ఐఎస్ ఉగ్రవాద నేత అబు సయ్యఫ్ కాల్చివేత
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సీనియర్ నేత అబు సయ్యఫ్ను అమెరికా కమెండో దళాలు మట్టుబెట్టాయి. సిరియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ నేతను రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హతమార్చినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు ఈశాన్య సిరియాలో సయ్యఫ్ను కాల్చి చంపాయి.
అతడి భార్య ఉమ్ సయ్యఫ్ను ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంలో విచారిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కార్యకలాపాలతో ఆమెకు కూడా సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఐఎస్ ఉగ్రవాదులు అక్రమంగా చమురు నిల్వలు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవటంలో అబు సయ్యఫ్ పాత్ర ఉన్నట్లు అమెరికా తెలిపింది.