పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్బాబు మృతదేహం
నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు మృతదేహాన్ని పది రోజుల్లో భారత్కు పంపేలా చర్యలు తీసుకుంటామని చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ఆదివారం మీడియాకు తెలిపారు.
చిలీలో ప్రతికూల వాతావరణం ఉండడంతో జాప్యం జరుగుతోందన్నారు. అయితే మృతదేహాన్ని వారంలోగా పంపేలా చూడాలని తాను భారత ఎంబసీని కోరినట్లు ఆమె చెప్పారు.