In addition
-
శిశు సంరక్షణకు రెండేళ్ల సెలవు : సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగి శిశు సంరక్షణ కోసం రెండేళ్ల పాటు నిరంతరాయంగా సెలవు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల వ్యాధులు, పరీక్షలు వంటివి కూడా శిశు సంరక్షణ కిందకే వస్తాయని న్యాయమూర్తులు ఎస్.జె.ముఖోపాధ్యాయ, వి.గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నిబంధనలు 730 రోజుల పాటు నిరంతరాయంగా శిశు సంరక్షణ సెలవు (సీసీఎల్) తీసుకునేందు కు అనుమతించవన్న కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వును న్యాయమూర్తులు తోసిపుచ్చారు. ‘వివిధ సర్క్యులర్లు, రూల్ 43-సి ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలున్న మిహ ళా ప్రభుత్వోద్యోగి తన సర్వీసు మొత్తంలో ఇద్దరు పిల్లల వరకు గరిష్టంగా 730 రోజుల సీసీఎల్ తీసుకోవచ్చు. పిల్లల సంరక్షణ అంటే కేవలం చిన్న పిల్లోడి బాధ్యతలే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన పరీక్షలు, వారికొచ్చే జబ్బులు తదితర అంశాలు కూడా దానికిందకే వస్తారుు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
గ్యాస్ డీలర్ల సమ్మెబాట
రేపటి నుంచి నిరవధికంగా... చమురు కంపెనీల తీరుపై కన్నెర్ర కొత్త ఏజెన్సీల ఏర్పాటు యత్నాలపై నిరసన జిల్లాలో 74 ఏజెన్సీల డీలర్లు సమ్మెలోకి విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏజెన్సీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 20 కొత్త గ్యాస్ ఏజెన్సీలు రానున్నాయి. వాటిలో విజయవాడ నగరంలో 5 కొత్త ఏజెన్సీలు ఏర్పాటు అవుతాయి. ఇవిగాక రాజీవ్ యోజన పథకం కింద కూడా గ్రామాల్లో మరికొన్ని సబ్ ఏజెన్సీలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త ఏజెన్సీలు వచ్చేస్తే ఇప్పుడున్న గ్యాస్ ఏజెన్సీలలోని కనెక్షన్లు కొన్నింటిని వాటికి బదిలీ చేస్తారు. దీంతో ఎంతో కాలం నుంచి వ్యాపారం చేస్తున్న గ్యాస్ డీలర్లు తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చేయని తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని వారు వాపోతున్నారు. వినియోగదారులను ఇక్కట్లకు గురి చేసే నిబంధనలు జారీ చేస్తున్న ప్రభుత్వం, స్పష్టమైన ఆదేశాలు లేకుండా దొంగనాటకం ఆడుతోందని విమర్శిస్తున్నారు. చమురు కంపెనీలు చేసే తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని డీలర్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా జరపతలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయటానికి గ్యాస్ డీలర్లు సమాయత్తమవుతున్నారు. సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 74 గ్యాస్ ఏజెన్సీల డీలర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. దాంతో లక్షలాది మంది వినియోగదారుల్లో కూడా గ్యాస్ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్ లింకుతో అవస్థలు... ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులతో పాటు డీలర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అనుసంధానం విషయంలో నిబంధనలు సరిగా లేకపోవటంతో డీలర్లు, వినియోగదారులు నానా అగచాట్లు పడుతున్నారు. బ్యాంకులలో, గ్యాస్ ఏజెన్సీలలో ఆధార్ లింక్ అయినా సబ్సిడీ వినియోగదారుల ఖాతాలలో జమకావటం లేదు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ ఎఫ్‌సీఐ (నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో ఆధార్ లింక్ అయితేనే గ్యాస్ వినియోగదారుల ఖాతాలలో సబ్సిడీ డబ్బు జమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ఎఫ్సీఐలో ఆధార్ లింక్ కాకపోవటంతో అక్కడ నుంచి డబ్బు జమకావటం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. 48 గంటలలోపు గ్యాస్ సరఫరా కాకపోతే చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు లక్షలాది రూపాయలు జరిమానాలు విధిస్తున్నాయని, చమురు కంపెనీలు సక్రమంగా గ్యాస్సరఫరా చేయకుండా వాటినుంచి ఆలస్యంగా గ్యాస్ వచ్చినా ఏజెన్సీలనే బాధ్యులను చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు సరిగా స్టాక్ రాకపోవటం వల్ల సరఫరాలో ఆలస్యం అయినా ఏజెన్సీలను బాధ్యులుగా చేస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆల్ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు నివరధిక సమ్మెకు సిద్ధమవుతున్నాయి. -
