Top Stories
ప్రధాన వార్తలు

‘సెకీ’ ఒప్పందం సక్రమమే
సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ) జనరల్ నెట్వర్క్ యాక్సెన్ (జీఎన్ఏ) నిబంధనలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర ప్రసార (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–ఐఎస్టీఎస్) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు. – ఏపీఈఆర్‌సీసాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లో ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్ మార్జిన్ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్సీ రూ.0.7 పైసల ట్రేడింగ్ మార్జిన్‌తో టారిఫ్‌ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్‌ను చేర్చడానికి కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగాఅంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగావాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? చేసిన మంచిని దాచలేరు.. గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్ జగన్‌పై బురద చల్లుతూ సెకీ విద్యుత్ ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్ నియంత్రణ మండలి తేల్చింది. ఇప్పుడేమంటారు బాబూ..?కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్‌పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. సెకీ ఒప్పందానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పడు మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. ఆరోపణ: సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణనిజం: సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్ ఆమోదంఆరోపణ: ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు నిజం: పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’ఆరోపణ: సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.నిజం: ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్‌ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?రాష్ట్ర చరిత్రలోనే కారుచౌకరాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. » ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. » రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. » ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్‌గా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా? మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న తాపత్రయంతో... జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?. – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్ జగన్ వ్యాఖ్య

మాతో ఆటలొద్దు: కమల్‌హాసన్ వార్నింగ్
చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎమ్) అధినేత కమల్‌హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్ఎన్ఎమ్ పార్టీ 8వ వ్యవస్థాపక దినం సందర్భంగా కమలహాసన్ మాట్లాడారు.‘తమిళులకు భాష చాలా ముఖ్యమైనది. మాతో ఈ విషయంలో ఆలలొద్దు.భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం.మా పిల్లలకు కూడా ఏ భాష కావాలో తెలుసు.ఏ భాష కావాలో ఎంపిక చేసుకునే జ్ఞానం వారికి ఉంది’అని పరోక్షంగా కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)ని ఉద్దేశించి కమల్ వ్యాఖ్యానించారు.తమిళనాడులో రెండు భాషల విధానం అమలులో ఉండగా ఎన్ఈపీ కింద హిందీతో కలిపి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని అధికార డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఎన్ఈపీ అమలు చేయకపోతే తమిళనాడుకు రావాల్సిన రూ.2152 కోట్ల సమగ్రశిక్షాఅభియాన్ నిధులు నిలిపివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఇప్పటికే హెచ్చరించారు. ప్రదాన్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఈ లేఖపై ప్రదాన్ తిరిగి స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు.ఈ విషయమై తాజాగా ప్రధాని మోదీ కూడా పరోక్షంగా స్పందించారు. దేశంలో భాషల పట్ల శత్రుత్వం సృష్టించొద్దని కోరారు.

