సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న మందా జగన్నాథం
అలంపూర్ రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తేదీ ఖరారైందని, ఈనెల 24వ తేదీన సీఎం జిల్లాలో పర్యటిస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం అన్నారు. బుధవారం ఆయన అలంపూర్‌లోని టూరిజం అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన అలంపూర్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పెద్దపీట వేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, అందుకు అలంపూర్‌ను ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తనకు కేంద్ర కేబినేట్ హోదాలో స్థానం కల్పించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంపై అతస్య ప్రచారం చేస్తోందని, అనవసర రాజకీయాలు పక్కనపెట్టి రైతు సంక్షేమం కోసం ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వం ఆర్టీఎస్ ను స సప్లిమెంటరీ చేయాలని రూ.800కోట్లను తుమ్మిళ్ల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేస్తుందని, అదేవిధంగా రూ.500కోట్లతో చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ఈనెల 24వ తేదీన సీఎం కేసీఆర్ పునాదిరాయి వేయనున్నారని తెలిపారు.
ఈ ప్రాంతం నుంచి ఎందరో వైద్యులు, మేధావులు వెలుగులోకి వచ్చినా ఈ ప్రాంతాన్ని ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయారని, సకాలంలో తుమ్మిళ్ల నీరు వచ్చేలా దగ్గరుండి పనులు చేయిస్తానన్నారు. అలాగే అలంపూర్‌లో ఆర్టీసీ డిపోలేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను సీఎం దష్టికి తీసుకెళ్లగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment