Adulterated case
-
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
కల్తీ...మాయ..!
‘‘జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులోని ఓ దుకాణంలో సరిగ్గా ఏడు నెలల క్రితం కల్తీ నూనె విక్రయాలు జరుపుతుండగా వినియోగదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో సదరు అధికారులు దుకాణంపై దాడులు చేయగా కల్తీ నూనె విక్రయాలు బట్టబయలు అయింది. అంతటితో ఆగకుండా వినియోగదారులు పెద్ద ఎత్తున ఆ దుకాణం వద్ద ధర్నాకు దిగారు. అయినా జిల్లాలో నేటికీ కల్తీ నూనె విక్రయాలు ఆగలేదు.’’ సూర్యాపేట : జిల్లాలో కల్తీ మంచినూనె వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల ప్రాంతాల్లోనూ ఈ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. నూనె కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తూ సదరు వ్యాపారులు రూ.కోట్లు గడిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐఎస్ఐ మార్క్ లేకుండానే స్థానికంగా వివిధ వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన కల్తీ నూనెను మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ లోగోతో గుర్తించలేనంతగా చిన్న మార్పు చేస్తున్నారు. బ్రాండెడ్ పేరిట వాటిని అమ్ముతున్నారు. సదరు వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనికి తోడు ఐదు లీటర్ల క్యాన్‌కు అదనంగా వివిధ ఆఫర్లను ప్రకటించి ప్రజలకు అంటగడుతున్నారు. కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, తుంగతుర్తి, నేరేడుచర్లతో పాటు సూర్యాపేట కూరగాయల మార్కెట్ రోడ్డు, రైతుబజార్ మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో, ఎంజీ రోడ్డులో ఎక్కువగా ఇలాంటి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వలసవచ్చి తాత్కాలికంగా నివసించే కార్మికులు అధికంగా ఉంటారు. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ప్యాకెట్లతో నూనె దొరుకుతుందని సదరు కార్మికులు, ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా తమ ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. తూకంలో మోసాన్ని అరికడతాం.. మంచినూనె డబ్బాలు, ప్యాకెట్ల తూనికల్లో ఏమైనా తేడాలు , మోసం ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు పర్యవేక్షిస్తాం. తూకంలో జరిగే మోసాలపై వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కల్తీ జరిగినట్లు మాకు ఫిర్యాదులొస్తే చర్యలుతీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, తూనికలుకొలతల అధికారి, సూర్యాపేట కల్తీ నూనెలతో కేన్సర్ కల్తీ నూనెలతో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జంతు కళేబరాలతో ఆయిల్ తయారు కావడంతో కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఈ నూనెతో అతి రోస్కిమరోíనిస్ అనే పదార్థం ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నూనెలనే వాడాలి.– డాక్టర్ వూర రాంమూర్తియాదవ్, సూర్యాపేట క్రిమినల్ కేసులు తప్పవు బ్రాండెడ్ కంపెనీల పేరుతో కల్తీ నూనెలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కేసులు నమోదుచేశాం. కల్తీ నూనెల వల్ల పేద ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కల్తీ నూనెలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు జైలుకు పంపించి, భారీ జరిమానా విధిస్తాం. – తారాసింగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్, సూర్యాపేట -
