కన్నతల్లిని నరికి చంపిన కొడుకు
ప్రకాశం(మార్టూరు):మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం కన్నతల్లిని నరికి చంపాడో ఓ కసాయి కొడుకు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చిట్టెమ్మ(57)ను ఆమె కన్న కొడుకు మత్తయ్య కిరాతకంగా చంపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.