'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది.
అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు.
అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు.
అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు.