఒమర్జాయ్ విజృంభించాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్‌ను 270 దాటించాడు. మధ్యలో రషీద్ ఖాన్ (19) కూడా తన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. మొత్తానికి సెదీఖుల్లా, ఒమర్జాయ్ అదరగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది.

Ranji Trophy Final: చరిత్ర సృష్టించిన దూబే.. విదర్భకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
రంజీ క్రికెట్లో (Ranji Trohy) విదర్భ (Vidarbha) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే (Harsh Dubey) చరిత్ర సృష్టించాడు. ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (69 వికెట్లు) తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీహార్ బౌలర్ అషుతోష్ అమన్ పేరిట ఉండింది. అమన్ 2018-19 ఎడిషన్‌లో 68 వికెట్లు తీశాడు. ప్రస్తుత రంజీ ఎడిషన్ (2024-25) ఫైనల్లో (కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో) హర్ష్, అమన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఎడిషన్‌లో హర్ష్ 19 ఇన్నింగ్స్‌ల్లో 16 సగటున 69 వికెట్లు తీశాడు.రంజీ ట్రోఫీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హర్ష్ దూబే (విదర్భ)- 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (2024-25)ఆషుతోష్ అమన్ (బీహార్)- 8 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు (2018-19)జయదేవ్ ఉనద్కత్ (సౌరాష్ట్ర)- 10 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు (2019-20)ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హర్ష్ సహా విదర్భ బౌలర్లు రాణించడంతో విదర్భ కేరళపై కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు.విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటై, విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 37 పరుగులు వెనుకపడింది. కేరళ ఇన్నింగ్స్‌కు ఆదిత్య సర్వటే (79), కెప్టెన్ సచిన్ బేబి (98) జీవం పోశారు. వీరిద్దరూ అహ్మద్ ఇమ్రాన్ (37), సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజారుద్దీన్ (34), జలజ్ సక్సేనాతో (28) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఓ దశలో (సచిన్ క్రీజ్‌లో ఉండగా) కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేసేలా కనిపించింది. అయితే సచిన్ సెంచరీ ముందు అనవసర షాట్ ఆడి వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు జట్టును కూడా ఇరకాటంలో పడేశాడు. సచిన్ ఔటయ్యాక కేరళ ఇన్నింగ్స్ ఒక్కసారిగా గతి తప్పింది. 18 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. పార్థ్ రేఖడే సచిన్ సహా జలజ్ సక్సేనా, ఏడెన్ యపిల్ టామ్ వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హర్ష్ కూడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన ఆదిత్య సర్వటే, సల్మాన్ నిజర్, ఎండీ నిధీశ్ వికెట్లు పడగొట్టాడు. నిధీశ్ వికెట్‌తో హర్ష్ ఓ సింగిల్ రంజీ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించి విదర్భ కేరళపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భనే విజేతగా నిలుస్తుంది. అలాగని కేరళకు దారులు మూసుకుపోలేదు. కేరళ విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసి, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు తమ తొలి రంజీ టైటిల్ కలను నెరవేర్చుకుంటుంది. ప్రస్తుతానికి కేరళపై విదర్భ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. విదర్భ, కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. విదర్భ గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో భంగపడి టైటిల్ ఆశలను చేజార్చుకుంది. ఈసారి ఆ జట్టు ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా, ఈ సీజన్లో విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది.

నాకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ: స్టార్ క్రికెటర్ కామెంట్స్ వైరల్
సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(Rassie van der Dussen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి ఐసీసీ టోర్నీ కాబోతుందని పేర్కొన్నాడు. అయితే, తన రిటైర్మెంట్ అంశం గురించి ఇప్పుడే చెప్పలేనని.. ఇది మాత్రం వాస్తమని అన్నాడు.అఫ్గన్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకంకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను ఎదుర్కొంది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో డసెన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకంతో అదరగొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు.నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీతదుపరి సౌతాఫ్రికా ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రావల్పిండిలో బుధవారం జరగాల్సిన మ్యాచ్ రద్దై పోయింది. ఈ క్రమంలో మార్చి 1న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన డసెన్.. ‘‘నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అని కచ్చితంగా చెప్పగలను.ఇందుకోసం ముందుగా నేనేమీ ప్రణాళికలు రచించుకోలేదు. మేనేజ్మెంట్ కూడా నాపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. కానీ ఇదే నిజం. నా కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ప్రొటిస్ తరఫున క్రికెట్ ఆడటంమే నా ఏకైక లక్ష్యం. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.ప్రొటిస్ తరఫున కొనసాగుతాచాలా మంది రిటైర్మెంట్ తర్వాత లీగ్ క్రికెట్ ఆడతావా? అని అడుగుతున్నారు. ఏమో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ లీగ్ క్రికెట్లో ఆడాలన్న తపన నాలో ఉంది. అయితే, ముందుగా చెప్పినట్లు సౌతాఫ్రికాకు ఆడటమే నా మొదటి ప్రాధాన్యం. ఒకవేళ ఇంకో సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే కచ్చితంగా ప్రొటిస్ తరఫున కొనసాగుతా’’ అని తన మనసులోని భావాలను పంచుకున్నాడు.కాగా 36 ఏళ్ల రాసీ వాన్ డెర్ డసెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టాడు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 18 టెస్టులు, 69 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 905, 2516, 1257 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి.చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, తెంబా బావుమా (కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, హెన్రిచ్ క్లాసెన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.చదవండి: ‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్
బిజినెస్

ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ.. అన్ని రంగాల్లోనో రోబోట్స్ (Robots) హవా సాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో పనిచేయడానికి మనుషులు అవసరం లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనిషి చేయాల్సిన పనులను 'మర మనుషులు' చేసేస్తుంటే.. ఇక మనిషికి పనెక్కడుంటుంది. అయితే రోబోలను తయారు చేయడానికి.. వాటిలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడానికి మాత్రం మనిషి అవసరమే. ఇప్పటికే అనేక కంపెనీలు హ్యుమానాయిడ్ రోబోలను ప్రవేశపెట్టాయి. ఈ జాబితాలోకి 'ఫిగర్' (Figure) కూడా చేరనుంది.ఫిగర్ తన హ్యూమనాయిడ్ రోబోట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే ఇంట్లో పనిచేయడానికి సంబంధించిన రోబోలను ఈ ఏడాది టెస్ట్ చేయనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'బ్రెట్ అడ్కాక్' (Brett Adcock) ప్రకటించారు. మా ఏఐ హెలిక్స్ ఎవరూ ఊహించని దానికంటే వేగంగా ముందుకు వస్తోందని ట్వీట్ చేశారు.ఫిగర్ హ్యూమనాయిడ్ రోబోలు తమ చుట్టూ ఏం జరుగుతోందో చూడటానికి, భాషను అర్థం చేసుకోవడానికి, ఇతరులతో మాట్లాడటానికి, ఏదైనా పనిని చేయడం నేర్చుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని పొందుతాయి. ఇంట్లో పనిచేసే రోబోలు మాత్రమే కాకుండా ఫ్యాక్టరీలలో పనిచేయడానికి ఉపయోగపడే రోబోలను కూడా కంపెనీ రూపొందిస్తోంది.ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోల కదలికలు, అవి ఎలా పనిచేస్తాయని అని చూపే వీడియో కూడా ఇక్కడ చూడవచ్చు. రోబోలు వాటికి కేటాయించిన ప్రాంతాల్లో వెళ్లి నిలబడి, బెల్ట్ కన్వేయర్ మీద వెళ్తున్న వస్తువులను పక్కకు తీయడం చూడవచ్చు. ఇలాంటి రోబోలు.. ఈ కామర్స్ లేదా లాజిస్టిక్ కంపెనీలలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇక ఇంట్లో పనిచేసే రోబోల విషయానికి వస్తే.. ఇవి మనిషి మాదిరిగానే, ఇంట్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ఉపయోగపడతాయి. ఫుడ్ అందించడం, గోడమీద పెయింటింగ్ ఫోటో సరిచేయడం.. యజమాని స్పందనకు ప్రతిస్పందించడం వంటివి కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డెలివరీలను తీసుకోవడం, మనిషిలాగే పని పూర్తయిన తరువాత రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తోంది. ఇంటి పనిలో సహకరించే రోబోలు.. ఫ్యాక్టరీలో పనిచేసే రోబోలు అందుబాటులోకి వచ్చిన తరువాత అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.Important update: Figure is launching robots into the homeOur AI, Helix, is advancing faster than any of us anticipated, accelerating our timeline into the homeTherefore, we've moved-up our home timeline by 2 years; starting Alpha testing this year pic.twitter.com/t1TU1TseJq— Brett Adcock (@adcock_brett) February 27, 2025Source: Brett Adcock / X

ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.

