మాజీ ఎంపీ పాస్పోర్టు కొట్టేసిన కేటుగాళ్లు | passport of former TRS MP stolen | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ పాస్పోర్టు కొట్టేసిన కేటుగాళ్లు

Published Tue, Jul 15 2014 10:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

మాజీ ఎంపీ పాస్పోర్టు కొట్టేసిన కేటుగాళ్లు

మాజీ ఎంపీ పాస్పోర్టు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీ ఎంపీ మందా జగన్నాథం పాస్పోర్టు చోరీకి గురైంది. కారులో వుంచిన ఆయన సూట్కేసును దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో ఉన్న పాస్పోర్టు, రూ. 90వేల నగదు, కొన్ని ఫైళ్లు ఉన్నాయి. మందా జగన్నాథం కారు డ్రైవర్ దృష్టి మళ్లించి సోమవారం ఆబిడ్స్ లో ఈ చోరీకి పాల్పడ్డారు.

రోడ్డుపై పది రూపాయల నోటు పడిపోయిందని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో కారులో కూర్చునివున్న డైవర్ శ్రీనివాస్ రెడ్డి కిందకు దిగాడు. దుండగుల్లో ఒకడు కారు వెనుక డోర్ తెరిచి సీట్లో ఉన్న సూట్ కేసు తీసుకుని పారిపోయాడు. వీరిని పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు ఆబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇది స్థానిక దొంగల గ్యాంగ్ పని అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ టీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement