Top Stories
ప్రధాన వార్తలు

బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..
సాక్షి, అమరావతి: భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్‌ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది.ఎన్నికల హామీలను గాలికి వదిలేసి..ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది.తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. 12 వేల కోట్ల కుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.దీపం పథకానికి భారీగా కోత దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు టోకరాడ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్లో చూపించలేకపోయింది.అన్నదాత సుఖీభవకు కేటాయించింది ఇంతేఅన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. 10 వేల 400 కోట్లకు 6,300 కోట్లే కేటాయింపులు చేసింది.ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్‌ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్సు మనిపించింది ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావేనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు..

ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు.

రేవంత్ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతోంది. పలు ప్రాజెక్ట్‌ల అంశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి కౌంటరిస్తూ తాజాగా సీఎం రేవంత్ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ తాజాగా తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. ఇక, సీఎం రేవంత్ లేఖలో.. ఆర్ఆర్ఆర్, మూసీ, మెట్రో ఫేజ్-2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కోసం ఎన్ని సార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం.. కానీ, కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితమ ప్రధాని మోదీతో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని మోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.

రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వంపబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనా గా చూపించిన ప్రభుత్వంరెవెన్యూ వ్యయం 2,51, 162 కోట్లుపెట్టుబడి వ్యయం 40,636 కోట్లు అంచనాతో బడ్జెట్‘తల్లికి వందనం’కి నిధులు కోతబడ్జెట్ లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం కి కేటాయింపు12 వేల కోట్లకు పైగా తల్లికి వందనం కి అవసరంగత ఏడాది ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన ప్రభుత్వందీపం పథకానికి భారీగా కోతకోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదింపుబడ్జెట్ లో 4 వేల కోట్లకు గాను 2601 కోట్లు మాత్రమే కేటాయింపుఅన్నదాత సుఖీభవకు భారీ కోతఅన్నదాత సుఖీభవ కి కేవలం 6300 కోట్లు కేటాయింపురైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ10 వేల 400 కోట్లకు 6300 కోట్లే కేటాయింపు👉 మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగంరూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లుబీసీ క్షేమానికి రూ.23, 260 కోట్లుపాఠశాల విద్యకు 31, 806 కోట్లుఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లువైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లుపంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 18,848 కోట్లుపురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు కేటాయింపుసాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లుజలవనరుల శాఖకు రూ.18,020 కోట్లుఇంధన శాఖకు రూ.13,600 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు రాష్ట్ర పునర్మిర్మాణం సవాలుతో కూడుకుంది1995నాటి పరిస్థితులే నేడు నెలకొన్నాయికూటమి అధికారంలోకి వచ్చాక 74 పథకాలను ప్రారంభించాంరాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందిఅప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది 2025-26కుగానూ రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ అంచనామూలధన వ్యయం రూ.40, 635 కోట్లుమూలధన వ్యయం అంచనా రూ.40, 635 కోట్లురెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుద్రవ్యలోటు రూ.79,926 కోట్లురెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర 👉రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ 2025-26👉కూటమి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్👉శాసనసభలో ఏపీ బడ్జెట్ 2025 ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ బడ్జెట్ 2025కు కేబినెట్ ఆమోదం👉అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్లో మంత్రివర్గం సమావేశం👉 హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రులు👉 సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బడ్జెట్.. ఎక్కడ.. ఎవరు?👉10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు👉 శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 👉శాసన మండలిలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.వాట్ ఎబౌట్ సూపర్ సిక్స్?👉ఈ బడ్జెట్ లోనేనా సూపర్ సిక్స్ కి నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత..👉ఇప్పటివరకు సూపర్ సిక్స్ ని అమలు చేయని కూటమి ప్రభుత్వం👉తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు👉మొదటి ఏడాది సూపర్ సిక్స్ కి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.కేటాయింపులైతే చేసేద్దాం!👉కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. 👉ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. 👉 కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 👉2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు. రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు.

పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: పొన్నవోలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ‘పోసాని కృష్ణమురళి కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. సెక్షన్లు 111, 67 వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పింది.. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించటం సరికాదు‘‘ అని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు లో కేసు వేస్తాం’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలి’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.కాగా, పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు (14 రోజులు) రిమాండ్ విధించింది. పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎస్ఎన్ 111 యాక్ట్నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు.రాత్రి 9 గంటల నుంచి కోర్టులోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. రాత్రి 9.20 గంటలకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. అంతకు ముందు ఓబువారి పల్లె పీఎస్‌లో 9 గంటల పాటు పోసాని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్ పోసానిని స్వయంగా విచారించారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ వికటాట్టహాసంరెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా బరితెగింపురెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది.జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి.

IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్‌కు రెస్ట్ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్ మ్యాచ్ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్‌కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్‌తో పాటు ఓపెనర్‌గా రాహుల్అయితే, గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్ నెట్ సెషన్లో అతడు గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో వాటికి చెక్ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గనుక దూరమైతే గిల్‌కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి కివీస్ కూడా భారత్‌తో పాటు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్‌లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆధారంగానే గ్రూప్-‘ఎ’ విజేతతో పాటు సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్ చేతిలో ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?!

Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
టైటిల్: శబ్దంనటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులునిర్మాణ సంస్థ: 7G ఫిల్మ్స్ నిర్మాత: 7G ఫిల్మ్స్ శివ దర్శకత్వం: అరివళగన్సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాభన్ఆది పినిశెట్టికి (Aadhi Pinisetty) సోలో హిట్ పడి చాలా కాలమైంది. తెలుగు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. కానీ హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో తనకు ‘వైశాలి’ లాంటి బిగ్ హిట్ అందించిన దర్శకుడు అరివళగన్‌తో మరో మూవీ చేశాడు. అదే ‘శబ్దం’. (sabdham movie) ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా (Shabdam Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..హరర్ చిత్రాలన్ని ఓకే ఫార్మాట్లో సాగుతాయి. భయపెట్టే దెయ్యాలు.. వాటికి ఓ ఎమోషనల్ నేపథ్యం.. చివరకు వారి చావులకు కారణమైన వారికి శిక్ష పడడం..దాదాపు అన్ని హారర్ థ్రిల్లర్ సినిమాల కథ ఇలానే ఉంటుంది. శబ్దం కథ కూడా ఇలాంటిదే.కానీ కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టేందుకు దర్శకుడు అరివళగన్ రొటీన్ జిమ్మిక్కులను వాడుకోకుండా కొత్తగా ట్రై చేశాడు. టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఫస్టాఫ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుంది. హారర్ జానర్లో ఇదొక ప్రయోగంలా అనిపిస్తుంది. హీరో పాత్ర పరిచయం మొదలు.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం వరకు ప్రతీదీ సైంటిఫిక్ మెథడ్‌లో చెప్పారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం మళ్లీ రోటీన్ హారర్ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్ది సాధారణ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 42 దెయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యం తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే కొంతమేర కొత్తగా అనిపిస్తుంది. ఓ సీన్లో తెరపై బొమ్మ కనిపించకుండా చేసి కేవలం సౌండ్‌తోనే ప్రేక్షకుడిని భయపెట్టాడు. టెక్నికల్ అంశాలపై కొంత అవగాహన ఉంటే ఈ సినిమా బోర్ కొట్టదు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. పారానార్మల్ ఇన్వెస్టగేటర్ వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. నటన పరంగా ఆయనకు వంక పెట్టడానికేమి లేదు. ఇంటర్వెల్ వరకు ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ కూడా ఓ కొత్త రోల్ ప్లే చేసింది. డయానా పాత్రలో ఆమె చక్కగా నటించింది. నాన్సీగా లైలా తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. రిడిన్ కింగ్స్లే కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను నిలబెట్టాడు. కొన్ని సన్నివేశాలలో నటన కంటే బ్యాగ్రౌండ్ స్కోరే ఎక్కువ భయపెడుతుంది. డిఫరెంట్ బీజీఎంతో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. బెడిసికొడుతున్న నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ డోజ్ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 🚨Shocking: US judge temporarily blocks White House from ordering mass firing of federal workers pic.twitter.com/YFlzyBjiDS— EverthingEverything (@EverthingEv) February 28, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్ నిర్ణయాల కారణంగా పలు విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్ఎయిడ్లో ఉద్యోగుల తొలగింపు, పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.US judge temporarily blocks White House from ordering mass firing of federal workers Ruling deals blow to efforts by Donald Trump and Elon Musk to shrink government workforce Source - Financial Times— Prime View News (@primeviewnews) February 28, 2025

పసిడి ప్రియులకు శుభవార్త: మూడో రోజు తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా మూడోరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త. ఈ రోజు (ఫిబ్రవరి 28) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
రికార్డు స్థాయికి చేరిన యూపీఐ లావాదేవీలు
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే..
సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి
‘గర్వం తలకెక్కింది.. అందుకే అందరు ఓడిపోవాలనే కోరుకున్నారు’
సైబర్ వల : ఎంత ప్రచారం చేస్తున్నా, మోసపోతున్న అమాయకులు
రవీంద్ర భారతిలో విల్లా మేరీ డిగ్రీ మహిళా కళాశాల ఐకానిక్ నాటకాలు
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
అనకాపల్లి జిల్లాలో మరోసారి రేవ్ పార్టీ కలకలం
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
..సంపద సృష్టిస్తున్నారు..!
OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా
పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!
రికార్డు స్థాయికి చేరిన యూపీఐ లావాదేవీలు
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే..
సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి
‘గర్వం తలకెక్కింది.. అందుకే అందరు ఓడిపోవాలనే కోరుకున్నారు’
సైబర్ వల : ఎంత ప్రచారం చేస్తున్నా, మోసపోతున్న అమాయకులు
రవీంద్ర భారతిలో విల్లా మేరీ డిగ్రీ మహిళా కళాశాల ఐకానిక్ నాటకాలు
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
అనకాపల్లి జిల్లాలో మరోసారి రేవ్ పార్టీ కలకలం
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
..సంపద సృష్టిస్తున్నారు..!
OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా
పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!
సినిమా

ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో శివరాత్రి వచ్చివెళ్లింది. ఆ రోజు థియేటర్లలో రిలీజైన 'మజాకా' చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ శుక్రవారం శబ్దం, అగథ్య అనే రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)మరోవైపు ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో సుడాల్, డబ్బా కార్టెల్ సిరీస్ లతో పాటు లవ్ అండర్ కన్షట్రక్షన్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ రోజు ఏమేం చిత్రాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన సినిమాలు (ఫిబ్రవరి 28)అమెజాన్ ప్రైమ్సుడల్ సీజన్ 2 - తెలుగు సిరీస్మార్కో - హిందీ వర్షన్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)నెట్ ఫ్లిక్స్అయితానా - స్పానిష్ సిరీస్డబ్బా కార్టెల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్డెస్పికబుల్ మీ 4 - తెలుగు డబ్బింగ్ మూవీరూస్టర్స్ - డచ్ సిరీస్సోనిక్ ద హెడ్గేహగ్ 2- ఇంగ్లీష్ సినిమాస్క్వాడ్ 36 - ఫ్రెంచ్ చిత్రంటస్కమ్స్ - ఆఫ్రికన్ సిరీస్హాట్ స్టార్లవ్ అండర్ కన్షట్రక్షన్ - తెలుగు డబ్బింగ్ మూవీబీటల్ జ్యూస్ - ఇంగ్లీష్ సినిమాబజ్ - హిందీ మూవీదిల్ దోస్తీ ఔర్ డాగ్స్ - హిందీ చిత్రంద వాస్ప్ - ఇంగ్లీష్ సినిమాఆహాఎమోజీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆపరేషన్ రావణ్ - తమిళ మూవీపరారీ - తమిళ సినిమాజీ 5సంక్రాంతికి వస్తున్నాం - తెలుగు సినిమా (మార్చి 1)బుక్ మై షోడెలివర్ అజ్ - తెలుగు డబ్బింగ్ సినిమాసైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీద గోల్డ్ స్మిత్ - తెలుగు డబ్బింగ్ సినిమావోల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ చిత్రం(ఇదీ చదవండి: OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా)

నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరు. ఎందుకంటే చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండింటి షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్నా సరే మంచు విష్ణు 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేశాడు. తాజాగా ప్రభాస్.. ఈ మూవీలో నటించడం గురించి హీరో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'కన్నప్ప' సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు బయటపెట్టాడు. తొలుత నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని, అదే విషయాన్ని తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైనా పనుంటే నువ్వే (విష్ణు) కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్)మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. అలా ఇండియన్ మూవీ స్టార్స్ కూడా ఇందులో కీలకపాత్రల్లో నటించారు. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడిన విషయాన్ని మంచు విష్ణు బయటపెట్టాడు.రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన కన్నప్ప.. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా.. అది అలరిస్తోంది. చిత్ర విడుదలకు ఇంకా టైముంది కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ మరింత రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్)Rebel Star #Prabhas okka kshanam kooda aalochinchakunda idhi chayyadam anukunnaru ❤️🔥 #Kannappa #ManchuVishnu pic.twitter.com/ewtDFYkoZG— prabhas_garu_taluka (@varmadatla2) February 27, 2025

ప్రమాదం... జాగ్రత్త
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ఆంబర్ అలర్ట్(Amber Alert) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.అమెరికా దేశానికి సంబంధించి పిల్లల కిడ్నాప్ సమయంలో తరచుగా వాడే పదం ఆంబర్ అలర్ట్. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇస్తే, వాళ్లు చెప్పే ఆనవాళ్లను బట్టి ఆ సమయంలో, ఆప్రాంతంలో ఉన్న ప్రతి వాహనదారుడికి ఈ ఆంబర్ అలర్ట్ మెసేజ్ వాళ్ల ఫోనులకు పంపించడం జరుగుతుంది. ఇది అమెరికా ప్రభుత్వం 1996 నుండి చేపడుతున్న అధికారిక చర్య.దీని వల్ల పిల్లల కిడ్నాప్‌కు ఉపయోగించే వెహికల్‌ను త్వరగా కనుక్కోగలుగుతారు. ‘ఆంబర్ అలర్ట్’ (2024) సినిమా నేపథ్యం కూడా అదే. 2012లో కూడా ఇదే పేరు, నేపథ్యంతో ఓ సినిమా విడుదలైంది. గత ఏడాది విడుదలైన ‘ఆంబర్ అలర్ట్’ వాస్తవ సంఘటనల ఇతివృత్తంగా రూపోందిన సినిమా. ఈ సినిమా కథ విషయానికొస్తే... పార్కులో ఆడుకుంటున్న షార్లెట్ అనే చిన్న పాపను ఓ ఆగంతకుడు కార్లో వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకువెళతాడు.పాప పార్కులో ఆడుకునేటపుడు వాళ్ల అమ్మ తీసిన వీడియో వల్ల కిడ్నాపర్ కారు కొంచం వీడియోలో పడుతుంది. మరో పక్క షేన్ అనే క్యాబ్ డ్రైవర్ తన డ్యూటీ ముగించుకొని ఇంట్లో తన కోసం వేచి ఉన్న తన కొడుకు బర్త్ డే పార్టీకి త్వరగా వెళ్లబోతుంటాడు. అదే సమయంలో జాక్ అనే లేడీ తాను బుక్ చేసుకున్న క్యాబ్ వెళ్లిపోవడంతో షేన్ని తనను దారిలో వదలమని బ్రతిమాలుకుంటుంది.ఇద్దరూ తమ ప్రయాణం ప్రారంభించాక సడెన్‌గా ఇద్దరి ఫోన్లకు షార్లెట్ ఆంబర్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇంతలో కిడ్నాపర్ డ్రైవ్ చేస్తున్న కారు వీళ్ల కంటబడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది ఓటీటీ వేదికగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘ఆంబర్ అలర్ట్’ మూవీలోనే చూడాలి. కెర్రీ బెల్లెస్సా దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘ఆంబర్ అలర్ట్’ చూడొచ్చు. – ఇంటూరు హరికృష్ణ

అతీంద్రియ శక్తులతో...
శ్రుతీహాసన్ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మార్క్ రౌలీ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇదిలా ఉంటే... ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.తాజాగా ముంబైలో గురువారం ప్రారంభమైన 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో (హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ విభాగాల్లో) ఇండియా తరఫున ‘ది ఐ’ చిత్రం ప్రీమియర్ అయింది. మార్చి 2 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి.మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోనిప్రొడక్షన్ హౌస్‌లో ‘ది ఐ’ని రూపోందించడం విశేషం. ఇండస్ట్రీలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈప్రాజెక్ట్ ఉంటుంది’’ అన్నారు. కాగా శ్రుతీహాసన్ గతంలో ‘ట్రెడ్ స్టోన్’ అనే హాలీవుడ్ టీవీ సిరీస్‌లో నటించగా, ‘ది ఐ’ ఫస్ట్ హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Shubman Gill: పరుగుల వేటగాడు.. మిస్టర్ నంబర్ వన్
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు బ్యాటర్‌గానూ ఇరగదీస్తున్నాడు. అంతా కలిసొస్తే భవిష్యత్‌లో భారత భావి కెప్టెన్‌గా గిల్‌ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్‌గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించే. సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.2019లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్‌లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్‌మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు. – ఇంతియాజ్ మొహమ్మద్చదవండి: CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే...

‘గృహ హింస’ వివాదంలో భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్
చండీగఢ్: దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారుల దాంపత్యంలో పెను వివాదం రేగింది. కుటుంబ కలహాలతో పరిస్థితి పోలీసు కేసు వరకు వెళ్లింది. హరియాణాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా, భారత బాక్సర్ స్వీటీ బూరాకు 2022లో పెళ్లి జరిగింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హుడా 2019 నుంచి 2022 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. మరోవైపు స్వీటీ బూరా 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఇప్పుడు హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. గతంలోనే డిమాండ్ ప్రకారం లగ్జరీ కారును ఇచ్చినా... మరింత డబ్బు కావాలంటూ తనను కొడుతున్నాడని స్వీటీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 ప్రకారం హుడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి 2–3 సార్లు నోటీసులు జారీ చేసినా... అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ హుడా ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే తాను పోలీసుల ముందుకు వస్తానని, అయితే స్వీటీపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు కేసుపై మరింత సమాచారం ఇచ్చేందుకు స్వీటీ నిరాకరించింది. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి హుడా ఓటమి పాలయ్యాడు.

భారత బాక్సింగ్‌ను ముందుకు తీసుకెళ్తా!
న్యూఢిల్లీ: దేశంలో బాక్సింగ్‌కు మరింత వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. అందుకోసం అవసరమైతే భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడనని వెల్లడించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన ఏకైక పురుష బాక్సర్ అయిన విజేందర్ సింగ్... బీఎఫ్ఐ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ సింగ్... 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారమెత్తాడు.గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ యాక్టివ్‌గా లేని 39 ఏళ్ల విజేందర్ తాజాగా బీఎఫ్ఐ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. ఇది కొత్త తరహాది అనుకుంటా. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు. ఆటకు నా వల్ల ప్రయోజనం చేకూరుతుందనుకుంటే తప్పకుండా పోటీలో ఉంటా. మార్పు తెచ్చే అవకాశం ఉంటే దాని కోసం నా వంతు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బాక్సర్‌గా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కాదు. నేనెప్పటికీ అలా చేయను’ అని అన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన విజేందర్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. విదేశీ శిక్షణ ముఖ్యం భారత యువ బాక్సర్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని విజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బాక్సింగ్ సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం క్రీడల్లో వేగంగా వృద్ధి చెందుతోంది. మరో మూడేళ్లలో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలంటే భారత బాక్సర్లు విదేశీ బాక్సర్లతో తరచూ తలపడాలి’ అని విజేందర్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. ప్రపంచ బాక్సంగ్ చాంపియన్‌షిప్ (2009)లో పతకం నెగ్గిన తొలి భారత పురుష బాక్సర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన విజేందర్... గతంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్గానూ కొనసాగాడు. బాక్సింగ్ సమాఖ్య పరిపాలన సంబంధించిన విధులను ఇటీవల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హాక్ కమిటీకి అప్పగించిన నేపథ్యంలో... విజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 3తోనే బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగియగా... ఎన్నికల నిర్వహణలో సమాఖ్య జాప్యం చేస్తుండటంతోనే ఐఓఏ ఈ చర్యకు పూనుకుంది. దీనిపై బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓఏ ఆదేశాలు చట్టవిరుద్ధమని... దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా... బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలోనే ఐఓఏ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మాజీ కోశాధికారి మధుకాంత్ పాఠక్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సమాఖ్యలో గందరగోళం కారణంగా బాక్సర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో రిక్తహస్తాలతో వెనుదిరిగిన మన బాక్సర్లు... ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గగనమైంది. ఇక మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ మన బాక్సర్లు పాల్గొనలేదు.

