Thummilla
-
తుమ్మిళ్లకు ముఖ్యమంత్రి రాక
అలంపూర్ రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తేదీ ఖరారైందని, ఈనెల 24వ తేదీన సీఎం జిల్లాలో పర్యటిస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం అన్నారు. బుధవారం ఆయన అలంపూర్‌లోని టూరిజం అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన అలంపూర్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పెద్దపీట వేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, అందుకు అలంపూర్‌ను ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తనకు కేంద్ర కేబినేట్ హోదాలో స్థానం కల్పించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంపై అతస్య ప్రచారం చేస్తోందని, అనవసర రాజకీయాలు పక్కనపెట్టి రైతు సంక్షేమం కోసం ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వం ఆర్టీఎస్ ను స సప్లిమెంటరీ చేయాలని రూ.800కోట్లను తుమ్మిళ్ల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేస్తుందని, అదేవిధంగా రూ.500కోట్లతో చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ఈనెల 24వ తేదీన సీఎం కేసీఆర్ పునాదిరాయి వేయనున్నారని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఎందరో వైద్యులు, మేధావులు వెలుగులోకి వచ్చినా ఈ ప్రాంతాన్ని ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయారని, సకాలంలో తుమ్మిళ్ల నీరు వచ్చేలా దగ్గరుండి పనులు చేయిస్తానన్నారు. అలాగే అలంపూర్‌లో ఆర్టీసీ డిపోలేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను సీఎం దష్టికి తీసుకెళ్లగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తుచేశారు. -
అమ్మా.. సలామ్!
52 ఏళ్లుగా కొడుకు సేవలో తల్లి కంటికి రెప్పలాకాపాడుకుంటున్న మాతృమూర్తి మహబూబ్ నగర్ : ప్రపంచంలో మాతృమూర్తి ప్రేమ వెలకట్టలేనిది.. భూమికి భారమైనా తన కొడుకు తనకు మాత్రం చంటిపిల్లాడే అంటోంది ఆ తల్లి.. కాళ్లూచేతులు లేని ఆ బిడ్డకు 52 ఏళ్లుగా సేవచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, ప్రమీలమ్మ దంపతుల రెండో కొడుకు 52ఏళ్ల శివరామిరెడ్డికి పుట్టుకతోనే పోలియోతో కాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయి. ఐదు దశాబ్దాలుగా మంచంపైనే ఆయనకు తిండితిప్పలు. ఇదిలాఉండగా, మొ దటి కొడుకు అనారోగ్యానికి గురికావడంతో బాగుచేయించేందుకు ఉన్న పొలమంతా అ మ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇంతలో ఆ కొడుకు కూడా చనిపోయాడు. కొన్నాళ్ల తరువాత భర్త కూడా చనిపోవడంతో కూలీనాలి ప నులు చేస్తూ గంజోగట్కో తాపించి అవిటివాడై న శివరామిరెడ్డి బాగోగులు చూస్తోంది.. తన కొడుకు టీ తాగుతానంటే చేసిపెడుతుంది. అన్నం తినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె తనతో పాటు కుమారుడికి వచ్చే పింఛన్‌తో పూట గడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రమీలమ్మకు 85 ఏళ్లు.. వయసు మీదపడడంతో ప్రమీలమ్మలో కొడుకు గురించి ఆందోళన మొదలైంది. ఒంట్లో సత్తువ లేకపోవడంతో కూలీ పనులకు పిలిచేవారు లేరని కన్నీరుపెడుతోంది. తాను ఉన్నంత వరకు తన కొడుకును కంటికిరెప్పలా చూసుకుంటానని, తాను వెళ్లిపోతే వాడిని ఎవరు చూసుకుం టారోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కోసం కాకపోయినా కొడుకును పోషించడానికైనా దీర్ఘాయుష్షు ప్రసాదించమని వేడుకుంటోంది ఆ మాతృమూర్తి..!