abhi ram
-
టాలీవుడ్లో ‘థర్డ్ థండర్’ షురూ.. ఫ్యాన్స్‌కి పండగే!
ఆకాశంలో ఉరుము.. మంచి మెరుపుతో తన ఉనికిని చాటుతూ శబ్దం చేస్తుంది. కొత్త జాబ్‌లో మెరవాలనుకునేవాళ్లను, తమ టాలెంట్‌తో సౌండ్ చేసేవాళ్లను ‘థండర్’ (ఉరుము)తో పోల్చుతారు. ఇప్పుడు అలా మెరవడానికి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మూడో తరం వారసుల ఎంట్రీ షురూ అయింది. ఈ ‘థర్డ్ థండర్’ని చూడటానికి ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం గౌతమ్ (మహేశ్ కుమారుడు) ఆల్రెడీ ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార కూడా దాదాపు ఎంట్రీ ఇఛ్చినట్లే. మహేశ్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ..’ లిరికల్ వీడియో సాంగ్‌లో సితార అదిరిపోయే స్టెప్లతో అలరించింది. అలాగే కృష్ణ కుమార్తె ప్రియదర్శిని (నటుడు సుదీర్‌బాబు భార్య) కుమారుల్లో చరిత్ మానస్ ‘భలే భలే మగాడివోయ్’, విన్నర్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు. (చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం) సుధీర్ హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందు తోన్న తాజా సినిమాలో చిన్నప్పటి సుదీర్లా కనిపిస్తాడు చరిత్. అలాగే రెండో కుమారుడు దర్శన్ ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌బాబు చైల్డ్ ఎపిసోడ్స్‌లో జూనియర్ మహేశ్‌గా నటించాడు. కాగా కృష్ణ మరో కుమార్తె పద్మావతి (భర్త జయదేవ్ గల్లా) కుమారుడు అశోక్ గల్లా ఆల్రెడీ ‘హీరో’ చిత్రంతో యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో కుమార్తె– నటి–దర్శకురాలు మంజుల తనయ జాన్వీ కూడా ‘మనసుకు నచ్చింది’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇటు ప్రముఖ దివంగత నటులు అల్లు రామలింగయ్య యాక్టింగ్ లెగసీని ఆయన మనవడు అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు (అల్లు రామలింగయ్య కుమారుడు అరవింద్ తెలుగులో అగ్రనిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే). ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అయితే అల్లు రామలింగయ్య కుటుంబానికి చెందిన నాలుగో తరం అల్లు అర్హ. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాకుంతలం’లో ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపిస్తుంది అర్హ. మరి.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. అభిరామ్ ఇక దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారులు సురేశ్‌బాబు నిర్మాతగా, వెంకటేశ్ హీరోగా హిట్టయ్యారు. సురేశ్ పెద్ద కుమారుడు రానా యాక్టర్‌గా మంచి ఫామ్‌లో ఉండగా, చిన్న కుమారుడు అభిరామ్ కూడా యాక్టింగ్‌నే ఎంచుకున్నాడు. తేజ తెరకెక్కించిన ‘అహింస’ చిత్రం ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. యువ రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవ మనవడు ఎంట్రీ కన్నడంలో కూడా మూడోతరం వారసులు నటన వైపు అడుగులు వేస్తున్నారు. దివంగత ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ ‘నిన్నా సానిహకే’ ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఇక రాజ్‌కుమార్ కొడుకు, నటుడు–నిర్మాత రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు యువ రాజ్‌కుమార్ సైతం హీరోగా సై అన్నాడు. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ యువ రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మిస్తోంది. రజ్వీర్ డియోల్, అగస్త్య నంద హిందీలోనూ.. తెలుగు నుంచి ఇంతమంది వారసులు వస్తుండగా అటు హిందీలో కూడా థర్డ్ జనరేషన్ రెడీ అయింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా నంద కుమారుడు అగస్త్య నంద ఎంట్రీ ఖరారైంది. ఈ బిగ్ బి మనవడు జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ‘ఆర్చీస్’ అనే ఓ వెబ్ షోలో నటిస్తున్నాడు. ఇదే వెబ్ ఫిల్మ్ ద్వారా శ్రీదేవి కుమార్తె ఖుషీ, షారుక్ కుమార్తె సునైనా పరిచయం కానున్నారు. ఇక ప్రముఖ నటుడు ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన కుమారులు సన్నీ. బాబీ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సన్నీ చిన్న కొడుకు రజ్వీర్ డియోల్ ఎంట్రీ ఖరారైపోయింది. అవనీష్ బర్జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా రజ్వీర్ పరిచయం అవుతున్నారు. ఇక సన్నీ డియోల్ పెద్ద కుమారుడు అంటే రజ్వీర్ డియోల్ సోదరుడు కరణ్ డియోల్ ఆల్రెడీ నటుడిగా కొనసాగుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ కార్డ్ ఈజీ అయినప్పటికీ ఈ వారసులపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను చేరుకుంటే ఫ్యాన్స్‌కి పండగే. వీరే కాదు.. మూడో తరానికి చెందిన మరికొందరు వారసులు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జెమిని కిరణ్ చేతుల మీదుగా ‘రెక్కీ’ఫస్ట్‌లుక్!
