Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Buggana Rajendranath satires the Chandrababu government over AP budget1
AP Budget 2025: చంద‍్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు

సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్‌ బుక్‌లో కలర్‌ ఎక్కువ.. కంటెంట్‌ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్‌ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్‌ చేస్తున్న సర్కస్‌ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్‌ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్‌లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్‌ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్‌ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్‌ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్‌ టేబులంటూ ఏమీలేదని మండిపడ్డారు.

Chandrababu Govt Introduced Ap Budget With Huge Debt Estimate2
బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..

సాక్షి, అమరావతి: భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్‌ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది.ఎన్నికల హామీలను గాలికి వదిలేసి..ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది.తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్‌లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. 12 వేల కోట్ల కుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.దీపం పథకానికి భారీగా కోత దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్‌లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు టోకరాడ్వాక్రా మహిళలకు బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్‌లో చూపించలేకపోయింది.అన్నదాత సుఖీభవకు కేటాయించింది ఇంతేఅన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్‌.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. 10 వేల 400 కోట్లకు 6,300 కోట్లే కేటాయింపులు చేసింది.ఉచిత బస్సు హామీకి బడ్జెట్‌లో తుస్‌ఉచిత బస్సు హామీకి బడ్జెట్‌లో తుస్సు మనిపించింది ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావేనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు..

Botsa Satyanarayana Reaction To Chandrababu Govt Budget3
‘కూటమి’ వంచన.. బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’’ అని బొత్స నిలదీశారు.‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మ స్తుతి, పరనిందాగానే బడ్జెట్ సాగింది. గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్‌ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు. షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలి. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదు.. ఉలుకు పలుకే లేదు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్‌పై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలనిమాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది.’’ అంటూ బొత్స ధ్వజమెత్తారు.అంకెలే తప్ప అభివృద్ధి కానరాలేదు: ఎమ్మెల్సీ రవిబాబుచంద్రబాబు, లోకేష్ ని పొగిదేందుకే సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్‌లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమే.బడ్జెట్ పేరుతో మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు. మహాశక్తికి కేటాయింపులే లేవు. నిరుద్యోగులను రూపాయి కూడా కేటాయింపు చేయకుండా నిట్టనిలువునా ముంచారు. 12 వేల కోట్లు తల్లికి వందనంకి కావాలి.. కానీ కేటాయింపులు అరకొరగా కేటాయించారు. రైతుల్ని మోసం చేశారు. కోటి 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. 95లక్షల కి కుదించారు..4వేల కోట్లు అవసరం ఐయితే రెండున్నర వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్‌ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్‌ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్‌పై పెడితే బాగుండేది. బడ్జెట్‌పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తాంబడ్జెట్‌పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వైఎస్‌ జగన్‌ ఐఆర్‌ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్‌ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్‌మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బడ్జెట్‌పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం.. వీసీలు 17 మందిని బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని ఆధారాలు బయట పెడతాం.. ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తాం.అంకెల గారడీ మాత్రమే: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. తల్లికి వందనం లో కోత పెట్టారు. చేనేతలను ఆదుకునే ఒక్క పథకం లేదు. గృహ నిర్మాణ కేటాయింపులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసింది. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు’’ అని బొమ్మి ఇజ్రాయెల్‌ మండిపడ్డారు.

Pakistan 10th Edition Schedule Announced4
ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌.. షెడ్యూల్‌ ప్రకటన

