Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Introduced Ap Budget With Huge Debt Estimate1
బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..

సాక్షి, అమరావతి: భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్‌ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది.ఎన్నికల హామీలను గాలికి వదిలేసి..ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది.తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్‌లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. 12 వేల కోట్ల కుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.దీపం పథకానికి భారీగా కోత దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్‌లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు టోకరాడ్వాక్రా మహిళలకు బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్‌లో చూపించలేకపోయింది.అన్నదాత సుఖీభవకు కేటాయించింది ఇంతేఅన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్‌.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. 10 వేల 400 కోట్లకు 6,300 కోట్లే కేటాయింపులు చేసింది.ఉచిత బస్సు హామీకి బడ్జెట్‌లో తుస్‌ఉచిత బస్సు హామీకి బడ్జెట్‌లో తుస్సు మనిపించింది ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావేనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు..

KSR Comment On CM Chandrababu Double Words On Election Promises2
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?

కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్‌ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్‌ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్‌ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్‌ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Pakistan PM Under Pressure Over Champions Trophy Humiliation3
ఓటమి ఎఫెక్ట్‌.. పాకిస్థాన్‌ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్‌!

ఇస్లామాబాద్‌: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్‌ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్‌ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్‌, న్యూజిలాండ్‌) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానానికి ప‌రిమిత‌మైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్‌, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్‌ టీమ్‌ ఆట‌తీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆట‌తీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్ర‌ధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్‌లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్‌ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్‌ క్రికెట్‌ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్ర‌ద‌ర్శ‌నపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్ర‌స్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు త‌మ ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దును వేటికి ఎలా ఖ‌ర్చుపెడుతుందో తెలుసుకునే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఉంది. పీసీబీలోని కొంద‌రు అధికారులు నెల‌కు ఐదు మిలియ‌న్ల‌కు వ‌ర‌కు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్య‌త‌లను నిర్వ‌ర్తించ‌డంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టు ఆట తీరుపై పార్లమెంట్‌లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ క‌థ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెల‌వ‌కుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫ‌ల్యాల‌కు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్క‌టే కార‌ణం కాద‌ని, పాక్ జ‌ట్టు దేశ‌వాలీ వ్య‌వ‌స్థ పూర్తిగా క్షీణించ‌డం అని వారు చెబుతున్నారు.

CM Revanth Wrote Letter To Minister Kishan Reddy4
రేవంత్‌ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతోంది. పలు ప్రాజెక్ట్‌ల అంశమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి కౌంటరిస్తూ తాజాగా సీఎం రేవంత్‌ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌ తాజాగా తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. ఇక, సీఎం రేవంత్‌ లేఖలో.. ఆర్‌ఆర్‌ఆర్‌, మూసీ, మెట్రో ఫేజ్‌-2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కోసం ఎన్ని సార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం.. కానీ, కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితమ ప్రధాని మోదీతో సమావేశానంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్‌ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్‌ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని మోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ విసిరారు.

Andhra Pradesh Budget 2025 26 Updates5
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వంపబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనా గా చూపించిన ప్రభుత్వంరెవెన్యూ వ్యయం 2,51, 162 కోట్లుపెట్టుబడి వ్యయం 40,636 కోట్లు అంచనాతో బడ్జెట్‘తల్లికి వందనం’కి నిధులు కోతబడ్జెట్ లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం కి కేటాయింపు12 వేల కోట్లకు పైగా తల్లికి వందనం కి అవసరంగత ఏడాది ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన ప్రభుత్వందీపం పథకానికి భారీగా కోతకోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదింపుబడ్జెట్ లో 4 వేల కోట్లకు గాను 2601 కోట్లు మాత్రమే కేటాయింపుఅన్నదాత సుఖీభవకు భారీ కోతఅన్నదాత సుఖీభవ కి కేవలం 6300 కోట్లు కేటాయింపురైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ10 వేల 400 కోట్లకు 6300 కోట్లే కేటాయింపు👉 మంత్రి పయ్యావుల బడ్జెట్‌ ప్రసంగంరూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లుబీసీ క్షేమానికి రూ.23, 260 కోట్లుపాఠశాల విద్యకు 31, 806 కోట్లుఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లువైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లుపంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 18,848 కోట్లుపురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు కేటాయింపుసాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లుజలవనరుల శాఖకు రూ.18,020 కోట్లుఇంధన శాఖకు రూ.13,600 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు రాష్ట్ర పునర్మిర్మాణం సవాలుతో కూడుకుంది1995నాటి పరిస్థితులే నేడు నెలకొన్నాయికూటమి అధికారంలోకి వచ్చాక 74 పథకాలను ప్రారంభించాంరాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందిఅప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది 2025-26కుగానూ రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ అంచనామూలధన వ్యయం రూ.40, 635 కోట్లుమూలధన వ్యయం అంచనా రూ.40, 635 కోట్లురెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుద్రవ్యలోటు రూ.79,926 కోట్లురెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర 👉రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ 2025-26👉కూటమి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌👉శాసనసభలో ఏపీ బడ్జెట్‌ 2025 ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ బడ్జెట్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం👉అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్‌లో మంత్రివర్గం సమావేశం👉 హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌, మంత్రులు👉 సూపర్‌ సిక్స్‌ హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బడ్జెట్‌.. ఎక్కడ.. ఎవరు?👉10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు👉 శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 👉శాసన మండలిలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.వాట్‌ ఎబౌట్‌ సూపర్‌ సిక్స్‌?👉ఈ బడ్జెట్ లోనేనా సూపర్ సిక్స్ కి నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత..👉ఇప్పటివరకు సూపర్ సిక్స్ ని అమలు చేయని కూటమి ప్రభుత్వం👉తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు👉మొదటి ఏడాది సూపర్ సిక్స్ కి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.కేటాయింపులైతే చేసేద్దాం!👉కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. 👉ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. 👉 కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 👉2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు. రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు.