‘స్నోబాల్ పిక్చర్స్’ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 27, సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ ఆవిష్కరించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న ‘రెక్కీ"’ఫస్ట్ లుక్ ఆవిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్ కాపి అతి త్వరలో సిద్ధం కానుంది. -
సక్సెస్ కోసం ‘రెక్కీ’చేస్తున్నారు
‘స్నోబాల్ పిక్చర్స్’ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ‘రెక్కీ’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. -
ఆ పిల్ల అంటే నాకు ప్రాణం.. ఆసక్తి రేపుతున్న ‘శతఘ్ని’ ట్రైలర్
అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శతఘ్ని’. 2010 లో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎల్వీ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వాతి మండల్ హీరోయిన్గా నటిస్తోంది. కేరాఫ్ కంచరలపాలేం ఫేమ్ సుబ్బరావు, కిషోర్, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.. హైదరాబాదీ మూవీస్ ఫేమ్ గుల్లు దాదా ఇందులో చాలా కీలకమైన పాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.‘ఆ పేరంటే నాకు ఇష్టం, ఆ పిల్లంటే నాకు ప్రాణం’అనే డైలాగ్‌తో మొదలయ్యే ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఉత్కంఠను పెంచే విధంగా ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర నిర్మాత, హీరో దాసరి అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రూపొందించాం.. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.. కరోనా సమయంలో ఇబ్బంది పడే వారికి సహాయం చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. త్వరలో నే ఈ సినిమా కి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం.. ట్రైలర్ ఎంతో బాగుంది.. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు.. ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా నటించారు’ అని తెలిపారు. దర్శకుడు ఎల్.వి.శివ మాట్లాడుతూ.. చాలా కష్టపడి సినిమా ను తెరకెక్కించాము.. ఈ సినిమా కి నిర్మాతగా, హీరోగా అభిరాం గారు అందించిన సహాయం మర్చిపోలేనిది.. మధుర ఆడియో ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల కొంత ఆలస్యమవుతుంది అన్నారు. యాక్షన్-సస్పెన్స్-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోగా, రాం సుంకర ఫైట్స్ సత్య మాస్టర్ కోరియోగ్రఫీ ని అందించారు.. హర్ష ప్రవీణ్ సంగీతం సమకూరుస్తుండగా ఎం.డి. రఫీ సినిమాటోగ్రఫర్ గా , క్రాంతి (ఆర్. కె) ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. -
వెట్టిచాకిరి నుంచి పది మందికి విముక్తి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పదేళ్ల పాటు కట్టెలు కొట్టే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న పది మందికి సబ్ కలెక్టర్, ఆర్డీవో అభిరామి ఆదివారం విముక్తి కల్పించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని ఉట్కోట్టం ప్రాంతానికి చెందిన కుమార్(45) అదే ప్రాంతంలో కట్టెల దొడ్డిని నిర్వహిస్తున్నాడు. ఇతను కడంబత్తూరు ప్రాంతంలోని అదిగత్తూరు ప్రాంతానికి చెందిన పది మందితో పదేళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తమకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ బాధితులు ఆదివాసి సంక్షేమ సంఘం ప్రతినిధులను ఆశ్రయించారు. సంఘం ప్రతినిధులు తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి రహస్య సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఆదివారం ఉదయం కట్టెల దొడ్డిపై ఆమె తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరి చేస్తున్న పది మంది కి విముక్తి కల్పించారు. అనంతరం కుమార్‌పై కేసు నమోదు చేశారు. పది మంది బాధితులకు తాత్కాలిక సహాయం కింద రూ.1000 అందజేశారు. స్వయం ఉపాధి చేసుకోవడానికి రూ.25 వేల చొప్పున అందజేస్తామని ఆర్డీవో అభిరామి వివరించారు.