పుతిన్, జెలెన్స్కీ కలిసిపోవాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్.రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl— ANI (@ANI) February 21, 2025అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్‌ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు.. ట్రంప్ ఇప్పటికే జెలెన్స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఎనిమిదేళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై నిందితులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హతమార్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం ముంబై నటి జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో చూపిస్తే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది. మమ్మల్ని చంపేయడం మినహా.. కేసును నీరుగార్చేందుకు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టాలో, హింసించారో అన్ని రకాలుగా చేశారు. ‘న్యాయం’ చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను అర్థించినా ఫలితం లేదు. ఈ కేసును సీబీఐతో విచారించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలి’ అని బాధితురాలు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కేసును విచారణకు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ నెల 12న హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించిన నేపథ్యంలో పార్వతీదేవి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుమార్తె హత్యోదంతం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. వ్యవస్థలు నిర్వీర్యం.. 2017లో చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. నా బిడ్డ 14 ఏళ్ల ప్రీతిపై లైంగిక దాడికి పాల్పడి హాస్టల్లో చంపేశారు. ఆర్థికంగా అత్యంత బలవంతులైన నేరస్తులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. పోక్సో కేసులో 90 రోజులు బెయిల్ రాకూడదు. కానీ 8 రోజుల్లోనే బెయిల్ వచ్చిందంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో, వారు ఎంత బలవంతులో అర్థమవుతోంది. ఈ కేసును నిర్వీర్యం చేయడం వెనుక పోలీసుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. 2017లో అప్పటి ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. హక్కుగా రావల్సిన రూ.8,12,500 మాత్రమే ఇచ్చారు. మాకు న్యాయం చేయాలని, ఏ గిరిజన బాలికకూ ఇలా అన్యాయం జరగకూడదని అప్పటి నుంచి నుంచి మేం పోరాడుతున్నాం. సీబీఐతో ఎందుకు విచారించలేదు? చంద్రబాబు హయాంలో 2017 నుంచి 2019 వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పటి విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాదయాత్రలో కలిసి కేసు గురించి వివరించడంతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 2019లో హైకోర్టులో కేసు వేశాం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలసి సీబీఐతో విచారణ చేయించాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. 2021లో కర్నూలు సిటీలో ఐదు సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు నా భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సీబీఐ స్పందించకపోవడంతో ఢిల్లీ వెళ్లి అధికారులను కలిశాం. ఆ తర్వాత జీవోను అమలు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. కేసును ఎందుకు విచారణకు తీసుకోలేదని సీబీఐపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో ఈ కేసును స్వీకరించేందుకు తగిన వనరులు లేవని, అయినా ఇది సీబీఐ పరిశోధించేంత సున్నితమైనది కాదని, స్థానిక పోలీసులే తేల్చవచ్చు’ అని ఈ నెల 12న హైకోర్టుకు వారి న్యాయవాది చెప్పారు. దీనిపై మేం కౌంటర్ దాఖలు చేస్తాం.డిప్యూటీ సీఎం, హోంమంత్రిని కలిసినా..పవన్ కళ్యాణ్ గతంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించినప్పుడు మమ్మల్ని పరామర్శించి న్యాయం చేస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత 2024 జూలై 27న మరోసారి కలిశాం. ఆయన సూచన మేరకు హోంమంత్రి వద్దకు వెళ్లగా సీబీఐతో కాకుండా సీఐడీతో విచారణ చేయిస్తామన్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నందున విచారణ అధికారులుగా సీనియర్లను నియమించాలని కోరాం. అనంతరం కేసును విచారణకు స్వీకరిస్తామంటూ కర్నూలు సీఐడీ ఆఫీసు నుంచి మాకు నోటీసు వచ్చింది. అయితే ఇందులో ‘పెద్దల ప్రమేయాన్ని’ మీరు తేల్చలేరని, ఐపీఎస్‌లను మీరెలా విచారిస్తారని, ఉన్నతాధికారులైతేనే మేం విచారణకు సిద్ధమని చెప్పాం. డీఎస్పీ స్థాయిలో అయితే సీఐడీ విచారణ వద్దు అని లిఖిత పూర్వకంగా తెలియచేశాం.జత్వానీ, ప్రీతి కేసుల్లో ఏది తీవ్రమైంది?ముంబై నటి జత్వానీని వేధించారని ఈ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టారు. ఆవిడ ప్రాణాలతోనే ఉంది. కానీ సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక. ఘోరంగా అత్యాచారం చేసి చంపారు. నా బిడ్డ ప్రాణాలతో లేదు. జత్వానీ కేసులో ఈ ప్రభుత్వం ఐపీఎస్‌లను సస్పెండ్ చేసి అత్యంత ప్రాధాన్యత కేసుగా విచారిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన ఓ గిరిజన బాలిక కేసును ఇంతే సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదు? ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, ‘వై’ క్రోమోజోమ్ గుర్తించామని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయి. కానీ ఇలాంటి కేసును సీబీఐతో విచారణ చేయించడం లేదు. కూటమి ప్రభుత్వం జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో పెట్టి ఉంటే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది’ అని పార్వతీ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడం, న్యాయం చేయడం రెండు వేర్వేరు అంశాలని, ఈ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 221) బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..➤హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,770 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది. 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.➤విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 200, రూ. 20 పెరిగింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు కొంత పెరిగింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7770 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు ఓ మోస్తరుగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 300 పెరిగి రూ. 80,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 370 పెరిగి రూ. 87,920 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శనివారం) రూ. 900 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 100 పెరిగి.. మళ్ళీ యధాస్థానానికే (రూ.1,00,500) చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధవన్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలియ తిరిగిన ధవన్.. ఆతర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. Who is this lady with Shikhar Dhawan?🥲 #ShikharDhawan #IndvsBan #RohitSharma𓃵 #ChampionsTrophy pic.twitter.com/JqFTeY4kAp— lei 🌼 (@sakshimadik03) February 20, 2025ఆ సమయంలో ధవన్ పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ధవన్.. సదరు విదేశీ యువతి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ధనవ్ కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawan pic.twitter.com/P0PSrC9ydc— Prernaa (@theprernaa) February 21, 2025ఇంతకీ ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయగా.. ఆమె పేరు సోఫీ షైన్ అని తెలిసింది. ఐర్లాండ్‌కు చెందిన ఈ యువతిని ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కూడా చేస్తున్నట్లు బయటపడింది. దీంతో సోఫీ, ధవన్ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించాడని అంటున్నారు.కాగా, 39 ఏళ్ల ధవన్.. తన మాజీ భార్య, ఆసీస్ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. ధవన్, ఆయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్ పలు సందర్భాల్లో వాపోయాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ధవన్ ప్రస్తుతం పలు ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ధవన్ ఇటీవలే నేపాల్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు. ధవన్ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్‌మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్ కంటే పదేళ్లు పెద్దది. ధవన్‌తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు 'మెగా' ఆఫర్
'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌లో హైప్ పెంచారు. అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్లో ట్రెండ్ అవుతుంది.

