కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం సీజ్
హైదరాబాద్: కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మలక్‌పేట్‌లో కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రంపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 750 లీటర్ల కల్తీ నూనెతో పాటు తయారీకి వాడే యంత్రాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు