Adultery business
-
సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు.. విటుల్లో ప్రముఖులు?
కోదాడలో వెలుగుచూసిన సెక్స్‌రాకెట్ కలకలం సృష్టిస్తోంది. ఆన్లైన్లో అమ్మాయిల ఫొటోలను అప్లోడ్ చేసి విటులను ఆకర్షిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వ్యభిచార నిర్వాహకుల వద్ద రెగ్యులర్ కస్టమర్స్ పేరుతో ప్రముఖుల ఫోన్‌నంబర్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం కోదాడలో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, కోదాడ : పట్టణ కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో ఈ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అందివచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘాపెట్టి .. కోదాడ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఉప్పందింది. దీనిపై నిఘా పెట్టిన ఖాకీలు శనివారం దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు రిమాండ్ చెయ్యడంతో పాటు బాలికలను నల్లగొండ రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను పోలీసులు తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడినట్లు కోదాడలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిలో వాస్తవం లేదని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు నిప్పులేనిదే పొగరాదని ముక్తాయింపునిస్తున్నారు. విటుల్లో పలువురు ప్రముఖులు? నిందితుల వద్ద లభించిన సెల్ఫోన్లే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దానిలో ఉన్న నంబర్లు, వారితో తరచూ మాట్లాడిన వారి నంబర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేపనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన కొందరు ప్రభ్వుత ఉద్యోగులు, రాజకీయ నేతలు, పత్రికావిలేకరులు, వ్యాపారులు ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. తమ పేరు బయటకు రాకుండా పోలీసులను కాకా పడుతున్నారని, వారిపై పెద్దల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఇక్కడ ప్రచారం సాగుతుంది. పోలీసు కస్టడీలో నిందితులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన నిందితులను కోదాడ పోలీసులు తిరిగి తమ కస్టడీకి తీసుకున్నారని సమాచారం. వారి నుంచి పూర్తి వివరాలను రాబట్టి ఈ రాకెట్‌కు చెక్‌పెట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మా దృష్టికి కూడా వచ్చింది కట్టకొమ్ముగూడెం రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాము. కానీ మా వద్ద వాట్సప్‌లో కొంత మంది ప్రముఖుల వివరాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ వాస్తవంగా మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. జరుగుతున్న ప్రచారంపై విచారణ చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తాం. – శ్రీనివాసులరెడ్డి, పట్టణ సీఐ -
సెక్స్ రాకెట్ : మరో ఆరుగురికి విముక్తి
సాక్షి, యాదగిరిగుట్ట : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సాగిస్తున్న చీకటి వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా పోలీస్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. వ్యభిచార ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆరుగురికి విముక్తి కలిగించారు. ఆలేరు రైల్వేస్టేషన్లో వ్యభిచార నిర్వహకుడి అరెస్ట్ చేశారు. రక్షించిన వారిలో ఇద్దరు యువతులు, నలుగురు బాలికలు ఉన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం..!
యాదగిరిగుట్ట(ఆలేరు) : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సా గి స్తున్న చీకటి వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా పోలీ స్‌శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వ్యభిచార గృహాలు, ‘యాదగిరిగుట్ట’ నిర్వాహకులతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృం దాలు ఆయా ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాదగిరిగుట్టలో.. గత నెల 30వ తేదీ నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్‌నగర్‌లో పోలీసులు, ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక ని«ఘా ఏర్పాటు చేసి, బాలికలను అక్ర మ రవాణా చేస్తున్న ముఠాతో పాటు వ్యభిచార రొంపిలోకి దింపుతున్న 15మంది నిర్వాహకులను అరెస్టు చేసి ఇప్పటికే జైలుకు పంపించారు. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని కుటుంబాలు ఇళ్లకు తా ళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసిన వారు ఎక్కడికి వెళ్లారు.. వారి వద్ద ఎంత మంది చిన్నారులు ఉన్నారు అనే అంశాలతో, పిల్లలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అనే అంశాలపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానికంగా మొన్నటి వరకు ఉన్న నిర్వాహకులు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేసినట్టు సమాచారం. శనివారం యాదగిరిగుట్ట పరిసరాల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగిత్యాలలో సోదాలు ఇటీవల జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, మేడిపల్లి లో, రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్‌లో పోలీ సులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ధర్మపురిలోని వ్యభిచార గృహాల్లో సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు అమ్మాయిలతో పాటు ఇద్దరు నిర్వాహకులను, మెడిపల్లిలో ఆరేళ్ల వ యస్సు గల ఓ చిన్నారిని, ఇద్దరు వ్యభిచార నిర్వాహకులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మెరుపు దాడి ఈనెల 11వ తేదీన రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యభిచార నిర్వాహకులను యాదగిరిగుట్టలో పట్టుబడిన ముఠాతో సంబంధం ఉందని అక్కడి పోలీసులు వ్యభిచారగృహాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పాకనాటి పద్మమ్మ అలియాస్ పద్మ, పాకనాటి సావిత్ర, బునాద్రి సంధ్య అలియాస్ రేఖలను అదుపులోకి తీసుకుని ఓ బాలికను కూడా అక్కడి పోలీసులు రక్షించారు. అందులోనే ఉంటున్న మరో 5 మంది నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అబ్దులాపూర్‌మెట్ వ్యభిచార గృహంలో ఇబ్బందులు పడుతున్న ఓ యువతి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఆ గృహాలపై దాడులు చేయడంతో ఎనిమిది మంది నిర్వహకుల్లో ముగ్గురు దొరికినట్లు తెలిసింది. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కాపాడిన అమ్మాయిని 13 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు వ్యభిచార నిర్వహకుల మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే మరికొంత మంది నిర్వాహకులను అరెస్టు చేసి వారి చేతుల్లో బందీ లుగా ఉన్న బాలికలను, యువతులను రక్షించేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 17 మంది బాలికలకు విముక్తి పట్టణంలో కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ముఠా సభ్యుల నుంచి ఇప్పటికే 17 మంది చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పిం చారు. నిర్వాహకుల నుంచి విముక్తి కల్పించిన చి న్నారుల్లో కొంత మందిని మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్‌లోని ప్రజ్వల హోంలో, మరి కొంత మందిన స్త్రీ, శిశు సంక్షేమ అధికారుల పర్యవేక్షణ లో ఉన్నారు. బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూసుకుంటున్నట్లు తెలుస్తోం ది. బాలికలంతా ఎక్కడి నుంచి వచ్చారు, వీరి తల్లిదండ్రులు ఎవరు అనే అంశాలపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. -
వ్యభిచార వృత్తిలోకి విద్యార్థినులు !!