తొలిసారి ఆసియా కప్ బరిలో ఒమన్
న్యూఢిల్లీ: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈసారి 8 జట్లు పాల్గొననున్నాయి. ఒమన్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలువడం ద్వారా యూఏఈ, ఒమన్ జట్లు ఆసియా కప్ టోర్నీకి అర్హత పొందాయి. ఈ రెండు జట్లతోపాటు హాంకాంగ్ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. 2026లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యలో ఈసారి ఈ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. 2023 వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే అవకాశమున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉన్నప్పటికీ... తటస్థ వేదికపై టోర్నీ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకుండా... దుబాయ్‌లోనే అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌లో పర్యటించబోమని గతంలోనే వెల్లడించింది. దీంతో ఆసియా కప్‌ను యూఏఈ, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
బిజినెస్

రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025లో రోజూ దాదాపు 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ భారీ జన సమూహం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటడమే చేయడమే కాకుండా టెలికాం పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో లక్షలాది మంది భక్తులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు డేటా ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.రంగంలోకి దిగిన టెలికాం దిగ్గజాలుమహా కుంభమేళా సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త సైట్లను, అదనంగా స్పెక్ట్రమ్‌ను జోడించి ముందస్తు చర్యలు చేపట్టాయి. పెరిగిన డేటా ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, భక్తులకు అంతరాయం లేని సేవలను అందించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఎంతో అవసరమైంది. దాంతో డేటా ట్రాఫిక్ గణనీయంగా 55% పెరిగినట్లు కంపెనీ తెలిపాయి.కంపెనీలకు ఆదాయం పెంపుమహా కుంభమేళా 2025 సందర్భంగా డేటా వినియోగం పెరగడం టెలికాం కంపెనీలకు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చినట్లు నిపుణులు తెలుపుతున్నారు. పెరిగిన డేటా ట్రాఫిక్ ప్రతి వినియోగదారుడి నుంచి సంస్థలకు వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) 4% నుంచి 6% వరకు పెంచుతుందని అంచనా. మిలియన్ల మంది ప్రజల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చేందుకు మెరుగైన టెలికాం మౌలిక సదుపాయాలను అందించడంతోనే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండేపరస్పర సహకారంసర్వీస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ మహా కుంభమేళాలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. క్రౌడ్ మూవ్మెంట్, డేటా ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా నెట్వర్క్ స్థిరంగా, సమర్థవంతంగా ఉండేలా చూసుకున్నారు. టెలికాం విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఈ సహకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడంలో ఎంతో అవసరమనే విషయాన్ని హైలైట్ చేస్తుంది.

సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 11వ ఛైర్మన్‌గా మాదబిపురీ బుచ్ స్థానంలో తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. మార్చి 1 నుంచి తాను సెబీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.తుహిన్ కాంత పాండే అనుభవంఆర్థిక కార్యదర్శి: భారత ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన ఆయన వివిధ ఆర్థిక సంస్కరణలు, విధానాల్లో కీలక పాత్ర పోషించారు.రెవెన్యూ కార్యదర్శి: దేశ రెవెన్యూ వసూళ్లు, పన్ను విధానాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి పదవిని కూడా పాండే నిర్వహించారు.ఎయిరిండియా ప్రైవేటీకరణ: భారతదేశ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ముఖ్యమైన ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు.పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వహణ: పాండే తన కెరీర్ అంతటా ప్రభుత్వ సంస్థలు, వాటిలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల నిర్వహణలో నిమగ్నమయ్యారు. అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడ్డారు.ఇదీ చదవండి: రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’ముందున్న సవాళ్లు..కొత్త సెబీ ఛైర్మన్ పాండే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, మార్కెట్ సమగ్రతను పెంపొందించడానికి పలు కీలక రంగాలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.విజిలెన్స్‌ను బలోపేతం చేయడం: మార్కెట్ మానిప్యులేషన్, ఇన్ సైడర్ ట్రేడింగ్(అనధికారికంగా ముందుగానే కంపెనీలోని కీలక సమాచారాన్ని తెలుసుకుని తర్వాత షేర్లు పెరిగాక తిరిగి విక్రయించి లాభపడడం)ను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి పాండే మార్కెట్ నిఘా యంత్రాంగాలను పెంచే అవకాశం ఉంది.ఇన్వెస్టర్ ప్రొటెక్షన్: కఠినమైన నిబంధనలు, పకడ్బందీ ఆర్థిక విధానల ద్వారా పారదర్శకతతో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలి.డిజిటల్ సహకారం: నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత, డిజిటల్ వేదికల వాడకాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.కార్పొరేట్ గవర్నెన్స్: లిస్టెడ్ కంపెనీల్లో తమ కార్యకలాపాలపై జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను బలోపేతం చేయాలి.సుస్థిర ఆర్థిక విధానాలు: ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక కార్యక్రమాలు, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడం.

రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’
ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)ను ప్రవేశపెట్టడం గమనార్హం.అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్లో 25 శాతం మేర డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్‌ను సెబీ వర్గీకరించింది.ఇదీ చదవండి: ఏఐకి కంపెనీల జైప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిఫ్లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌ను సిఫ్‌కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది.

కీలక ఖనిజాలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్‌కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలు కాబిల్తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. జాంబియా గ్రీన్ సిగ్నల్ కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్‌ఫీల్డ్)ను భారత్‌కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్‌కే), చత్తీస్‌గఢ్‌లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు.
ఫ్యామిలీ

Sundeep Kishan: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..
స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్.బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్ చాలా స్మార్ట్‌గా మంచి బాడీని మెయింటైన్ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్ సెట్ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్. కాగా, సందీప్ నటించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది. (చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!)

