అభయారణ్యం వింతలు చెప్పే అధ్యయన కేంద్రం
జన్నారం : కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంలోని వింతలు, విశేషాలు, వాటి ప్రత్యేకతలు, జంతువుల రకాలు, అరుపుల గురించి తెలియజేయడానికి మండలకేంద్రంలోని అటవీశాఖ నర్సరీ పర్యావరణ అధ్యయన కేంద్రంలో చిత్రపటాల రూపంలో పొందుపరిచారు. పర్యాటకులకు అడవిలోని అద్భుతాలను తెలియజేయాలనే ఉద్దేశంతో అటవీశాఖ రెండేళ్లక్రితం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధ్యాయన కేంద్రం ఎదురుగా అడవి దున్నల ఫొటోలు ప్రత్యక్షంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నారుు. పర్యాటకులను ఎంతగానే అకట్టుకుంటున్నా యి.
కేంద్రం లోపల పులులు, చిరుతలు, ఎ లుగుబంట్లు, నక్కలు, వివిధ రకాల జంతువు ల చిత్ర పటాలు ఉంచారు. లోపల ఒక ఎలక్ట్రికల్ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డుపై జంతువుల వద్ద ఉన్న బటన్ నొక్కితే ఆ జంతువు అరుపు వినిపించేలా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు ఇక్కడ చాలా ఆనందంగా గడుపుతారు. అధ్యయన కేంద్రం ఆవరణలో వివిధ రకాల పక్షుల ఫొటోలు, అడవి జంతువుల ఫొటోలను మనం గమనించవచ్చు. వేసవి వినోదానికి అధ్యయన కేంద్రం తోడ్పడుతుంది. జన్నారం బస్టాండ్ నుంచి అర కిలోమీటర్ దూరంలో కేంద్రం ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆటోల ద్వారా వెళ్లవచ్చు. కాలినడకన కూడా వెళ్లవచ్చు.