వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఏలూరు అర్బ : జిల్లాలో జరిగిన వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేఘాలయలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎ.బి.నాయక్ (50) విజయవాడ నుంచి వైజాగ్ Ðð వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో రైలు నూజివీడు స్టేష¯ŒS చేరుకునే సరికి సోమవారం రాత్రి కంపార్ట్మెంట్ గుమ్మంలో నిలబడిన అతను ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఎ¯ŒS.రాము ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భీమడోలు వద్ద..
రాజమండ్రి నుంచి ఏలూరు వస్తున్న మరో యువకుడు భీమడోలు రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. స్థానిక వెంకటాపురం పంచాయితీ నెహ్రూనగర్–2కు చెందిన దుప్పాల హేమారావు (20) అనే యువకుడు మూడు రోజుల కిందట కుటుంబ పనులపై రాజమండ్రి వెళ్లాడు. తిరిగి ఏలూరు వచ్చేందుకు మంగళవారం రైలు ఎక్కాడు. రైలు భీమడోలు స్టేష¯ŒS చేరుకునే సరికి హేమారావు రైలు నుంచి జారి పట్టాలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి..
ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది. భీమడోలు జ్యూట్‌మిల్ వంతెన సమీపంలో పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించినా ఫలితం లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని శరీరంపై నిలువు నీలం చారల పసుపురంగు చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ఉన్నాయని హెచ్‌సీ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.