‘ఆరోగ్యానికి’ అందని డీజిల్!
పేరుకుపోరుున బకాయిలు
వాహనాలకు ఇంధనం పోయని బంక్ యజమాని
కదలని వాహనాలు..పిల్లలకందని వ్యాక్సిన్లు
ఎంజీఎం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు డీజిల్ దెబ్బ తగి లింది. బకారుులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శాఖ వాహనాలకు డీజిల్ పోసేందుకు బంకు యజమాని నిరాకరించాడు. దీంతో వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ ప్రచార వాహనాలు పదిహేను రోజులుగా ఎక్కడికక్కడే నిలిచిపోయూరుు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ వాహనాలకు డీజిల్ బకారుులు రూ.18లక్షల వరకు బంకు యజమానికి చెల్లించలేదు. జిల్లాలోని 69 పీహెచ్సీలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి వ్యాక్సిన్‌ను మూడు వాహనాల ద్వారా పంపిస్తుంటారు. దీనిని దఫాలవారీగా పంపిస్తారు. కాగా, జనవరి 27 నుంచి డీఎంఅండ్‌హెచ్‌ఓ వాహనాలకు డీజిల్ కొరత ఉండడంతో కొన్ని పీహెచ్సీలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయిందని సదరు అధికారులే ధ్రువీకరిస్తున్నారు. వాహనాలు పూర్తిస్థారుులో తిరగకపోవడంతో నగరంలోని సీకేఎం, జీహెచ్ఎం, ఎంజీఎం ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కూడా అంతంతగానే సాగుతోంది. అంతేకాక పల్స్‌పోలియో కార్యక్రమానికి వచ్చిన డీజిల్ నిధులను కూడా మా మూలు డీజిల్ డబ్బులు చెల్లింపులకు సైతం వాడుతున్నట్లు ఇమ్యూనైజేషన్ సిబ్బంది పేర్కొంటున్నారు.
కార్యాలయాలకే పరిమితం
జనాభా నియంత్రణకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు నిరంతరంజిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించే వైద్యాధికారులు, సిబ్బంది డీజిల్ కొరతతో కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సిన వైద్యులు డీజిల్ కొరత సాకుతో విధులకు ఎగనామం పెడుతున్నట్లు తెలుస్తోంది.
పడకేసిన పాలన
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పాలన పడకేసింది. డీజిల్ కొరత ఉన్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతోపాటు ఓ వర్గం కార్యాలయంలో కొన్నేళ్లుగా దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇప్పటికైనా జిల్లా అధికారి స్పందించి వెంటనే డీజిల్ కొరతను తీర్చి, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.