చిన ముంబైగా పేరుగాంచిన చీరాల ఇప్పుడు వ్యభిచారంలో కూడా మొదటి స్థానంలో ఉంది. సముద్రతీర ప్రాంతాల్లోని రిసార్టుల్లో గుట్టుచప్పుడు కాకుండా అనలేంగానీ బహిరంగంగానే వ్యభిచారం జరుగుతోంది. ఎప్పటిలాగే పోలీసులు అడపాదడపా తనిఖీలు నిర్వహించి చిన్నాచితక వ్యభిచారిణులు, విటులను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగంగా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న పెద్దోళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట వంటి నగరాల నుంచి విద్యార్థినులు కూడా వచ్చి పొడుపు వృత్తి సాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చీరాల.. సంప్రదాయాలకు, చేతివృత్తులకు ప్రధాన కేంద్రం. అంతేకాదు వస్త్ర వ్యాపారంలో రెండో ముంబైగా పేరుగాంచింది. ఇప్పుడు వ్యభిచారంలో కూడా చీరాల వార్తల కెక్కుతోంది. సముద్రతీర ప్రాంతంలో రిసార్టుల ముసుగులో పెద్దఎత్తున హైటెక్ వ్యభిచారం నిర్విరామంగా సాగుతోంది. పోలీసుల రైడింగ్‌లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న పెద్ద పెద్దోళ్లు తప్పించుకుంటుంటే సామాన్యులు చిక్కుతున్నారు. ముఖ్యంగా వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, గెస్ట్‌హౌస్‌ల్లో నిత్యం గాజుల మోత మార్మోగుతోంది. ఇటీవల ఒక్క టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో వ్యభిచారం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తపేటలో రోజుకోరకంగా వ్యభిచారం సాగుతోంది. సెలవు రోజుల్లో కాస్త సేద తీరేందుకు కుటుంబ సమేతంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటైన గెస్ట్‌హౌస్‌లు ఇప్పుడు వ్యభిచార కేంద్రాలుగా మారిపోయాయి. ఒకప్పుడు చాటుమాటున జరిగే వ్యభిచారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కింది. గతంలో వారాంత రోజులైన శని, ఆదివారాల్లో మాత్ర మే వ్యభిచారం జరిగేది. ప్రస్తుతం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నరసరావుపేటలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం చీరాలలోని వాడరేవు, రామాపురాల్లోని గెస్ట్‌హౌస్‌లకు కొందరు జల్సా చేసేందుకు వస్తున్నారు. వ్యభిచారం ఏ స్థాయిలో జరుగుతోందంటే రెండు నెలల కాలంలో చీరాల టూటౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలోనే 12 కేసులు నమోదుకాగా 18 జంటలను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. విద్యార్థినులే అధికం చీరాల వాడరేవులో ఉన్న అన్నీ గెస్ట్‌హౌస్‌ల్లో వ్యభిచారం కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, కొందరు వ్యాపారులు ఎక్కువగా వస్తుంటారు. అన్ని సౌకర్యాలతో పాటు జూదం, వ్యభిచారం చేసుకొనేందుకు గెస్ట్‌హౌస్‌లు అనుకూలంగా ఉన్నాయి. దీనికితోడు పోలీసుల దాడులు కూడా పెద్దగా లేకపోవడంతో రోజురోజుకూ వ్యభిచారం ఎక్కువైంది. వివిధ ప్రాంతాల నుంచి కేవలం వ్యభిచారం చేసేందుకే విటులు ఇక్కడికి వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యభిచారిణుల్లో విద్యార్థినులే అధికంగా వస్తుండటం గమనార్హం. వాడరేవులోని మూడు గెస్ట్‌హౌస్‌లపై ఈపూరుపాలెం ఎస్సై రాంబాబు ఆదివారం దాడి చేశారు. విజయవాడ, గుంటూరుకు చెందిన మూడు జంటలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాయి. నెల క్రితం వాడరేవు, కొత్తపేటలో పోలీసులు దాడులు చేయగా నాలుగు జంటలు పట్టుబడ్డాయి. చీరాల వాడరేవు, కొత్తపేట ప్రాంతాలు ఇప్పుడు వ్యభిచారానికి అనుకూలంగా ఉన్నాయి. కొందరు వ్యభిచారిణులను తమతో పాటు తెచ్చుకుంటుండగా మరికొందరికి గెస్ట్‌హౌస్ నిర్వాహుకులే సరఫరా చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే చీరాలలో వ్యభిచారాన్ని అంతం చేయడం అంత కష్టమేమీ కాదని స్థానికులు చెబుతున్నారు.