అమానుషం..కొత్తమలుపు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రెండు నెలల క్రితం వెలుగుచూసిన బాలికల అక్రమ రవాణా కేసు కొత్తమలుపు తిరుగుతోంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో మరెన్నో కోణాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయని జోరుగా చర్చజరుగుతోంది. నిజాలు నిగ్గుతేలేనా..? నాలుగు దశాబ్దాలుగా పవిత్ర పుణ్యక్షేత్రంలో వ్యభిచారం జరుగుతున్నా.. పోలీస్, ఇంటెలిజె న్స్ వర్గాలు కళ్లు మూసుకున్నాయా..? అమానవీయ దందాలో రాజకీయ ప్రమేయం ఉందా..? బాలికల అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరు వైద్యులు ఎక్కడ..?. హర్మోన్ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పోలీసులు కాపాడిన బాలికలకు ఇప్పటి వరకు అందని పరిహారం. చిన్నారులు ఎవరో ఇంకా తేలని వైనం ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తు న్న అంశం సంచలనంగా మారింది. ఈ అంశాలన్నీ చర్చకు వచ్చి నిజాలు నిగ్గుతేలుతాయా అన్ని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అధికారులకు ఆదేశాలందడంతో.. పవిత్ర పుణ్యక్షేత్రంలో గత జూలై 30వ తేదీన వెలుగు చూసిన అమానవీయ బాలికల బలవంతపు వ్యభిచార దారుణాలపై విచారణ జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీసు, ఇతర శాఖల అధికారులను కోర్టు విచారణకు హాజరుకావా లని ఆదేశాలు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. మూడు రోజులుగా హైకోర్టులో ఈపాç ³ కూపంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో కంసాని కళ్యాణి అనే వ్యభిచార గృహనిర్వాహకురాలు బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో పొరుగింటి వారు ఇచ్చిన సమాచారంతో విషయం మొత్తం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బాలికల అక్రమ రవాణా ఇలా.. వ్యభిచార గృహ నిర్వాహకులు కొందరు బాలకలను కిడ్నాప్ చేసి ఎత్తుకొస్తారు. ఇంకొందరిని రూ.లక్షలు పోసికొంటారు. మరికొందరిని మా యమాటలతో పట్టుకొస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆడపిల్లలు తమ పిల్లలే అని చెప్పి స్కూళ్లలో చేర్పిస్తారు.ఎవరడిగినా తామే తల్లిదండ్రులని చెప్పాలంటూ చిత్రహింసలు పెడతారు. శరీర అవయవాలు పెంచేందుకు, యుక్త వయస్కులుగా కనిపించేందుకు ఇంజెక్షన్ల ద్వారా హార్మోన్లు ఎక్కిస్తారు.14ఏళ్లు రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు. చిన్నారులను రక్షించడానికి ఎవరైనా వస్తున్నారన్న అనుమానం వస్తే నేలమాళిగల్లో దాచిపెడుతారు. విపరీతమైన చిత్రహింసలకు గురిచేస్తూ వారిని వ్యభిచార కూపంలోకి దించుతారు. చిన్నారులను కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ఇచ్చే వ్యాపారులు ఉన్నారు.చిన్నారుల ఎదుగుదల కోసం హార్మోన్ల ఇంజక్షన్లు ఇస్తున్న డాక్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతిగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపిన ఈహార్మోన్ల ఇంజక్షన్లు ఎక్కడినుంచి వచ్చాయో తేలలేదు. సరఫరా చేసిన మెడికల్ షాపులు యాజమానులను ఇంతవరకు గుర్తించలేదు.దీంతోపాటు వ్య భిచార గృహాల నుంచి రక్షించిన చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించారు తప్ప వారి తల్లిదండ్రులను ఇంతవరకు గుర్తించలేదు. 36మంది బాలికలకు విముక్తి యాదగిరిగుట్టలో వ్యభిచార ముఠా దారుణాల పై రాచకొండ పోలీసులు 36మంది బాలికలకు విముక్తి కల్పించారు. ఈ వృత్తితో సంబంధం ఉ న్న 21మందిపై పీడీయాక్టు నమోదు చేశారు. 19వ్యభిచార గృహాలను సీజ్ చే సి 34మందిని అరెస్టు చేశారు. విముక్తి కల్పించిన బాలికలను సంరక్షణకేంద్రాలకు తరలించారు. -
సీల్ వేయకుండానే పరీక్షలకు..
* కల్తీ మద్యం కేసులో పోలీసుల నిర్లక్ష్యం * ఏపీ సీఎం బాబు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: విజయవాడ స్వర్ణ బార్లో ఐదుగురి మరణానికి కారణమైన మద్యం శాంపిళ్లను ఆహారభద్రతా విభాగానికి (ఎఫ్ఎస్ఎల్) పంపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటికి సీల్ వేయకుండానే ఎఫ్ఎస్ఎల్కు తరలించగా తీసుకొనేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. దీంతో పోలీసులు మళ్లీ సీల్ వేసి, ఎఫ్ఎస్ఎల్కు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నిర్లక్ష్యంపై బాబు తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుంటే మీ (పోలీసులు) వైఫల్యం వల్ల జాప్యం జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.