తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక 07న
సంగారెడ్డి టౌన్: తైక్వాండో క్రీడా అండర్ 14,17,19 జిల్లా జట్ల ఎంపిన ఈ నెల 8న సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తామని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) కార్యనిర్వాహక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు యూనిఫామ్‌తోపాటు బోనాఫైడ్, ఆధార్‌కార్డులతో గురువారం ఉదయం 10 గంటలకు మైదానంలో హాజరు కావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 12 వరకు రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9866140016, 9493676216లను సంప్రదించాలని సూచించారు.