వీడియో వైరల్: వాహ్.. వాటే క్యాచ్.. ఆల్ టైం గ్రేట్ క్యాచ్!
అప్పుడప్పుడూ క్రికెట్లో అసాధారణ విన్యాసాలు చూస్తూ ఉంటాం. బ్యాట్స్‌మెన్ అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావొచ్చు.. ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు కావొచ్చు. ఇలా ఎన్నో సూపర్మూమెంట్స్ను ఆస్వాదిస్తూ ఉంటాం. ఇలా ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ జరిగి రెండు దశాబ్దాల కావొస్తున్నా ఆ విన్యాసం మాత్రం ఇప్పటికీ వావ్ అనిపిస్తోంది.
1997లో కేప్‌టౌన్ వేదికగాభారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఫీల్డింగ్ మూమెంట్ అబ్బురపరచడమే కాదు.. ఆల్ టైమ్ టాప్-10 క్యాచెస్‌లో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1997లొ కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ జరగ్గా, ఆడమ్ బాచెర్ ఒక క్యాచ్ అందుకున్నాడు. అది కూడా భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్యాచ్.
మెక్మిలాన్ బౌలింగ్ భారీ షాట్ ఆడబోయిన సచిన్.. ఆడమ్ మార్క్ బాచెర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ షాట్‌ను కచ్చితంగా ఫోర్ వెళుతుందని ఊహించిన సచిన్.. బాచెర్ ఫీల్డింగ్ విన్యాసంతో ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా భారంగా పెవిలియన్ వీడాడు. బంతి గాల్లో ఉండగానే దాన్ని వెంటాడిన బాచెర్.. ఒంటి చేత్తో అందుకుని శభాష్ అనిపించాడు. నేడు(అక్టోబర్ 29వ తేదీ) మార్క్ బాచెర్ బర్త్ డే సందర్భంగా ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ సుప్రిమో ఆలీ బాచెర్ మేనల్లుడే మార్క్ బాచెర్. ఆనాటి మ్యాచ్ సదరు ఇన్నింగ్స్‌లో సచిన్ 169 పరుగులు చేశాడు.
Happy Birthday Adam Bacher 🇿🇦.
The nephew of cricket supremo Ali Bacher. Played 19 Tests & Scored 833 with 96 His top Score
One of Best Catch he Taken in 90s of @sachin_rt in Cape Town 1997 & even this catch should in all time top 10 catches. pic.twitter.com/20eEI0gnwV— Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) October 29, 2022