వేస్ట్ మేనేజ్మెంట్పై కార్యాచరణ రూపొందించండి
► పురపాలక శాఖ అధికారులతో కేటీఆర్
► నగరంలో రూ.146 కోట్లతో గ్రీన్ క్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఏకీకృత విధానం అనుసరించేందు కు కార్యాచరణ రూపొందించాలని పురపాల క శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అకడమిక్ స్టాఫ్ కాలేజ్(ఆస్కీ) సహకారంతో మార్గదర్శకాలు రూపొందిం చాలన్నారు. చెత్త నిర్వహణ ఖర్చుతో కూడు కున్న అంశమైనా స్వచ్ఛమైన నగరాల కోసం ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చెత్త నిర్వహణ ప్రాజె క్టులపై శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహిం చారు. చెత్త నిర్వహణలో భాగంగా హైదరా బాద్‌లోని జవహర్‌నగర్ ప్లాంట్ వద్ద వ్యర్థాలకు గ్రీన్ క్యాపింగ్ చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా అక్కడ జలకాలుష్యం తగ్గుతుందని, పరిసర ప్రాంత ప్రజలకు దుర్వాసన బెడద ఉండదన్నారు.
రూ.146 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ పనులు ప్రారంభిస్తా మన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేసి చెత్త నుంచి వచ్చే కలుషిత జలాలను అక్కడికక్కడే శుద్ధి చేస్తామన్నారు. ఈ ఏడాది హరితహారంలో ఔషధ, సువాసనలు వెదజ ల్లే మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల యాజమాన్యాలతో సమీక్షించిన కేటీఆర్.. వాటి పునరుద్ధరణ అవకాశాలను అడిగి తెలుసుకున్నారు.
హైద రాబాద్ పరిధిలో 4 వేస్ట్ టు ఎనర్జీ కంపెనీల ప్రతిపాదనలేంటని, ఎప్పటిలోగా ప్రారంభ మవుతాయని ఆరా తీశారు. రెండు కంపె నీలు ప్లాంట్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ప్లాంట్ల మూసివేతకు కారణాలు, పునఃప్రారంభానికి అవకాశాలపై యాజమా న్యాలతో మాట్లాడారు. కాంట్రాక్టు ఒప్పం దంలో పేర్కొన్న నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. సమా వేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పుర పాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.