Abids police
-
చిన్నారిని కబళించిన వాటర్ ట్యాంకర్
హైదరాబాద్: ఆ చిన్నారి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు..కలలు..బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తుందనుకున్నాడు. కానీ, విధి కర్కశమైంది. వాటర్‌ట్యాంకర్ రూపంలో అకాల మృత్యువు ఆ చిట్టితల్లిని కబళించేసింది. ఆ కూతురిపై పెట్టుకున్న ఆశల్ని చిదిమేసింది. కళ్లముందే కన్న కూతురు ఆ ట్యాంకర్ చక్రాల కింద నలిగిపోతుంటే ఆ తండ్రి పడ్డ క్షోభ వర్ణనాతీతం. కూతురిని బడికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడంతో చిన్నారి విద్యార్థిని మృతి చెందింది. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలో నివాసముండే నరేశ్‌కుమార్ జైన్‌కు కూతురు దియాజైన్(8),కుమారుడు(3) ఇద్దరు సంతానం. దియాజైన్ గన్‌ఫౌండ్రీలోని రోజరీ కాన్వెంట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. రోజూ కూతురుని నరేశ్‌కుమార్ జైన్ పాఠశాలలో వదిలి వెళ్తుంటాడు. నరేశ్‌కుమార్ జైన్ ఎప్పటిలాగే కూతురిని పాఠశాలలో దింపే క్రమంలో ఇంటినుంచి బడికి బయల్దేరారు. నాంపల్లి నుంచి చాపల్‌రోడ్డు గుండా వెళ్లే క్రమంలో మెథడిస్ట్ చర్చి వద్దకు రాగానే తన ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో తండ్రి, కూతురు కిందపడిపోయారు. అయితే వీరి వెనుకనే వస్తోన్న వాటర్ ట్యాంకర్ వెనుక చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. నరేశ్ కుమార్ జైన్‌కు కాలి తొడలు, కడుపు భాగాల్లో తీవ్ర∙గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయాలతో ఉన్న నరేశ్ కుమార్ జైన్‌ను చికిత్స నిమిత్తం కింగ్‌కోఠిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన దియాజైన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసును ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మయ్య దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన కుటుంబసభ్యులు, విద్యార్థులు చిన్నారి దియాజైన్ మృతిచెందిన వార్త తెలియగానే బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పటివరకు తమ కళ్లముందే తిరిగిన చిన్నారి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నిన్నటివరకు సరదాగా పాఠశాలకు వచ్చి తమతో ఆడిపాడిన విద్యార్థిని మృతిచెందిన విషయం తెలియడంతో దియాజైన్ తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు
-
బ్రేక్..ఎటాక్..
►ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ ►పంజా విసిరేది ‘బ్రేక్’ సమయంలోనే ►ల్యాప్టాప్స్, హ్యాండ్‌బ్యాగ్స్ అపహరణ ►నిందితుడితో పాటు రిసీవర్లూ అరెస్టు సిటీబ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలనే టార్గెట్‌గా చేసుకుని ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ చోరీలు చేస్తున్న నిందితుడిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. మార్కెటింగ్ ముసుగులో ఆఫీసుల్లోకి ప్రవేశించే ఇతను టీ, లంచ్ బ్రేక్ల్లోనే పంజా విసురుతాడని మధ్య మండల డీసీపీ డి.జోయల్ డెవిస్ గురువారం వెల్లడించారు. నిందితుడి నుంచి 10 ల్యాప్టాప్స్, మూడు తులాల బంగారం, రూ.20.5 వేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. టోలిచౌకీ ఎండీ లైన్స్‌కు చెందిన షేక్ ఇబ్రహీం వృత్తిరీత్యా అత్తర్ల వ్యాపారి. వివిధ కార్యాలయాలకు తిరుగుతూ సుగంధద్రవ్యాలు విక్రయించే ఇతను అదును చూసుకుని చోరీలు చేస్తుంటాడు. 2012లో రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్ళిన ఇబ్రహీంకు ఒక దాంట్లో శిక్ష కూడా పడింది. మళ్ళీ 2015 నుంచి పాత పంథానే అనుసరిస్తూ పంజా విసురుతున్నాడు. ‘బ్రేక్’లో ఎంట్రీ ఇస్తూ... ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు టీ, లంచ్ బ్రేక్ సమయాల్లో కాస్త సేదతీరుతూ ఉంటారు. ఇదే సమయాన్ని ఇబ్రహీం తనకు అనువుగా మార్చుకున్నాడు. ఆయా వేళల్లో సుగంధద్రవ్యాలు అమ్మే నెపంతో ఆఫీసుల్లోకి వెళ్లి, అదును చూసుకుని అక్కడున్న ల్యాప్టాప్స్, మహిళల హ్యాండ్ బ్యాగ్స్ అపహరిస్తాడు. 2015 నుంచి ఇప్పటి వరకు అబిడ్స్, బేగంబజార్, సైఫాబాద్, హుమాయున్‌నగర్, పంజగుట్టల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 15 చోరీలు చేశాడు. చోరీ చేసిన తర్వాత బయటకు వచ్చే ఇతగాడు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా రెండుమూడు వాహనాలు మారుతూ ఇంటికి చేరుకుంటాడు చోరీ సొత్తును మల్లేపల్లి, టప్పాచబుత్ర ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మహ్మద్ ఇస్తాయిల్, మహ్మద్ అష్రద్ ఖాద్రీలకు విక్రయించేవాడు. సీసీ కెమెరాల ఆధారంగా.. ఇబ్రహీం ఈ ఏడాది జనవరి 13న నాంపల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కార్యాలయంలోకి ప్రవేశించి, అసిస్టెంట్ కమిషనర్ అమరేష్‌కు చెందిన ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ ఇన్స్పెక్టర్ ఎ.గంగారామ్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, డిటెక్టివ్ ఎస్సై డి.నరేష్ దర్యాప్తు చేపట్టారు. ఆ కార్యాలయంలో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్, సాంకేతిక ఆధారాలను బట్టి ఇబ్రహీంను అతడి ఇంట్లో పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మహ్మద్ ఇస్తాయిల్, మహ్మద్ అష్రద్ ఖాద్రీలను అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎవరిని పడితే వారిని రానీయకూడదని, వచ్చిపోయేప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని డీసీపీ జోయస్ సూచించారు. -
మాజీ ఎంపీ పాస్‌పోర్టు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీ ఎంపీ మందా జగన్నాథం పాస్‌పోర్టు చోరీకి గురైంది. కారులో వుంచిన ఆయన సూట్‌కేసును దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో ఉన్న పాస్‌పోర్టు, రూ. 90వేల నగదు, కొన్ని ఫైళ్లు ఉన్నాయి. మందా జగన్నాథం కారు డ్రైవర్ దృష్టి మళ్లించి సోమవారం ఆబిడ్స్ లో ఈ చోరీకి పాల్పడ్డారు. రోడ్డుపై పది రూపాయల నోటు పడిపోయిందని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో కారులో కూర్చునివున్న డైవర్ శ్రీనివాస్ రెడ్డి కిందకు దిగాడు. దుండగుల్లో ఒకడు కారు వెనుక డోర్ తెరిచి సీట్లో ఉన్న సూట్ కేసు తీసుకుని పారిపోయాడు. వీరిని పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు ఆబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇది స్థానిక దొంగల గ్యాంగ్ పని అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ టీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.