అధికారుల్లో ‘మార్పు’ అవసరం
పురిటినొప్పులు దాటని పథకం అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో సౌకర్యాలలేమి మూడు విభాగాల సిబ్బంది మధ్య సమన్వయలోపం అస్తవ్యస్తంగా గర్భిణుల గుర్తింపు సర్వే విజయవాడ, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో గర్భిణులను గుర్తించి, ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘మార్పు’ పథకం అగమ్యగోచరంగా మారింది. ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులు చూస్తున్నా, అందుకు అవసరమైన ప్రసూతి వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకుండా ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ మధ్య సమన్వయలోపం, అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యుల లేమితో ప్రసవాలు చేసే పరిస్థితి లేదు. మరోవైపు కార్పొరేషన్, అంగన్వాడీ, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ల సిబ్బంది మధ్య సమన్వయం లోపించడంతో నగరంలో గర్భిణుల సర్వే అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. ఒక ప్రాంతంలోని గర్భిణీని మూడు విభాగాలకు చెందినవారు రిజిస్ట్రేషన్ చేయడంతో లెక్కల్లో ముగ్గురిగా నమోదవుతున్నారు. దీంతో మార్పు నగరంలో సక్సెస్ అయ్యేనా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా జిల్లాలో మార్పు పథకం అమలుచేస్తున్నా సత్ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో 11లక్షల జనాభా కలిగిన నగరంలో సిబ్బంది, సౌకర్యాలు లేకుండా ఎలా సక్సెస్ అవుతుందనేది ప్రశ్న. పథకం లక్ష్యం ఇదే.. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) స్కీమ్‌లో అమలుచేస్తున్న మార్పు పథకం ద్వారా గర్భిణులను గుర్తించి, వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు కచ్చితంగా ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, మందులు కూడా ఉచితంగా అందించాలి. ఇందుకయ్యే వ్యయాన్ని ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా చెల్లిస్తారు. నగరంలో గర్భిణులను గుర్తించేందుకు చేస్తున్న సర్వేనే గందరగోళంగా మారింది. సర్వే చేసేందుకు కార్పొరేషన్ వద్ద సిబ్బంది లేకపోవడంతో ఆ భారం అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ల సిబ్బందిపై వేశారు. మరోవైపు కొన్ని డివిజన్లలో అంగన్వాడీలు సర్వే చేస్తున్నారు. అంగన్వాడీ, నగరపాలక సంస్థ, కు.ని. సిబ్బంది సర్వేల్లో ఒకే గర్భిణీని ముగ్గురు నమోదు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వేర్వేరుగా ఉండటంతో ఒకే గర్భిణీ మూడుచోట్ల రిజిస్టర్ అవుతున్నట్లు సిబ్బందే చెబుతున్నారు. మరోవైపు ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ల సిబ్బంది సర్వేకు వెళ్లడంతో సర్జరీ కోసం వచ్చే వారికి సమాధానం చెప్పేవారు లేకుండాపోతున్నారు. ప్రసూతి సౌకర్యాల లేమి నగరంలోని ప్రసూతి ఆస్పత్రులన్నీ సౌకర్యాలు, నిపుణుల లేమితో కునారిల్లుతున్నారు. చిట్టినగర్‌లోని షేక్‌రాజా ప్రసూతి ఆస్పత్రి మినహా రాజీవ్‌నగర్, విద్యాధరపురం, కృష్ణలంక, పటమటలోని అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగని దుస్థితి నెలకొంది. దీంతో అందరూ పాత ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి ప్రసవం కోసం వస్తున్న గర్భిణులతో పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగంలో పడకలు చాలని పరిస్థితి ఉండగా, మరింత మందికి ప్రసవాలు చేయడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. నగర జనాభా 11 లక్షలు ఉండగా, అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రిలో సైతం మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రోగులు సూచిస్తున్నారు. నగరంలో మార్పు అమలు విషయం నగరపాలక సంస్థ అధికారులు చూసుకోవాల్సి ఉందని జిల్లా వైద్యాధికారులు చెబుతుండగా, ఇక్కడి అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని రోగులు కోరుతున్నారు. -