12 మందితో మొదలైన పార్లే-జీ.. ప్యాకెట్‌పై ఉన్న పాప ఎవరో తెలుసా?
బిస్కెట్ అంటే గుర్తొచ్చే కంపెనీ.. దశాబ్దాల చరిత్ర కలిగిన కలిగిన సంస్థ, కేవలం 12మందితో ప్రారంభమై.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన బ్రాండ్.. ఇంతకీ ఆ కంపెనీ ఎదనుకుంటున్నారా? అదేనండీ.. అందరికీ సుపరిచయమైన 'పార్లే-జీ'. ఇంతకీ ఈ కంపెనీ ఎలా మొదలైంది. ఈ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మన దేశంలో చాలామందికి తెలిసిన బిస్కెట్ కంపెనీ 'పార్లే-జీ' (Parle-G). ఈ బిస్కెట్లను తినని వారు బహుశా ఉండరు. ప్రస్తుతం మార్కెట్లో.. లెక్కకు మించిన బిస్కెట్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, ఈ బిస్కెట్లకు (పార్లే-జీ) ఉన్న ఆదరణ మాత్రం ప్రత్యేకం. ప్రతి ఏటా కంపెనీ రూ. 8,000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తూ.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.పార్లే-జీ ప్రస్థానం1929లో స్వదేశీ ఉద్యమం మధ్యలో.. చౌహన్ కుటుంబానికి చెందిన 'మోహన్ లాల్ దయాల్' ముంబైలోని విలే పార్లేలో తొలి పార్లే ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ సమయంలో 12 మందితో.. జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేశారు. అప్పట్లో ఆ యంత్రాల కోసం రూ. 60వేలు ఖర్చు చేశారు. ఆ కంపనీ నేడు.. అనేక ఇతర దేశాలకు విస్తరించింది.'పార్లే-జీ'ని మొదట్లో “పార్లే గ్లూకో” గా పరిచయం చేశారు. కానీ చివరికి బిస్కెట్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని కొనసాగించడానికి దాని పేరును 'పార్లే-జీ'గా మార్చారు. పార్లే-జి లోని G అనే పదం మొదట్లో 'గ్లూకోజ్' ని సూచిస్తుంది, తరువాత అది కంపెనీ బ్రాండ్ నినాదానికి అనుగుణంగా 'జీనియస్'గా మారింది. దాని పేరు అనేక మార్పులకు గురైనప్పటికీ, దాని రుచి, ప్యాకేజింగ్ మాత్రం అలాగే ఉన్నాయి.పార్లే-జీ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరంటే?పార్లే-జీ బిస్కెట్స్ గురించి తెలిసిన చాలామందికి తెలియాల్సిన ప్రశ్న.. ఆ బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న చిన్నారి ఎవరు? అని. కొందరు ఆ పాప ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి అనే భావించారు. మరికొందరు నీరూ దేశ్‌పాండే అని.. ఇంకొందరు గుంజన్ దుండానియా అని అనుకున్నారు.నిజానికి పార్లే బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న పాప కేవలం.. ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ 'మగన్ లాల్ దహియా' ఊహాజనితమే అనే తెలిసింది. మొత్తానికి చాలామందికి దశాబ్దాలుగా తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు జవాబు తెలిసిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్.. జాబితాలో 24 మంది

సింగిల్ ఛార్జ్‌తో 800 కిమీ రేంజ్: ఈ కారు ధర ఎంతంటే..
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'షియోమీ' (Xiaomi) గురువారం తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్‌యూ7' (SU7) అల్ట్రా ధరలను ప్రకటించింది. ఈ కారు కోసం బుకింగ్స్ అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని వెల్లడించింది.కంపెనీ తన షియోమీ ఎస్‌యూ7 అల్ట్రా ధరలను 529900 యువాన్స్ (సుమారు రూ. 63 లక్షల కంటే ఎక్కువ)గా ప్రకరించింది. సంస్థ ఇప్పటికే మార్చి నెలలో.. చైనాలో ఈ కారు డెలివరీలను ప్రారంభించింది. దీనికి అక్కడ మంచి ఆదరణ కూడా లభించిందని సంస్థ వెల్లడించింది.షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ఒక ఛార్జ్‌పై 668 కిమీ రేంజ్ అందిస్తే.. టాప్ వేరియంట్ 800 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ కారు సూపర్ ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీని పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.చూడటానికి బీవైడీ సీల్ మాదిరిగా ఉండే ఈ కారు.. ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది మినిమలిస్టిక్ లేఅవుట్‌తో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజ్, ఒక డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద హెడ్స్-అప్ డిస్ప్లే, పనోరమిక్ రూఫ్ వంటివి పొందుతుంది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను.. షియోమీ భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించింది.
ఫ్యామిలీ