Vantara అనంత్ అంబానీ ‘వంతారా’ అరుదైన ఘనత
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) మరో ఘనతను సాధించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడిగా జంతుప్రేమికుడిగా అనంత్ అంబానీ అందరికీ సుపరిచితమే. జంతు రక్షణ, ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారా (Vantara) అనే సంస్థను స్థాపించారు. అనంత్ అంబానీ ప్రాణప్రదమైన వంతారాకు ప్రతిష్టాత్మక 'ప్రాణి మిత్ర' జాతీయ అవార్డు లభించింది.'కార్పొరేట్' విభాగంలో జంతు సంక్షేమంలో భారతదేశంలోని అత్యున్నత గౌరవం పురస్కారం 'ప్రాణి మిత్ర' ( Prani Mitra Award ) జాతీయ అవార్డు వంటారా దక్కించుకుంది. వంటారా సంస్థ అయిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT)కు గౌరవం దక్కింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దీనికి వంతారా సీఈవో వివాన్ కరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జంతు సంక్షేమం పట్ల వంతారా లోతైన నిబద్ధతను నొక్కి చెప్పారు. సంక్షేమ ప్రమాణాలను పెంచడం, భారతదేశ జీవవైవిధ్యాన్ని కాపాడటం వారి లక్ష్యమనన్నారు. "ఈ అవార్డు భారతదేశ జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది వ్యక్తులకు నివాళి. వంతారాలో, జంతువులకు సేవ చేయడం అంటే కేవలం డ్యూటీ కాదు - ఇది తమ ధర్మం, సేవ, కరుణ, తమ బాధ్యతలో దృఢమైన నిబద్ధత అన్నారు. భవిష్యత్తరాలకోసం దేశ గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటం అనే లక్ష్యంలో తాము అలుపెరగకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.చదవండి : పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!కెరీర్లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనంవంతారాగుజరాత్లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారాలోని ఎలిఫెంట్ కేర్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు ఆసుపత్రికి నిలయంగా ఉంది. 240కి పైగా ఏనుగులకు రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ఏనుగులకు ప్రపంచ స్థాయి పశువైద్య చికిత్స, కరుణా సంరక్షణ లభిస్తుంది. ఇక్కడ అల్లోపతిని ప్రత్యామ్నాయ వైద్యంతో అనుసంధానించే అధునాతన పశువైద్య సంరక్షణను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు నొప్పి నివారణ కోసం అక్యుపంక్చర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని అత్యాధునిక వైద్య సౌకర్యాలలో ఆర్థరైటిస్ చికిత్స కోసం అధిక పీడన నీటి జెట్లతో కూడిన హైడ్రోథెరపీ చెరువు, గాయం నయం కోసం హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్ , పెడిక్యూర్ నిపుణులతో అంకితమైన పాద సంరక్షణ సౌకర్యాలుండటం విశేషం.అలాగే వంతారా అతిపెద్ద ఏనుగు అంబులెన్స్‌ల సముదాయాన్ని నిర్వహిస్తోంది.హైడ్రాలిక్ లిఫ్ట్‌లు, రబ్బరు మ్యాట్ ఫ్లోరింగ్, వాటర్ ట్రఫ్లు, షవర్లు , కేర్‌టేకర్ క్యాబిన్లున్న 75 కస్టమ్-ఇంజనీరింగ్ వాహనాలున్నాయి.

ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట.

పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!
‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’ ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా తీసుకున్నాడో యువకుడు. కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం. అలాగని సాధించిన ఉద్యోగంతో తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆరేళ్లలో (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్‌గా నిలిచాడు. ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి ఇందుకు సమాధానం. పదండి అతని స్ఫూర్తిదాయకమైన కెరీర్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని రసిసార్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రేమ్‌సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్‌గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు. ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ సహకారం మరింత బలాన్నిచ్చింది.గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల. ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్ జైలర్‌గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే స్వల్పమార్కులతో పోలీస్ ఉద్యోగం చేజారినా ఐపీఎస్ అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు. మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. యూపీఎస్సీలో (UPSC) AIR 170 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.‘ఉద్యోగం చేసుకుంటూ యూపీఎసీసీకి సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు. ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్ అంటే. అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ఫొటోలు
National View all

బీహార్‌లో పోస్టింగ్ ఇచ్చారని టీచర్ తిట్ల దండకం.. తర్వాత ఏమైందంటే?
పాట్నా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక బదిలీలు తప్పనిసరి.

బీజేపీ Vs స్టాలిన్: పోరాటానికి తమిళులు కలిసి రండి.. సీఎం పిలుపు
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్ట

ఆప్ నెత్తిన కాగ్ మరో పిడుగు
న్యూఢిల్లీ: గత ఆప్ ప్రభుత్వానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్

నడ్డా స్థానంలో ఎవరు.. 15 రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
ఢిల్లీ: బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు

పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్ర
International View all

ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట

ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. బెడిసికొడుతున్న నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి

నేను అలా మాట్లాడానా?.. మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చా

నేపాల్‌లో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు
ఖాట్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లో భూమి కంపించింది.

గాజా నుంచి వైదొలగబోం
ఖాన్ యూనిస్: గాజాలో శాంతిస్థాపన ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో
NRI View all

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవ

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ
క్రైమ్

ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.

పుణ్యస్నానాలకు వెళ్లి ఏడుగురి మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్‌హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు. కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు. కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.