ఎంజీఎం దుస్థితి...పధాని దృష్టికి
వరంగల్, న్యూస్‌లైన్: ‘జాతర నిధులకు ఎలాంటి లోటు లేదు. మరింత పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్లను గుర్తించాం. వాటి పనులను ప్రారంభించాం. జాతర రూట్లో ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నాం. గత జాతర సందర్భంగా కొన్ని గ్రామాల్లో వాహనాలు నిలిచిపోవడంతో క్రేన్ పెట్టి క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి గ్రామాలను, రోడ్లను గుర్తించి విస్తరిస్తున్నాం. జనవరి 30 వరకు రోడ్లన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధంగా ఉంటాం..’ అని ఆర్అండ్బీ ఎస్ఈ జె.మోహన్ నాయక్ అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్ల మరమ్మతులకు రూ.19 కోట్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో రూ. 19 కోట్ల విలువైన పనులకు టెండర్లు ముగిశాయని, రూ. 21 కోట్ల విలువైన పనులకు వచ్చే నెల 2న టెండర్లు పూర్తి చేస్తామన్నారు. జాతర పనులు, కొత్త రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మేడారం చుట్టూ కొత్త రోడ్లు గత జాతర సమయంలో ఏయే రోడ్ల వెంట, ఎక్కడ నుంచి ఎంత మంది వస్తారనే విషయాలను గుర్తించాం. పస్రా-గుండాల రోడ్లను డబుల్ లేన్‌గా విస్తరిస్తున్నాం. పస్రా నుంచి నార్లపూర్ వెంట మొత్తం 6 కిలోమీటర్లు, బయ్యక్కపేట వరకు 11.6 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మధ్యలో తెగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నాం. తాడ్వాయి, నార్లపూర్ వరకు 11 కిలోమీటర్ల రోడ్డును పెద్దగా చేస్తున్నాం. ఇక ఊరట్టం నుంచి మల్యాల వరకు 10 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నం. దీనికి మొదట అటవీ శాఖ అభ్యంతరం తెలిపినా తర్వాత క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. ఇక ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఈసారి నేరుగా మేడారం వచ్చేందుకు ప్రధాన రోడ్డును గుర్తించాం. కరీంనగర్ నుంచి భూపాపల్లి మీద గా బయ్యక్కపేట నుంచి నేరుగా మేడారం వచ్చేందుకు రోడ్డును నిర్మిస్తున్నాం. రూ. 4 కోట్లు కేటాయించాం. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే... పరకాల, జంగాలపల్లి, ములుగు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రావు. గ్రామాల రోడ్లు..రెండింతలు ప్రధానంగా గ్రామాల్లో ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోనే ట్రాఫిక్ ఆగిపోతోంది. దీంతో ఈసారి చుట్టూ ఉన్న గ్రామాల్లోని రోడ్లను రెండింతలు చేసే ప్రయత్నం చేస్తునా. నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్ గ్రామాల్లో రోడ్లను వెడల్పు చేస్తున్నాం. వట్టివా గు, తుమ్మలవాగుల నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పు డు వాటిపై రూ. 8 కోట్లతో రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పనులు మొదలుపెట్టాం. జంపన్నవాగుపై మరో బ్రిడ్జి జంపన్నవాగుపై మరో 100 మీటర్ల పొడవుగా కొత్త బ్రిడ్జిని ప్రతిపాదించాం. దీనికి రూ. 3 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడున్న బ్రిడ్జి పక్కనే దీనిని నిర్మాణం చేస్తాం. ఇక్కడ భూ సేకరణ సమస్య కూడా లేదు. గతంలో సేకరించిన భూమి ఉంది. జనవరి 30 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి తోడు సమ్మక్క గద్దెల నుంచి జంపన్నవాగు వరకు ఇప్పుడు డబుల్ రోడ్డును 10 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నాం. దీనికి కూడా నిధుల కేటాయింపు జరిగింది. దీంతో స్నాన ఘట్టాలకు వెళ్లేందుకు చాలా తేలికవుతుంది. ఇవన్నీ పూర్తి చేసి జాతర వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. ఇప్పటికే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను వేరే చోట్ల పనులు చేయనీయకుండా... మేడారం పనులనే కట్టబెట్టాం. వచ్చేనెల 2న మరో రూ. 21 కోట్ల పనులకు టెండర్లు పూర్తి కాగానే... త్వరగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. జాతర రూట్లోనే కాకుండా లింక్ రోడ్లన్నీ ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తున్నాం. వాటన్నింటినీ జనవరి 30 వరకు పూర్తి చే స్తాం.