మనసు 'దోసే'స్తారు..!
టాలీవుడ్ ప్రముఖులను సిటీలో చూడాలనుకుంటే.. కాస్ట్లీ క్లబ్లోనో, సగటు మనిషి తొంగిచూడలేని లగ్జరీ కేఫ్‌లోనో.. ఒక్కోసారి అనుకోకుండా మరో చోటనో తారసపడవచ్చు. కొన్ని సార్లు.. సాదా సీదా ఇడ్లీలు, దోశలు విక్రయించే టిఫిన్ సెంటర్ దగ్గర కూడా కావచ్చు. అవును మరి.. విలాస వంతమైన రెస్టారెంట్లు, ప్రత్యేకమైన క్లబ్‌లు హై–ఎండ్ కేఫ్‌లకు మాత్రమే వెళ్లడం అలవాటైన వారిని కూడా ఓ టిఫిన్ సెంటర్ రారమ్మంటోంది. అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఉన్న రాయలసీమ శైలి ప్రత్యేకమైన అల్పాహారంతో చవులూరిస్తోంది.పంచెకట్టు అంటే.. తెలుగింటి వస్త్రధారణ గుర్తొస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ తన పేరుకు తగ్గట్టే మెనూలో సంప్రదాయం ప్రతిబింబిస్తుంది. నెయ్యి, కారం ఇడ్లీ, కారం పాళ్యం దోసె, ఉల్లి, నెయ్యి కారం దోశ, నన్నారి ఫిల్టర్ కాఫీ వంటి వెరైటీలే ఇక్కడ ఉంటాయి. ఇక దోశల తయారీ చూడటం ఒక చక్కటి అనుభవం. ప్రతి దోశనూ తక్కువ మంటపై రెండు వైపులా దోరగా కాల్చి, నెయ్యి పోసి, కారం పొడితో ప్లేట్లో ఉంచుతారు. పల్య (బంగాళదుంప కూర), టాంగీ మిరపకాయ చట్నీ క్లాసిక్ కొబ్బరి చట్నీతో కలిపి వడ్డిస్తారు.అలా మిస్సై.. ఇలా క్లిక్కై.. తాడిపత్రి మా సొంతూరు. అక్కడి నుంచి నగరానికి ఐటీ ఉద్యోగం రీత్యా వచ్చాం.. మా ప్రాంతపు వంటకాలను బాగా మిస్సయ్యేవాడిని. నాలాంటి ఫీలింగ్ మరికొందరిలోనూ చూశాక.. 2019లో ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. పంచెకట్టుతో దోశలు వేయడం, తినడం మా ప్రాంతంలో సర్వసాధారణం. అందుకే ఆ పేరు పెట్టాను. అనంతరం నగరవాసుల ఆదరాభిమానాలతో పూర్తి స్థాయి రెస్టారెంట్‌గా మార్చాను. ఇడ్లీ, దోశలతో పాటు ఉప్మా, పొంగలి.. వంటి అల్పాహారాలు అందిస్తున్నాం. నెయ్యి, మసాలా తదితర ముడి దినుసులతో సహా చాలా వరకూ రాయలసీమ నుంచే తీసుకొచ్చి స్థానిక ఫ్లేవర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. – నాగాభరణ్, పంచెకట్టు దోసె నిర్వాహకులు టాలీవుడ్ ఫేవరెట్ స్పాట్.. తొలుత ఫుడ్ ట్రక్‌గా ప్రారంభమైన పంచెకట్టు దోశ, ఇప్పుడు నగరం చుట్టూ నాలుగు శాఖలకు విస్తరించింది. దీని కస్టమర్లుగా టాలీవుడ్ సెలబ్రిటీలైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, హీరో సిద్ధార్థ, నటుడు మురళీ శర్మ, నటి లక్ష్మి మంచు తదితరులతో పాటు బ్యూటీ క్వీన్ మానుషి చిల్లర్, మేఘాంశ్ శ్రీహరి, గాయకుడు మనో, దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. బంజారాహిల్స్, మాదాపూర్, ప్రగతి నగర్ కొండాపూర్‌లలో పంచెకట్టు దోశ సెంటర్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by FORAGE HOUSE| Shreya Gupta (@forage_house) (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!)