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) పీఎస్‌ఎల్‌ 10వ ఎడిషన్‌ షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ఐపీఎల్‌-2025 షెడ్యూల్‌తో క్లాష్‌ అవుతుంది. పీఎస్‌ఎల్‌ 10వ ఎడిషన్‌ ఏ‍ప్రిల్‌ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్‌లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌ డేట్స్‌లో ఫిక్స్‌ చేసింది.పీఎస్‌ఎల్‌-2025 విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు, ఫైనల్‌ సహా 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్‌-1 సహా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్‌ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్‌లో మూడు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్‌లో (శనివారం​) జరుగనుండగా.. ఓ డబుల్‌ హెడర్‌ పాక్‌ నేషనల్‌ హాలిడే లేబర్‌ డే రోజున జరుగనుంది.లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ టూ టైమ్‌ ఛాంపియన్స్‌ లాహోర్‌ ఖలందర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్‌లో ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ కూడా జరుగనుంది. ఏప్రిల్‌ 8న పెషావర్‌లో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్‌ఎల్‌-2025 పూర్తి షెడ్యూల్‌..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్‌ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package5
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Uttarakhand Badrinath Avalanche Accident Latest news Updates6
బద్రీనాథ్‌: భారీగా విరిగిపడ్డ మంచుచరియలు.. చిక్కుకున్న కార్మికులు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) హిమపాతం భారీ బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చమోలి-బద్రినాథ్‌ (Badrinath) జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంచులో ((Avalanche) 57మంది రోడ్డు నిర్మాణ కార్మికులు కూరుకుపోయారు.మంచు చరియలు విరిగిపడడంతో అప్రమత్తమైన సహాయకబృందాలు 10 మంది కార్మికులను రక్షించాయి. సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మిగిలిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. जनपद चमोली में माणा गांव के निकट BRO द्वारा संचालित निर्माण कार्य के दौरान हिमस्खलन की वजह से कई मजदूरों के दबने का दुःखद समाचार प्राप्त हुआ।ITBP, BRO और अन्य बचाव दलों द्वारा राहत एवं बचाव कार्य संचालित किया जा रहा है।भगवान बदरी विशाल से सभी श्रमिक भाइयों के सुरक्षित होने की…— Pushkar Singh Dhami (@pushkardhami) February 28, 2025మంచు చరియలు కింద రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్‌ వేదికగా ధృవీకరించారు. మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడాలని ప్రార్థించారు.చమోలి జిల్లా మనా గ్రామ సమీపంలో బోర్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌ (బ్రో) చేపడుతున్న నిర్మాణ పనులలో చాలా మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారనే విచారకరమైన సమాచారం అందింది. నిర్మాణ కార్మికులను రక్షించేందుకు ఐటీబీపీ, బ్రో రెస్క్యూ బృందాలతో పాటు ఇతర రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. కార్మికులందరూ సురక్షితంగా ఉండాలని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Kiara Advani First Pregnancy Fashion Moment Black Balenciaga Dress Gold Jewellery7
తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్‌!

హీరోయిన్‌ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్‌తో ఒక క్యూట్‌ ఫోటోను పోస్ట్‌ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్‌ (Sidharth Malhotra)కూడా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్‌షోలో బాలెన్సియాగా బ్లాక్‌ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్‌ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్‌ స్పెషల్‌గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్‌లో, కియారా క్లాసిక్‌ బ్లాక్‌ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ లుక్‌తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్‌గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్‌ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్‌ ఎటైర్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్‌తో సహా చంకీ స్టేట్‌మెంట్ నెక్లెస్‌లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్‌లెట్‌ల స్టాక్‌ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్‌లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్‌ చేసింది.

Stock Market crash Sensex sinks 1414 pts Nifty at 22,1258
ట్రంప్‌ ఎఫెక్ట్‌.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్‌లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్‌ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్‌ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్‌ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.

AP P4 Survey 2025 raises many questions in people9
పీ4 సర్వేపై ప్రజల్లో ఆందోళన.. ఎన్నో సందేహాలు!

కడప సెవెన్‌రోడ్స్‌: పీ4 పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు పరచకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా పైలెట్‌ ప్రాజెక్టు (pilot project) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 20వ తేది నుంచి వైఎస్ఆర్‌ జిల్లాలో పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ పార్టిసిపేషన్‌ (పీపీపీ) పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేది నాటికి పీ4 సర్వే (P4 Survey) పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,70,365 కుటుంబాలు ఉండగా, ఇప్పటికి 1,88,893 కుటుంబాలను అంటే 40.16 శాతం సర్వే పూర్తి చేశారు. ఇందులో 157213 కుటుంబాల (83.23 శాతం) ఆమోదం తీసుకున్నారు. ఇక 2,81,472 కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 645 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 20 శాతం నిరుపేద కుటుంబాలు గుర్తించి గ్రామ సభల ద్వారా నిర్దారిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు.ఎన్నో సందేహాలు! సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయభూమి ఎంత ఉంది? మున్సిపల్‌ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్‌కం ట్యాక్స్‌ (Income Tax) ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్‌ వినియోగం ఎంతమంది అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీస్తున్నారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. నాడు సంక్షేమ జాత‌ర‌.. నేడు పాత‌ర‌వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమం అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే నేతలు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు.చ‌ద‌వండి: బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..పెన్షన్‌ రూ. 1000లు పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా పీ4 సర్వే చేపట్టడం ఇందులోభాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారి పేర్లు సైతం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం, అలాంటి వివరాలు నమోదు చేసినపుడు బయో మెట్రిక్‌ ద్వారా ధృవీకరించాలని కూడా చెప్పడం అనుమానాలు బలపడేందుకు కారణాలుగా ఉన్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేగుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు.

KSR Comment On CM Chandrababu Double Words On Election Promises10
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?

కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్‌ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్‌ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్‌ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్‌ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Advertisement

వీడియోలు

Advertisement