అసలు ‘ఎర్ర’ దొంగలను అరెస్టు చేయూలి
రొంపిచెర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అసలు దోషులను అరెస్టు చేయూల ని వైఎస్సార్ సీపీ నాయకుడు, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రొంపిచెర్ల వుండలంలో ఆయన గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రవుం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిచ్చిలివారిపల్లెలో వూట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం సోదరుడు కూడ ఉన్నారని ఆరోపించా రు. అసలు దోషులను వదలిపెట్టి, కూలి కోసం వచ్చిన వారిని అరెస్టు చేయడం న్యాయుం కాదన్నారు. అటవీ, పోలీసుశాఖాధికారులందరూ సీఎం సోదరుని కనుసన్నల్లో నడుస్తున్నారని వివుర్శించారు. ఇందుకు ముఖ్యమం త్రి కూడ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం దొం గలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉందన్నారు.
కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు పెరిగిపోయూయని విమర్శించారు. తాను అట వీశాఖ వుంత్రిగా ఉన్నప్పుడు రాయులసీవు జిల్లాలో ఎర్రచందనం అక్రవు రవాణాను పూర్తిగా నివారించినట్లు చెప్పారు. ప్రస్తుతం కోట్ల రూపాయులు విలువ చేసే ఎర్రచందనం ఇతర దేశాలకు తరలిపోతోందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టలేని సీఎం కిరణ్ వెంటనే పదవికి రాజీనావూ చేయూలని డివూండ్ చేశారు. వైఎస్ హయుంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే, కిరణ్ పాలనలో ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతోందని ఆరోపించారు. గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.