భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఐరాస బహుమతి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో భారత్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్దుల్ ఖదీర్ రషీక్ మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఐరాస తీర్మానాలు, సభ్య దేశాల ఓటింగ్ విధానాలు, నిర్ణయాలను లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పించే ‘గ్లోబల్ పాలసీ’ అనే ఓపెన్ సోర్స్ టూల్‌ని అభివృద్ధి చేసినందుకు రషీక్కు ఈ బహుమతి లభించింది.
అర్జెంటినాకు చెందిన మ్యాక్సిమిలనీ లోపెజ్, ఫ్రాన్స్‌కు చెందిన థామస్ ఫౌర్నైస్లు మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. సభ్యదేశాల ఓటింగ్ విధానాలపై పారదర్శకత తీసుకువచ్చే ఓపెన్ సోర్స్ టూల్‌ను అభివృద్ధి చేసేందుకు తాజా పోటీ నిర్వహించారు.