రెట్రో టు మెట్రో..! సరికొత్త స్టైల్‌కి ఐకానిక్‌గా..
పాల మీగడను తలపించే లేత పసుపు రంగువసంతకాలాన్ని మరింత కళగా మార్చేస్తుంది. కాంతిమంతమైన రంగులను వెనక్కి నెట్టేస్తూ ఇండో– వెస్ట్రన్ స్టైల్ అయినా, సంప్రదాయ వేషధారణ అయినా ఈ స్ప్రింగ్ సీజన్లో బటర్ ఎల్లో స్పెషల్ మార్క్ వేస్తోంది.. పాజిటివ్ ఎనర్జీని చుట్టూ నింపడంలోనూ ప్రకృతిలో కొలువుండే ఆహ్లాదాన్ని కళ్లకు కడుతూ మదిని దోచేస్తోంది. రెట్రో స్టైల్‌కి సరైన ఎంపికగా నిలుస్తోంది. కార్పోరేట్ సంస్కృతికి కొత్త అర్ధం చెబుతూ మెట్రో స్టైల్‌తో బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది.ఈ వసంత కాలంలోనే కాదు రాబోయే వేసవిలోనూ హాయిగొలిపే రంగుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బటర్ ఎల్లో. ఈ లేత పసుపు రంగు షేడ్స్ సంప్రదాయ క్లాసిక్ వేర్‌లోనే కాదు బోల్డ్ కాంట్రాస్ట్ కలర్స్‌తోనూ జత కలుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన రంగుల ఎంపికలో బటర్ ఎల్లో ముందువరసలో ఉంది. లాంగ్ గౌన్లు, స్టైలిష్ కార్పొరేట్ వేర్‌గానే కాదు ఫ్యాషన్ వేదికలపైనా లేత పసుపు రంగు తనదైన ముద్ర వేస్తోంది. చందేరీ, షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లలో బటర్ ఎల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే కాటన్, పట్టులలో రిచ్ లుక్‌తో అబ్బురపరుస్తుంది. కాంట్రాస్ట్ కలర్ ఆలోచనకు ఈ షేడ్‌ను దూరంగా పెట్టవచ్చు. సేమ్కలర్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లోరల్ ప్రింట్స్లో తెలుపు, గాఢమైన పసుపు రంగు మోటిఫ్స్, పోల్కా డాట్స్ బటర్ ఎల్లోను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. ఇటీవల బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ముంబైలోని ఫ్యాషన్ ఈవెంట్ బీవోఎఫ్ గాలాలో డిజైనర్ జార్జ్ స్టావ్పోలోస్ రూపొదించిన లేత పసుపు షిఫాన్ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లుక్ 1970ల నాటి వింటేజ్ గ్లామర్‌ను తన డ్రెస్సింగ్ ద్వారా చూపింది.. ప్రాచీన అందాన్ని ఆధునికతతో మేళవించినట్టుగా తన డ్రెస్సింగ్ ద్వారా చూపుతూ ఈ సీజన్‌కు తప్పనిసరిగా ఉండవలసిన బటర్ ఎల్లో ప్రాముఖ్యతను చాటింది. (చదవండి: పువ్వులు పంచే అందం..!)