Ponnavolu Sudhakar Reddy Comments On Posani Krishna Murali Case6
పోసాని కేసులో ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌: పొన్నవోలు

సాక్షి, అన్నమయ్య జిల్లా: ‘పోసాని కృష్ణమురళి కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్‌ డెడ్‌.. సెక్షన్లు 111, 67 వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పింది.. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించటం సరికాదు‘‘ అని మాజీ ఏఏజీ, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు లో కేసు వేస్తాం’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలి’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.కాగా, పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు (14 రోజులు) రిమాండ్‌ విధించింది. పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎస్‌ఎన్‌ 111 యాక్ట్‌నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు.రాత్రి 9 గంటల నుంచి కోర్టులోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. రాత్రి 9.20 గంటలకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. అంతకు ముందు ఓబువారి పల్లె పీఎస్‌లో 9 గంటల పాటు పోసాని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్‌ పోసానిని స్వయంగా విచారించారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్‌ వికటాట్టహాసంరెడ్‌బుక్‌ రాజ్యాంగమే పరమావధిగా బరితెగింపురెడ్‌బుక్‌ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్‌ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్‌ కొనసాగించింది.జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్‌ 196, 353(2), 111 ఆర్‌/డబ్ల్యూ 3(5) ఆఫ్‌ ది బీఎన్‌ఎస్‌ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి.

Gill to Lead India in CT 2025, As injured Rohit Might be Rested vs NZ: Report7
IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ దూరం.. కెప్టెన్‌గా అతడు!

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్‌ చేరుకున్న రోహిత్‌ సేన.. న్యూజిలాండ్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్‌కు రెస్ట్‌ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ అతడు బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్‌ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్‌ మ్యాచ్‌ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్‌కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్‌తో పాటు ఓపెనర్‌గా రాహుల్‌అయితే, గిల్‌ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్‌ నెట్‌ సెషన్‌లో అతడు గంటలపాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడంతో వాటికి చెక్‌ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ గనుక దూరమైతే గిల్‌కు ఓపెనింగ్‌ జోడీగా కేఎల్‌ రాహుల్‌ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్‌-‘ఎ’ నుంచి కివీస్‌ కూడా భారత్‌తో పాటు సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్‌లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్‌ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆధారంగానే గ్రూప్‌-‘ఎ’ విజేతతో పాటు సెమీస్‌ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్‌-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్‌- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్‌ చేతిలో ఓటమి.. బట్లర్‌ సంచలన నిర్ణయం?!

Sabdham Movie Review And Rating In Telugu8
Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ

టైటిల్‌: శబ్దంనటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్‌, లైలా, లక్ష్మీ మీనన్‌ తదితరులునిర్మాణ సంస్థ: 7G ఫిల్మ్స్ నిర్మాత: 7G ఫిల్మ్స్ శివ దర్శకత్వం: అరివళగన్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాభన్ఆది పినిశెట్టికి (Aadhi Pinisetty) సోలో హిట్‌ పడి చాలా కాలమైంది. తెలుగు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. కానీ హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో తనకు ‘వైశాలి’ లాంటి బిగ్‌ హిట్‌ అందించిన దర్శకుడు అరివళగన్‌తో మరో మూవీ చేశాడు. అదే ‘శబ్దం’. (sabdham movie) ఈ సూపర్‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లక్ష్మీ మీనన్‌, సిమ్రాన్‌, లైలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కేరళలోని ఓ మెడికల్‌ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్‌లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్‌ అవంతిక(లక్ష్మీ మీనన్‌) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్‌) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా (Shabdam Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..హరర్‌ చిత్రాలన్ని ఓకే ఫార్మాట్‌లో సాగుతాయి. భయపెట్టే దెయ్యాలు.. వాటికి ఓ ఎమోషనల్‌ నేపథ్యం.. చివరకు వారి చావులకు కారణమైన వారికి శిక్ష పడడం..దాదాపు అన్ని హారర్‌ థ్రిల్లర్‌ సినిమాల కథ ఇలానే ఉంటుంది. శబ్దం కథ కూడా ఇలాంటిదే.కానీ కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టేందుకు దర్శకుడు అరివళగన్‌ రొటీన్‌ జిమ్మిక్కులను వాడుకోకుండా కొత్తగా ట్రై చేశాడు. టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్‌ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఫస్టాఫ్‌ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుంది. హారర్‌ జానర్‌లో ఇదొక ప్రయోగంలా అనిపిస్తుంది. హీరో పాత్ర పరిచయం మొదలు.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం వరకు ప్రతీదీ సైంటిఫిక్ మెథడ్‌లో చెప్పారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్‌ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం మళ్లీ రోటీన్‌ హారర్‌ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఒక్కో ట్విస్ట్‌ రివీల్‌ అయ్యే కొద్ది సాధారణ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 42 దెయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యం తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతాయి. కొన్ని చోట్ల లాజిక్‌ మిస్‌ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే కొంతమేర కొత్తగా అనిపిస్తుంది. ఓ సీన్‌లో తెరపై బొమ్మ కనిపించకుండా చేసి కేవలం సౌండ్‌తోనే ప్రేక్షకుడిని భయపెట్టాడు. టెక్నికల్‌ అంశాలపై కొంత అవగాహన ఉంటే ఈ సినిమా బోర్‌ కొట్టదు. హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. పారానార్మల్ ఇన్వెస్టగేటర్ వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. డిఫరెంట్‌ లుక్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. నటన పరంగా ఆయనకు వంక పెట్టడానికేమి లేదు. ఇంటర్వెల్‌ వరకు ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిమ్రాన్‌ కూడా ఓ కొత్త రోల్‌ ప్లే చేసింది. డయానా పాత్రలో ఆమె చక్కగా నటించింది. నాన్సీగా లైలా తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. రిడిన్ కింగ్‌స్లే కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను నిలబెట్టాడు. కొన్ని సన్నివేశాలలో నటన కంటే బ్యాగ్రౌండ్‌ స్కోరే ఎక్కువ భయపెడుతుంది. డిఫరెంట్‌ బీజీఎంతో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

US Judge Halts Donald Trump Mass Firing Of Federal Workers9
ట్రంప్‌కు మరో బిగ్‌ షాక్‌.. బెడిసికొడుతున్న నిర్ణయాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి విలియం అల్సప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్‌ జడ్జి విలియం అల్సప్‌ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలినట్టు అయ్యింది.డొనాల్డ​్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ డోజ్‌ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. 🚨Shocking: US judge temporarily blocks White House from ordering mass firing of federal workers pic.twitter.com/YFlzyBjiDS— EverthingEverything (@EverthingEv) February 28, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్‌ నిర్ణయాల కారణంగా పలు విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్‌ఎయిడ్‌లో ఉద్యోగుల తొలగింపు, పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.US judge temporarily blocks White House from ordering mass firing of federal workers Ruling deals blow to efforts by Donald Trump and Elon Musk to shrink government workforce Source - Financial Times— Prime View News (@primeviewnews) February 28, 2025

Today Gold and Silver Price February 28th 202510
పసిడి ప్రియులకు శుభవార్త: మూడో రోజు తగ్గిన గోల్డ్ రేటు

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా మూడోరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త. ఈ రోజు (ఫిబ్రవరి 28) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
బీహార్‌లో పోస్టింగ్‌ ఇచ్చారని టీచర్‌ తిట్ల దండకం.. తర్వాత ఏమైందంటే?

పాట్నా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక బదిలీలు తప్పనిసరి.

title
బీజేపీ Vs స్టాలిన్‌: పోరాటానికి తమిళులు కలిసి రండి.. సీఎం పిలుపు

చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్ట

title
ఆప్‌ నెత్తిన కాగ్‌ మరో పిడుగు

న్యూఢిల్లీ: గత ఆప్‌ ప్రభుత్వానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్

title
నడ్డా స్థానంలో ఎవరు.. 15 రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు!

ఢిల్లీ: బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు

title
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్‌ అరెస్ట్‌

పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్ర

NRI View all
title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Advertisement

వీడియోలు

Advertisement