మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్‌కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.