పువ్వులు పంచే అందం..!
ఈ సీజన్లో రకరకాల పువ్వులు మనకు కనువిందు చేస్తుంటాయి. అవి మన చర్మానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. కొన్నింటి సువాసనల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంటుంది. మరికొన్ని పువ్వులు బ్యూటీ ట్రీట్మెంట్లలో చేరి, తమ గొప్పతనాన్ని చాటుతుంటాయి. బంతిపువ్వులు క్రిమినాశకంగా పనిచేస్తాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులకు, మొటిమల సమస్యలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. బంతి పువ్వు రేకలను కొద్దిగా నూరి, మొటిమలపై రుద్ది, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య దూరం అవుతుంది. లావెండర్ మనసుకు శాంతిని కలిగించడంలోనూ, చర్మానికి యాంటీ బాక్టీరియల్గానూ ఉపయోగపడుతుంది. మసాజ్‌ల కోసం లావెండర్ నూనెలు, చర్మం డీ హైడ్రేట్ కాకుండా లావెండర్ వాటర్ స్ప్రే చేస్తే తిరిగి కళగా మారుతుంది.మల్లెలతో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పొడి చర్మం గలవారు జాస్మిన్ ఆయిల్, జాస్మిన్ ఫేస్ ప్యాక్‌లు వాడితే మృదువుగా మారుతుంది. ఒత్తిడి ఉపశమనానికి జాస్మిన్ సువాసనలు ఎంతో మేలు చేస్తాయి. గులాబీ – లావెండర్ ఫ్లవర్ ప్యాక్ కప్పు రోజ్ వాటర్, టీస్పూన్ ఎండిన లావెండర్ పువ్వులు, 5–6 చుక్కల లావెండర్ నూనె తీసుకోవాలి. రోజ్ వాటర్‌ను మరిగించి, ఎండిన లావెండర్ పువ్వులను అందులో వేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, మిశ్రమాన్ని చల్లబరచాలి. తర్వాత వడకట్టి, ఏదైనా నూనె కలిపి రాసుకోవచ్చు. మందార పువ్వులు నిస్తేజంగా ఉన్న శిరోజాలకు కండిషనర్‌గా ఉపయోగపడి మెరుపును తీసుకువస్తాయి. మాడుపై ఉండే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. గుప్పెడు మందార పువ్వులను తీసుకొని, వాటిని మెత్తని పేస్ట్‌లా తయారు చేసి,అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు ప్యాక్ వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారి ఉన్న శిరోజాలు మృదువుగా అవుతాయి. ‘గులాబీపువ్వులలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకే కాదు ఔషధంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. టోనర్‌గా రోజ్‌వాటర్, ఫేస్ మాస్క్‌లు, చర్మ సంరక్షణలో రోజ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!)

టీవీ స్టార్ టు మాస్టర్‌చెఫ్
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి చాలా మంది ఇష్టపడరు. ‘ఎందుకొచ్చిన రిస్కు’ అని కొందరు భయపడతారు. ‘ఏమైనా సరే’ అని కొందరు ధైర్యంతో బయటికి వస్తారు. విజేతలుగా నిలుస్తారు. టీవీ స్టార్ తేజస్వీ ప్రకాష్ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లో భాగం కావడం ద్వారా కొత్త దారిలోకి వచ్చింది.‘సెలబ్రిటీ చెఫ్ ద్వారా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి అవకాశం వచ్చింది. పరిచయం లేని వంటకాలతో ప్రయోగాలు చేయడం సరదాగానే కాదు కష్టంగానూ ఉంటుంది. అయితే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ కాగలం’ అంటుంది తేజస్వి.సోనీ టీవి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ పుణ్యమా అని మరచి పోయిన ఎన్నో వంటకాలను, వంట లకు సంబంధించి బాల్య జ్ఞాపకా లను గుర్తు చేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది. టీవీ స్టార్ తేజస్వి ‘చెఫ్ స్టార్’గా కూడా బోలెడు పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.
ఫొటోలు
National View all

‘డీకే.. మరో ఏక్నాథ్ షిండే’
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్..

మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పె

నా ప్రియమైన స్నేహితుడా.. మీ పోరాటం అసామాన్యం
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది

మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

ఘోర ప్రమాదం.. జాలర్లను రక్షించిన సైన్యం
ముంబై: అరేబియా సముద్రంలో ఘోర ప్రమాదం తప్పింది.
NRI View all

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శ

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవ

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం
International View all

ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట

ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. బెడిసికొడుతున్న నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి

నేను అలా మాట్లాడానా?.. మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చా

నేపాల్‌లో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు
ఖాట్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లో భూమి కంపించింది.

గాజా నుంచి వైదొలగబోం
ఖాన్ యూనిస్: గాజాలో శాంతిస్థాపన ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో
క్రైమ్

పరీక్షల్లో మళ్లీ ఫెయిలవుతానేమోనని..
కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లికి చెందిన మోత్కూరి సంజయ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోత్కూరి వెంకటేశం–లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు సంజయ్ కల్లూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివాడు. గతేడాది జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అప్పటినుంచి మనోవేదనకు గురవుతున్నాడు. అయితే, ఈసారి కూడా ఫెయిలవుతానేమోనని భయపడ్డాడు. బుధవారం శివరాత్రి కావడంతో తల్లిదండ్రులు గుడికి బయలుదేరారు. వారికి తాను తర్వాత వస్తానని చెప్పి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.