కోదండరెడ్డి.. ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరం అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల వచ్చిన కరువు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడూ భూగర్భజలాలు పడిపోలేదు. కానీ, కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొంది.రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరం.అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచించడమే. ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి, మా వల్ల కాదని కాదు.. మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరం. మీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కరువు కాటకాలు రావడం సహజం అన్నట్టుగా మాట్లాడి, కాంగ్రెస్ సృష్టించిన ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు.ఇప్పటికే వ్యవసాయరంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్కనీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్ర రైతాంగంలో భరోసా నింపాల్సిన పాలకులే అస్త్రసన్యాసం చేసిన సందర్భం దేశ చరిత్రలోనే లేదు. పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తిచేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు. జై కిసాన్.. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. కొదండరెడ్డి గారు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు… https://t.co/A2AFrxhMza— KTR (@KTRBRS) February 22, 2025

Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే! ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డివోర్స్ అంటారు.రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డివోర్స్‌తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ఎవరి వెర్షన్ వారిదే... నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్‌పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్‌ఫోన్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్‌గా టూర్లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీప్ డివోర్స్ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా. ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్‌ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్‌పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు.

HKU5-CoV-2: చైనాలో మరో మహమ్మారి!
బీజింగ్: ఐదేళ్ల క్రితం కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా! చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి హెచ్‌కేయూ5–కోవ్–2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరి, మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా, అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి హెచ్‌కేయూ5–కోవ్–2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నాయి. గాంగ్జౌ లేబోరేటరీ, గాంగ్జౌ అకాడమీ అఫ్ సైన్సెస్, వూహాన్ యూనివర్సిటీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం సార్స్–కోవ్–2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్–కోవర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ2) అనే రిసెప్టర్‌ను ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్–19 పంజా విసరింది. గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్–19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్: కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం
రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులు ఎందరు..?
టీటీడీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు
లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
HYD: లిఫ్టు ప్రమాదం.. విషమంగా అర్ణవ్ ఆరోగ్య పరిస్థితి!
ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు 'మెగా' ఆఫర్
Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని..
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్ టిప్స్!
ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం.. శుభవార్తలు వింటారు.
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధవన్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై ఆగ్రహం.. హైకోర్టు సంచలన తీర్పు
బ్రేకింగ్ న్యూస్: కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం
రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులు ఎందరు..?
టీటీడీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు
లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
HYD: లిఫ్టు ప్రమాదం.. విషమంగా అర్ణవ్ ఆరోగ్య పరిస్థితి!
ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు 'మెగా' ఆఫర్
Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని..
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్ టిప్స్!
ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం.. శుభవార్తలు వింటారు.
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధవన్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై ఆగ్రహం.. హైకోర్టు సంచలన తీర్పు
సినిమా

చంద్రముఖిలా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. బాలిలో విష్ణుప్రియ చిల్!
చంద్రముఖిలా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో చిల్ అవుతోన్న బిగ్‌బాస్ భామ విష్ణుప్రియ..పెళ్లి కూతురిలా ముస్తాబైన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్..మాల్దీవుస్లోనే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..బీచ్‌లో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి సురేఖవాణి..గ్రీన్ శారీలో ప్రియమణి పోజులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official)

సందీప్ కిషన్ 'మజాకా'.. అభిమానులను అలరిస్తోన్న ఫోక్ సాంగ్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్‌కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్ల నల్లాని కళ్ళతో, నాజూకు నడుముతో నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️— https://t.co/JCqj0HaZyi🎵 @leon_james🎤 @singerrevanth✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025

ఇదెక్కడి ట్విస్ట్.. మళ్లీ ఓటీటీకి వచ్చేసిన సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్
2018లో వచ్చి సూపర్ హిట్‌గా హారర్ థ్రిల్లర్ తుంబాడ్. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ మూవీని రీ రిలీజ్ చేయగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.31 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. అయితే రీ రిలీజ్‌కు ముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉండేది. కానీ ఊహించని విధంగా ఓటీటీ నుంచి ఈ చిత్రాన్ని తొలగించారు.అయితే తాజాగా ఆడియన్స్‌కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇటీవల థియేటర్లలో అలరించిన ఈ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ మరోసారి సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని మహరాష్ట్ర జానపద కథల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హనీ ట్రెహాన్, అషర్ హక్, హ్యారీ పర్మార్, ప్రశాంత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.తుంబాడ్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తుంబాడ్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నటుడు, నిర్మాత, సోహమ్ షా ఇప్పటికే ప్రకటించారు.

టాలీవుడ్లో ఇప్పుడదే ట్రెండ్.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..!
టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. The wait is over! 🎬✨Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025
క్రీడలు

డోపింగ్‌లో దొరికిన మారథాన్ విజేత
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్‌పై చర్యలు చేపట్టింది. గతనెల భారత్‌కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు.

కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్‌కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..!

సెలక్షన్స్‌పై ‘వీడియో’ కన్ను
న్యూఢిల్లీ: క్రీడాకారులు, జట్ల సెలక్షన్ ట్రయల్స్‌పై పదేపదే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఇక మీదట జరిగే ఎంపిక ప్రక్రియనంతా వీడియో రూపంలో తీయనుంది. తద్వారా అర్హులైన ప్రతిభావంతులకే బెర్త్‌లు లభించేలా చూడనుంది. ప్రతి ఒక్కరి సెలక్షన్ ప్రదర్శన వీడియోలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి విమర్శలకు తావుండదు. ‘ఇకపై అన్ని సెలక్షన్ ట్రయల్స్‌పై వీడియో నిఘా పెడతాం.పారదర్శకత, న్యాయబద్ధమైన ఎంపికలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ప్రదర్శనే ఎంపికకు గీటురాయి అవుతుంది. మెరిట్ కనబరిచిన వారే భారత జట్లకు ఎంపికవుతారు. ఇందులో క్రీడా సమాఖ్యలు ఇష్టారీతిన వ్యహరించేందుకు వీలుండదు. క్రీడా శాఖ అధికారులు, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పర్యవేక్షకులుగా హాజరవుతారు. ఇకపై ప్రతీ క్రీడాంశంలో దీన్ని అమలు చేస్తాం’ అని క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. షూటింగ్, రెజ్లింగ్‌లలో జరిగే సెలక్షన్ ట్రయల్స్ ప్రతీసారి విమర్శలపాలవుతోంది. రెజ్లింగ్ సమాఖ్య అయితే పతకాల కంటే కూడా ఈ తరహా వివాదాలు, విమర్శలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాల వల్ల అర్హత ఉండి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ సీజన్లో తొలి రెండు ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లకు భారత రెజ్లర్లు దూరమయ్యారు. దీనిపై క్రీడాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ శాఖ గుర్తింపు ఉన్న జాతీయ సమాఖ్యలకు ఢిల్లీలోని స్టేడియాల్లో ఆఫీస్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల ఢిల్లీకి వచ్చిన లేదంటే ఢిల్లీ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు బయలుదేరే ఆటగాళ్లకు ఆయా సమాఖ్యలు సమన్వయంతో సేవలందించేందుకు వీలవుతుంది. గతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సమాఖ్యల కార్యాలయాలు ఉండేవి. కానీ 2010 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కోసం ఆ స్టేడియాన్ని నవీకరించడంతో సమాఖ్యల ఆఫీసుల్ని అక్కడి నుంచి తరలించారు.

భారత్‌లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు!
న్యూఢిల్లీ: భారత్‌లో రెండోసారి కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. 2030లో జరిగే పోటీల కోసం బిడ్ వేయాలని యోచిస్తోందని క్రీడా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. క్రీడలను నిర్వహించడంతో పాటు 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి తొలగించిన క్రీడాంశాలను కూడా మళ్లీ చేర్చే ఆలోచనలో భారత్ ఉంది. 2030 క్రీడల నిర్వహణకు ‘ఆసక్తిని ప్రదర్శించే’ ప్రక్రియకు మార్చి 31 చివరి తేదీ కాగా... ఈ దిశగానే ప్రయత్నం మొదలైనట్లు అధికారి చెప్పారు. ‘కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులతో చర్చలు జరిగాయి. 2030లో మేం నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా చెప్పాం. 2026లో తొలగించిన అన్ని క్రీడాంశాలను 2030లో చేర్చే విధంగా చూడాలని కూడా చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. 2026లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహక కమిటీ కేవలం 10 క్రీడాంశాలకే పోటీలను పరిమితం చేసింది. ఈ క్రమంలో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్, క్రికెట్లను పోటీల నుంచి తొలగించారు. ఇవే క్రీడాంశాల్లో భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉండేది. కమిటీ నిర్ణయం కారణంగా భారత్‌కు పెద్ద సంఖ్యలో పతకాలు వచ్చే అవకాశం ఉన్న ఆటలన్నీ క్రీడల్లో లేకుండాపోయాయి. గతంలో ఇదే తరహాలో 2022 బర్మింగ్‌హామ్ క్రీడల నుంచి కూడా ఆర్చరీ, షూటింగ్‌లను తొలగించిన తర్వాత వాటిని మళ్లీ చేర్చాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. దీనికి సానుకూల స్పందన వచ్చినా కోవిడ్ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అయితే వన్నె తగ్గిన కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే విషయంలో ఆర్థికభారం కారణంగా పలు పెద్ద దేశాలు కూడా వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో భారత్ ముందుకు వెళ్లడం ఆశ్చర్యకర పరిణామం! 2026కు ముందుగా ఆ్రస్టేలియాలోని విక్టోరియా వేదిక కాగా... 2023 జూలైలో ఆ దేశం అనూహ్యంగా తప్పుకుంది. నిర్వాహక కమిటీ మలేసియా దేశానికి ఆఫర్ ఇచ్చినా అదీ అంగీకరించలేదు. చివరకు తక్కువ బడ్జెట్‌తో, అదీ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆరి్థక సహకారంతో గ్లాస్గో ముందుకు వచి్చంది. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 23వ కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. మరోవైపు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపిస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి లేఖ పంపించింది. వచ్చే మార్చి తర్వాత దీని పురోగతిపై స్పష్టత రావచ్చు.
బిజినెస్

నివా బూపా హెల్త్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్‌ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్‌ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే.

బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది.

ఆరేళ్లలో ఐదు కోట్ల మంది ప్రయాణికులు
హైదరాబాద్: ఆరేళ్లలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఏటా 5 కోట్ల స్థాయికి చేరుతుందని జీఎంఆర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.9 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ వెల్లడించారు. ‘2023–24లో 2.5 కోట్ల మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేశారు. కంపెనీ ప్రస్తుత కార్గో టెరి్మనల్ విస్తరణ కోసం రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది. ఏటా 4 లక్షల టన్నుల సామర్థ్యా న్ని చేరుకోవడానికి కొత్త టెరి్మనల్ ఏర్పా టు చేస్తోంది. విమానాశ్రయం ఇప్పటికే ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2008లో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్టును నిర్మించారు’ అని వివరించారు.

ఇక వెండి.. కొండ!
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిష్పత్తి చెబుతోందిదే.. బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్‌టైమ్ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్‌టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి. 3,200 డాలర్ల దిశగా పసిడి!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్ టారిఫ్‌ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను.. ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి. ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్‌ల్లో రాబడులు (%)ఏబీఎస్ఎల్ సిల్వర్ 36.36 కోటక్ సిల్వర్ 36.34 డీఎస్పీ సిల్వర్ 36.21 హెచ్డీఎఫ్సీ సిల్వర్ 36.13 యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 36.01 ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం–సాక్షి, బిజినెస్‌డెస్క్
ఫ్యామిలీ

ఎకో టూరిజం: వీకెండ్లో నేచర్‌ని చుట్టొద్దామిలా..!
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో వీకెండ్లో ట్రెక్కింగ్, నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, అడవులు, జంతువులు, పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘దక్కన్వుడ్స్, ట్రయల్ పేరుతో ప్రతి శనివారం, ఆదివారం వివిధ కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకూ ఎకో టూరిజం కార్యక్రమాల వివరాలు.. ఫిబ్రవరి 22న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ ఫిబ్రవరి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్, మార్చి 1న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 2న గజ్వెల్ ఫారెస్ట్‌లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 8న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 9న ఉదయం 6.30 – 10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 15న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 16న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఉదయం 7 – 10 గంటల వరకూ బర్డ్ వాక్, ట్రెక్కింగ్ మార్చి 29న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 30న గజ్వెల్ ఫారెస్ట్‌లో ఉదయం 7 – 10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటుందన్నారు. అసక్తిగలవారు 94935–49399, 93463–64583 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. (చదవండి: దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్)

దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్.. విభిన్న రుచుల భాండాగారం మన భాగ్యనగరం. స్థానిక వంటకాలు మొదలు ఖండాంతరాలు దాటిన కాంటినెంటల్ వంటకాలకు నెలవు ఈ భాగ్యనగరం. ఇందులో భాగంగా కొరియన్, మొరాకో వంటకాలు మొదలు ఇటాలియన్, స్పానిష్ వెరైటీల వరకూ నగరానికి క్యూ కడుతున్నాయి. విదేశీ పర్యాటకులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, సినిమా, క్రీడా రంగ ప్రముఖులు నగరానికి వస్తుండటంతో కాంటినెంటల్ వంటకాలకు ఆదరణ పెరిగింది. నగరవాసులు సైతం విభిన్న వంటకాలు, వినూత్న రుచులను ఆస్వాదించడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని ది లీలా హైదరాబాద్ హోటల్ రీన్ చెఫ్ స్టూడియో వేదికగా ప్రసిద్ధ ఫ్రెంచ్–ఇటాలియన్ వంటకాలు సందడి చేస్తున్నాయి. మార్చి ప్రారంభం వరకూ అందుబాటులో ఉండే ఈ ఐకానిక్ రుచులు హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అరుదైన ఫ్రెంచ్–ఇటాలియన్ రుచులను నగరానికి తీసుకొచ్చింది ‘లే సర్క్’. లీలా, రీన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న ‘లే సర్క్’ న్యూయార్క్ వేదికగా ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ రుచులకు గమ్యస్థానం. నగరంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక పాప్–అప్ దశాబ్దాలుగా ప్రపంచ స్థాయి లగ్జరీ డైనింగ్ వేదిక. దక్కన్ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన వేదికగా ఇటాలియన్ సంస్కృతిని ఆహ్వానించడంతో ఫుడ్ లవర్స్ వావ్ అంటున్నారు. హిమాలయాలు, దట్టమైన అడవుల్లో లభించే అరుదైన పుట్టగొడుగులుతో(లక్షల రూపాయలు ఖరీదు చేసే) సహా అరుదైన పదార్థాలు, పుష్పాలతో వడ్డించిన డిషెస్ ఇక్కడ సందడి చేస్తున్నాయి. చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (మాంసాహారం) స్మోక్డ్ అవకాడో, ట్యూనా సాకు టార్పారే – ప్యాషన్ ఫ్రూట్ జెల్ పదార్థంతో కుంకుమపువ్వును ఆకర్షణీయంగా అలంకరించి తయారు చేసిన ఫుడ్ వెరైటీ. రావియోలీ స్టఫ్డ్ విత్ బరోలో బ్రైజ్డ్ డక్ – క్యారెట్ వెలౌట్, అరుదైన రోజ్మేరీ మోరెల్ మష్రూమ్‌తో తయారు చేసిన వంటకం. ఇందులో ‘స్పఘెట్టి, పారెల్స్ ఫోమ్ పొంగుతూ కొత్త రుచిని అందిస్తుంది. పాపియెట్ ఆఫ్ చిలీయన్ సీబాస్ – కరకరమనే బంగాళాదుంపలు, బరోలో సాస్‌తో నోరూరించే క్రీమ్‌తో తయార చేస్తారు. ‘లే సర్క్’ క్లాసిక్ టిరామిసు – కాఫీ జెల్లీ, మస్కార్పోన్ ఎస్పుమా, కాఫీ మెరింగ్యూ సమ్మేళనంతో తయారు చేసే వినూత్న వంటకం. చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (శాకాహారం) డబుల్ కుక్డ్ మోజారెల్లా – బ్రెడ్ క్రిస్టల్, బాసిల్ స్ప్రింగ్, టొమాటో రిలిష్తో తయారు చేసిన శాకాహార వంటకం. హ్యాండ్–కట్ ఫ్రెష్ బ్లాక్ ట్రఫుల్ ఫెట్టూసిన్ – లక్ష రూపాయాలకు పైగా ఖరీదు చేసే అరుదుగా దొరికే మోరెల్ పుట్టగొడుగులను కలిపి పర్మేసన్ ఫండ్యు, బ్లాక్ ట్రఫుల్ షేవింగ్స్ వండుతారు. రోస్టెడ్ బీట్రూట్–బుర్రటా రిసోట్టో – 24కే గోల్డ్ డస్ట్‌గా పిలిచే ముడి పదార్థంతో తయారు చేసే చిరుతిండి. సింఫనీ ఆఫ్ చాక్లెట్ – డార్క్ చాక్లెట్ మౌస్తో ముంచి, మిల్క్ చాక్లెట్‌తో కలిపి, చాక్లెట్ సాయిల్, ఫ్రెష్ బెర్రీస్, చాక్లెట్ ఐస్ క్రీం సమ్మిళితంగా తయారు చేసే ‘లే సర్క్’ సిగ్నేచర్ వంటకం. విభిన్న రుచులు.. అరుదైన, వినూత్న రుచులను ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశాలకు చెందిన వంటకాలకు ఇక్కడ అభిమానులుంటారు. ప్రస్తుతం రెన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న వంటకాలు దేశంలో మరెక్కడా లభించవు. – ప్రముఖ చెఫ్ వశిష్ట, లీలా రీన్ చెఫ్ స్టూడియో

అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది. తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది. గొప్ప విశేషం.. ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను. – శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా.. గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్‌కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్‌కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు. ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్‌లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి.ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి. (చదవండి: ఆరోగ్య ప్రయోజనాలందించే బెస్ట్ చట్నీలివే..!)

నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లు
వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో పార్సీ మహిళలు గారా చీరలను ధరించేవారు. అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ ఎంబ్రాయిడరీని కొన్ని ప్రత్యేక రోజులకే పరిమితం చేయకూడదని నేడు సృజనాత్మకంగా దుపట్టాలు, లెహంగాలు, ఇండోవెస్ట్రన్ డ్రెస్సుల మీదకు తీసుకు వస్తున్నారు. భారతదేశం నుండి పార్సీలు వాణిజ్యం కోసం చైనాకు ప్రయాణించే రోజుల్లో ‘గారా’ ఎంబ్రాయిడరీ మన దేశంలోకి అడుగుపెట్టింది. పార్సీలు మన దేశం నుండి నల్లమందు, పత్తిని చైనాకు తీసుకెళ్లి, అక్కడి టీ కోసం మార్పిడి చేసేవారు. బ్రిటిష్ వారు ఐరోపాలో ఎక్కువ టీని అమ్మాలనుకోవడంతో పార్సీలు త్వరగా వ్యాపారంలో ధనవంతులయ్యారు. వారు తిరిగి వచ్చేటప్పుడు చైనాలో అందుబాటులో ఉన్న సిరామిక్స్, వివిధ ప్రాచీన వస్తువులను కూడా తీసుకు వచ్చేవారు. ఒక వ్యాపారి కళాత్మకంగా ఉండే ఆ ఎంబ్రాయిడరీ ముక్కను ఒకటి తీసుకువచ్చాడన్నది చరిత్ర. ఆ ఎంబ్రాయిడరీ లో రకరకాల మార్పులు చేసి, తదుపరి కాలంలోపార్సీ మహిళల చీరల మీద వైభవంగా వెలిసింది. ముంబైలో స్థిరపడిన పార్సీ సమాజం చాలా ధనవంతులుగా, గారా చీరలు వారి సిగ్నేచర్‌గా మారిపోయాయి. ఆ విధంగా పార్సీ గారా అనే పేరు స్థిరపడిపోయింది.‘గారా’ ఎంబ్రాయిడరీలో పోల్కా చుక్కలను, సాలీడులా అనిపించే మోటిఫ్స్ కనిపిస్తాయి. పక్షులు, వృక్షజాలం, జంతుజాలం.. వంటివి ఈ ఎంబ్రాయిడరీలో ఒద్దికగా కనిపిస్తాయి. అచ్చమైన పట్టు దారాలతో సంక్లిష్టంగా ఉండే ఈ డిజైన్‌తో చీర రూ పొందించాలంటే కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే ఈ ఎంబ్రాయిడరీ అత్యంత ఖరీదైనదిగా పేరొందింది.ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్లునాటి రోజుల్లో ఈ ఎంబ్రాయిడరీకి సాలిఘజ్’ అని పిలిచే ప్రత్యేక ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకునేవారు.. 1930లలో ఈ ఫ్యాషన్ వెలుగు చూసింది. తర్వాత 80లలో పునరుద్ధరించబడింది. ముంబైలో పార్సీలు ఈఎంబ్రాయిడరీని మందపాటి పట్టు ఫ్యాబ్రిక్ పైనే డిజైన్ చేసేవారు. ఇప్పుడు క్రేప్, జార్జెట్, షిఫాన్ ఫ్యాబ్రిక్లను ఉపయోగిస్తున్నారు. డిజైన్‌కి పెద్దమొత్తంలో పట్టుదారాలు ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈ ఎంబ్రాయిడరీ బరువును మోయలేవు. దాదాపు 40–50 సంవత్సరాల క్రితం ట్రెండ్‌లో ఉన్న ఈ కళ ఇప్పుడు మళ్లీ కళగా వెలుగులోకి రావడం చూస్తుంటే టైమ్‌లెస్ ట్రెడిషన్ అనిపించకమానదు. తరతరాలుగా చేతులు మారే ఆభరణాలలా పార్సీ‘గారా’ అనే ఎంబ్రాయిడరీని అత్యున్నతమైన వారసత్వ సంపదగా పేర్కొంటారు. గాజ్ లేదా పాజ్ అనే అందమైన పట్టు వస్త్రంపై రూపొందించే ఈ ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలలో వైభవంగా వెలిగిపోతుంటుంది. వందేళ్లకు పైగా ప్రాచీన చరిత్ర కల ‘గారా’ డిజైన్ నేడు సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక అయ్యింది. ఇదీ చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!ఇటీవల హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నీతా అంబానీ పార్సీ గారా శారీలో మెరిసి, మరోసారి వారసత్వ సంపదను అందరికీ గుర్తుచేశారు. సంక్లిష్టమైన ఈ హస్తకళ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జెనోబియా ఎస్.దావర్ ఈ చీర రూపకర్త.
ఫొటోలు
National View all

Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేస్తూ స్థానిక అధికార

మాతో ఆటలొద్దు: కమల్‌హాసన్ వార్నింగ్
చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆట

పతంగిదేపై ‘చేయి’
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల సందర్భంగా సస్పెన్స్‌లు..

Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం
వారణాసి: ఫిబ్రవరి 26..

ఇందిరాగాంధీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్
International View all

World Thinking Day: ‘మన ప్రపంచం.. మన భవిష్యత్’ థీమ్‌తో..
‘ఏ దేశంలోని ప్రజలు సదాలోచనలతో మెలుగుతారో, ఆ దేశ భవిష్యత్ బంగారుమయం అవుతుంద

పుతిన్, జెలెన్స్కీ కలిసిపోవాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

భగవద్గీత మీద కాశ్‌పటేల్ ప్రమాణం..ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్:అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బ

ఆస్పత్రిలోనే పోప్ ఫ్రాన్సిస్
రోమ్: పోప్ ఫ్రాన్సిస్(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆ

ఆ మృతదేహం షిరి బిబాస్‌ది కాదు..
టెల్అవీవ్: హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మ
NRI View all

సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
న్యూజెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార

జేఈఈ టాపర్ గుత్తికొండ మనోజ్ఞకు నాట్స్ అభినందనలు
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ పర

ఉగాది సాహిత్య సమ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆ
క్రైమ్

భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జాయింట్ కమిషనర్ భార్య
బౌద్ధనగర్: తనను వేధింపులకు గురి చేస్తూ.. మరో మహిళతో కలిసి ఉన్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఆయన భార్య. ఈ ఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన జానకీరామ్ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు గతంలో వివాహమైంది. కొంత కాలం తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు. 2018లో బౌద్ధనగర్‌కు చెందిన కల్యాణితో జానకీరామ్‌కు రెండో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత జానకీరామ్, కల్యాణి కలిసి ఆయన తల్లిదండ్రులతో నివసించసాగారు. ఈ క్రమంలోనే కల్యాణిని అత్తామామలతో పాటు తన భర్త అన్న, వదిన వేధింపులకు గురి చేసేవారు. జానకీరామ్‌కు మరో వివాహం చేసేందుకు కల్యాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జానకీరామ్ నాలుగు నెలల క్రితం భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి కల్యాణి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా భర్త లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో భర్తపై అనుమానం కలిగిన కల్యాణి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వారాసిగూడలోని భర్త ఇంటికి వెళ్లి చూడగా.. అతను మరో అమ్మాయితో కలిసి ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జానకీరామ్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు బాధితురాలు కల్యాణి తెలిపారు. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కడుపుపై భర్త తన్నడంతో గర్భస్రావం జరిగిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో కల్యాణి పేర్కొన్నారు. 20 మంది దాడి చేశారు: జానకీరామ్ తనతో పాటు ఇంట్లో ఉన్న తన స్నేహితురాలిపై 20 మంది దాడికి పాల్పడ్డారని జాయింట్ కమిషనర్ జానకీరామ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య కల్యాణి, బావమరిది బులిశెట్టి భాస్కర్ సుమారు 20 మందితో కలిసి ఇంట్లోకి వచ్చి దాడి చేశారన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు తెలిపారు.

స్నేహితురాలు మాట్లాడటం లేదని..
రంగారెడ్డి: స్నేహితురాలు మాట్లాడటం లేదని ఓ విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆమనగల్లు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీజ.. స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయురాలు.. బాలికను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియాకు తరలించారు. ప్రస్తుతంవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ డివిజన్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్, సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్‌లు పాఠశాలకు వెళ్లారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా.

చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు.